జాతక బలం - అచ్చంగా తెలుగు
జాతక  బలం
సత్యం ఓరుగంటి  

ఉదయం 9 గం, ఏవండీ  టిఫిన్ రెడి, కారు కూడా రెడీ సర్ , 
లాప్ టాప్ బాగ్ , లంచ్ బాక్స్ అన్నీ కారులో పెట్టు జమీల్, అలాగే సర్.
మళ్ళీ  ఫోన్  రింగ్, అయ్యా  లలిత గారట ? నేను ఆఫీస్ కి వెళ్ళ గానే  ఫోన్ చేస్తానని చెప్పు .
ఉమా నేను వెళ్ళొస్తా , లలిత ఏంటి ఇంత ఉదయాన్నే ? ఆఫీస్ కి వెళ్లి ఫోన్ చేస్తా, ఇప్పుడు టైం లేదు.
లలిత గారు బ్యాంకు లో పనిచేస్తారు , మంచి మనిషి , భర్తతో ఏవో స్పర్థలు , తల్లి తో కలిసి ఉంటారు ఇప్పుడు అమ్మే  ఆవిడకి అన్నీ, ఏ కష్టం వచ్చినా, జాతకం చూపించుకొని చెప్పిన సలహాలు చక్కగా పాటిస్తారు ఎందుకు ఫోన్ చేసారో ?
కారు బయలు దేరింది , వీధి లో నడిచే వాళ్ళు వంగి నమస్తే పెడుతూ విష్ చేస్తున్నారు , ప్రతి నమస్కారం  చేస్తూ నేను   అదొక  సంస్కారం ,  జాతకాల మూర్తి గారు అంటే అదో గౌరవం.   
ఈ ఫోన్  నీ దగ్గర పెట్టుకో మీటింగ్ అయ్యేవరకు, జాతకాల వాళ్ళతో పడలేం వాళ్ళకి మన పరిస్థితి తెలియదు, అడగటం ఓకే పట్టాన ఆపరు.
ఆఫీసులో పని అయ్యేసరికి మధ్యాహన్నం అయ్యింది,   సార్  డ్రైవర్ జమీల్ , చెప్పు జమీల్ , లలిత గారు చాలా సార్లు ట్రై చేసేరు మీరు మీటింగ్లో వున్నారని చెప్పెను , 
సెల్ నా కేబిన్ కి తీసుకు రా మీటింగ్ అయిపొయింది అన్నాను. సెల్ తీసుకుని నేనే ఫోన్ చేసెను లలితగారు ఏడుస్తూ చెప్పటం మొదలు పెట్టేరు, వాళ్ల అమ్మగారిని హాస్పిటల్ లో అడ్మిట్  చేసేరు... 
48 hours ఆబ్సెర్వేషన్  అన్నారుట. ఒక గంట టైం ఇవ్వండి జాతకం చూసి ఫోన్ చేస్తాను  భయపడకండి అన్నాను , సరే అన్నారు. బాగ్ తీసుకున్నా  జమీల్ కారు తియ్యి అన్నాను , కారు లో కూర్చొని లాప్ ఓపెన్ చేసాను  బ్యాంకు  లలిత గారు  ఫోల్డర్, లలిత గారి అమ్మగారు జాతకం తీసాను , ప్రస్తుత మహర్దశ , దశ , విదశ  అన్నీ చూసాను క్రిటికల్ గానే ఉంది నిజంగానే 2 రోజుల్లో దశ మారుతున్నది , మారిన దశ బాగుంది ఎలా ఇప్పుడు ?  ఆవిడకి ఉన్న  ఒకే ఒక సపోర్ట్ వాళ్ళ అమ్మగారు, ఆవిడ లేకపోతే ఈవిడ ఎలా ? ఎన్ని జాతకాలు చూసిన ఇప్పటికి పోనీ సందేహం ఒకటే జాతకం లో ఉన్నదే  అవుతుందా ?  పరిహారం చేస్తే మారుతుందా ? కొందరికి పరిహారం పనిచేసింది, కొందరికి లేదు ఏది కరెక్ట్ ?  ఫోన్ తీసాను భాస్కర శర్మ నెంబర్ దొరికింది, చెప్పండి మూర్తి గారు నేను భాస్కర శర్మ, శర్మ గారు మీరు ఇంతకు ముందు గ్రహ జపాలు చేసేరు, అవునండి, మృత్యుంజయ మంత్రం జపం చేసేరా ? "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్" లేదు సర్ మంత్రం వచ్చు  చెయ్యమంటే చేద్దాం , మీరు ఒక్కరు కాదు టీం కావాలి, అలాగే సర్ తెస్తాను, 6 గురు సరిపోతారు 3 రోజులు , రేపు పొద్దున్న నుంచి,  ఫోన్ నెంబర్ పంపిస్తాను, వాళ్ళకి నేను చెప్పెనని చెప్పండి, అలాగేనండి . లలిత గారికి ఫోన్ చేసి చెప్పెను శర్మ గారు ఫోన్ చేస్తారు అడ్రస్ చెప్పండి, రేపు ఉదయం నుంచి జపం మొదలు పెడతారు మీ ఇంట్లో, అలాగే మూర్తి గారు .
మరునాడు  ఉదయం 8.30 కి శర్మ గారు ఫోన్,  అడ్రస్ దొరికింది, లలిత గారి ఇంట్లో  జపం మొదలుపెట్టేరు. సాయంత్రం మళ్ళీ ఫోన్, శర్మ గారు జపం అయి బయలు దేరారు రేపు ఉదయం మళ్ళీ వస్తారు, రాత్రి లలిత గారు ఫోన్, అమ్మ గారు కొంచెం స్టేబుల్, ఇంకొక 24 గంటలు చూడాలి అన్నారు , సంతోషం రేపు శర్మ గారు వస్తారు జపం చేస్తారు చూద్దాం, నేను రేపు దొరకను మాకు బోర్డు మీటింగ్ ఉంది . అలాగే అంది లలిత గారు.
ఈరోజు  బోర్డు మీటింగ్ ఉంది , ఎజెండా రాత్రే రెడి అయ్యింది ,  ఆడిటెడ్ అకౌంట్స్  కాపీ కూడా రెడీ గా పెట్ట మన్నారు.
 ఎం.డి గారు ఈ  బోర్డు మీటింగ్ లో ఢిల్లీ లో ఉండే  డైరెక్టర్ గారు  కూడా అటెండ్ అవుతున్నారు. 
ఫోన్  రింగ్  అవుతోంది, సంగీతా ఫోను  చూడమ్మా , హలో ... విద్యాసాగర్ ట అయ్యా, చెప్పండి  విద్యాసాగర్, సార్  అన్ని  సెట్లు ప్రింట్ చేసి ఫోల్డర్స్ లో పెట్టి  రెడీ చేసెను , ఎం.డి గారు ఫైనల్ ఎజెండా మిమ్మల్ని అడగమన్నారు , రాత్రే రెడి చేసి మెయిల్ లో పెట్టెను , డౌన్లోడ్ చేసి  ప్రింట్ తీసి అన్ని ఫోల్డర్స్ లో పెట్టండి, నేనూ వస్తున్నాను ఒకే నా ? ఒకే సర్ .  
జమీల్ కారు రెడీ చేసుకున్నవా ? సంగీతా అమ్మకి టిఫిన్ పెట్టమని చెప్పు , మళ్ళీ  ఫోన్  రింగ్ ,  జి . ఎం సార్ ఉన్నారా అమ్మ ? ఎం.డి గారు మాట్లాడతారు,  సార్ ? నరసింహ మూర్తి గారు అన్నీ  రెడీ యేన ? రెడీ సార్ , 
బయలు దేరుతున్నారా ? అవును సర్ , ఓకే ఆఫీస్ లో కలుద్దాం .
కారు బయలు దేరింది,  సెల్ మోగింది, రిటైర్డ్  ఇంకంటాక్స్  కమిషనర్ సుబ్బారావు గారు , మూర్తి గారు మీరు చెప్పినట్లే మా అబ్బాయికి అబ్రాడ్ లో జాబ్ వచ్చింది వీసా కూడా ఒకే అయ్యింది. జాతకం చూసిన వారందరు 12 ఇల్లు చూపిస్తుంది వ్యయం , ఏపని జరగదు అన్నారు , మీరొక్కరే విదేశం లో జాబ్ వస్తుంది అన్నారు ఎలా ? 
వారు చెప్పింది నిజమే,  కానీ నాణెం కి రెండో వైపు కూడా చూడ గలగాలి , నిజం ఇండియాలో ఉంటే 100%  ఏపని జరగదు , అంత ఖర్చే ,   అదే 12 వ ఇల్లు కనెక్ట్ కాకపోతే అబ్రాడ్ కూడా ఉండదు , అందుకే నన్ను KP  మూర్తి గారు అంటారు, మీరు OVN మూర్తి కదా ? 
నిజమే సార్ kp నా ఇంటి పేరు కాదు , నేను నేర్చుకున్న జాతకం పద్దతి పేరు.
సార్ ఆఫీస్ వచ్చింది, ఉంటాను సుబ్బారావు గారు ఈరోజు బోర్డు మీటింగ్ , రాత్రికి మాట్లాడతా ఫోన్ కట్ చేసాడు. కారు పార్కింగ్లో పెట్టి లిఫ్ట్ లోకి నడిచేడు. వెనకనే డ్రైవర్ జమీల్ లాప్టాప్ బాగ్ తో , బోర్డు హాలు అంతా రెడీ గా ఉంది , ఫైల్స్ అన్ని రెడీ గా పెట్టేరు , కంపెనీ సెక్రటరీ అని బోర్డు ఉన్న చైర్లో కూర్చున్నారు మూర్తి గారు. 
ఇవన్నీ ప్రొసీసెర్స్  మాత్రమే , ఈ మీటింగ్లో పాస్ చేసే రెసొల్యూషన్స్  చెప్పాలి , అందరు ఫార్మల్ గా అప్రూవ్  చేస్తారు తరువాత ఫార్మల్ డిస్కషన్స్ అవుతాయి, మధ్యలో స్నాక్స్,  మీటింగ్ క్లోజ్ అవుతుంది.  మీటింగ్ స్టార్ట్ అయ్యింది అందరు డైరెక్టర్లు, ఎం.డి గారు వచ్చేరు, వారి వారి సీట్లలో కూర్చున్నారు, మూర్తి గారు యూ కెన్  స్టార్ట్ అన్నారు ఎం.డి గారు. లాస్ట్ AGM  డీటెయిల్స్ డిస్కషన్స్ అయిన తరువాత ఈ బోర్డు మీటింగ్లో  తీసుకోబోయే రెసొల్యూషన్స్ చదివేను, అందరు వారి ఆమోదం తెలిపేరు.   బోర్డు మీటింగ్ అయ్యింది.   ఎం.డి గారు నన్ను మూర్తి గారు మీ క్యాబిన్లో  వుంటారు కదా అన్నారు, అవును సర్ అన్నాను ఎందుకో తెలియదు.
ఫైల్స్ అన్ని అసిస్టెంట్ విద్యాసాగర్ కి ఇచ్చి  కేబిన్ లోకి వచ్చెను, డోర్ నాక్ చేసి  ఎం. డి గారు వచ్చేరు వెనుక కొత్త డైరెక్టర్ గారు, నేను లేచి నిలబడ్డాను నన్ను రమ్మంటే మీ కేబిన్ కి వచ్చేవాణ్ణి సర్ అన్నాను, ఇప్పుడు మీరు గురువు గారు మేమె రావాలి అన్నారు  ఎం. డి గారు,  కొత్త డైరెక్టర్ గారు  నమస్తే అన్నారు ,అర్ధం అయ్యింది నాకు కూర్చోండి అన్నాను, సిస్టం ఓపెన్ చేస్తూ. 
చౌహన్ గారి అమ్మాయి ఐ.ఎ.స్  కి అప్పియర్ అవుతోంది  మంచి ఇంటెలిజెంట్ ,  ఐ.ఎ.స్ సెలెక్ట్  అవుతుందా ?  ఎం డి గారి ప్రశ్న. 
బర్త్ డిటైల్స్  సిస్టం లో ఎంటర్ చేసెను , పుట్టిన ప్లేస్ అడిగెను , అమేఠి  అన్నారు , ఇందిరాగాంధీ గారి ప్లేస్ అన్నాను అవును అన్నారు , సిస్టం సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేశాను లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వచ్చేయి , చార్ట్ జెనరేట్ న్నాను , జెనరేట్ అయ్యింది , ఇత్నా  అడ్వాన్స్ హోగయా మూర్తిజి అన్నారు చౌహన్ గారు, హాజి, ఇస్  సాఫ్ట్వేర్ కా ధామ్ చాలీస్ హజార్ అన్నాను,  చౌహన్ గారు ఆశ్చర్యపోయారు.  మూర్తి సాబ్ భోలెతో 100% హాజాత అన్నారు మా ఎం. డి గారు, స్మాల్ కరెక్షన్, కుండలి మీ జో హై  ఓ మూర్తి  100% బతాతె అన్నాను నేను. జాతకం చూసాను  నిజంగానే అమ్మాయి చాలా తెలివైన పిల్ల, అమ్మాయి కనుముక్కు తీరు బాగుంటుంది, అందంగా ఉంటుంది అన్నాను హాజి అన్నారు చౌహన్ గారు, తల్లితండ్రులకు  గౌరవం ఇస్తుంది,  హాజి, అమ్మాయి పట్టిన  పట్టు వదలదు కొంచెం మొండి, కొంచెం నహి జాదా అన్నారు  చౌహన్ గారు, చిన్నప్పుడు 16 th ఇయర్ స్మాల్ ఆక్సిడెంట్, హాజీ  స్కూటీ సే గిర్ గయి ఏక్ హప్త హాస్పిటల్ మే. అన్నారు చౌహన్ గారు. సీట్లో అలర్ట్ అయ్యేరు చౌహన్ గారు, ఓరకంట గమనించేను ఇవ్వన్నీ చూసినవే , ముందు ఎదో సందేహం తో వస్తారు, వాస్తవాలు వినగానే  అలర్ట్ అవుతారు. లెక్కలు వేసెను ఈ దశలో ఐఏఎస్ సెలెక్ట్ కాదు , 2nd అటెంప్ట్  లో అవుతుంది అన్నాను , అభి నహి హువాతో షాదీ కరా దెతాహు  అన్నారు, చార్ట్ చూసాను, నహి హోగా పహాలే ఐఏఎస్ హోగా ఉస్కె  బాద్  షాదీ హోగా అన్నాను, ఎం. డి గారు మూర్తి సాబ్ భోలెతో ఓహి హోగా అన్నారు .
ఏ చార్ట్ సేవ్ కర్ దెతాహు, అప్ కో కబీబి  కుచ్ జాన్ న చాహియే తో ఫోన్ కర్ ది జిఏ  అన్నాను. ఇద్దరు బయలు దేరేరు డ్రైవర్ ని పిలిచి ఎయిర్ పోర్ట్ కి డ్రాప్ చెయ్యమన్నారు ఎం. డి గారు. 

మీటింగ్ అయి అన్ని విషయాలు పూర్తి అయేసరికి రాత్రి అయ్యింది, శర్మ గారి నుంచి ఫోన్, ఈరోజు వెళ్లడం అవలేదు జపానికి, బ్రాహ్మలు దొరకలేదు, రేపు ఉదయాన్నే వెళతాం అన్నారు, అదేంటి మధ్యలో అవాంతరం, సరే లెండి రేపు తప్పకుండా వెళ్ళండి, క్షమించాలి, పరవాలేదు మనచేతులో ఏముంది ? ఫోన్ కట్ చేసాను, మనసులో ఎదో కలవరం, రాత్రి భోజనం అయిన తరువాత లలిత గారి ఫోన్, ఇంతరాత్రి ఫోన్ ఏంటి ? చెప్పండి లలిత గారు, బోరుమంది ఆవిడ, అమ్మ లేదు మూర్తి గారు, ఏదైనా సహాయం కావాలా ? లేదండి మా మేన మామలు వచ్చేరు అంది ఆవిడ, ఉంటాను అన్నది లలిత గారు.
ఎదో సినిమా లాగా అనిపించింది, వెంటనే రాత్రి అయినా శర్మ గారికి ఫోన్ చేసాను రేపు మీరు వెళ్లనవసరం లేదు. శర్మ గారికి అర్ధం అయ్యింది. 

"ఎన్ని జాతకాలు చూసినా  ఇప్పటికి పోనీ సందేహం ఒకటే జాతకంలో ఉన్నదే  అవుతుందా ?  పరిహారం చేస్తే మారుతుందా ?"

***


No comments:

Post a Comment

Pages