జాగ్రత్తరా బాబు..!! - అచ్చంగా తెలుగు

జాగ్రత్తరా బాబు..!!

Share This
 జాగ్రత్తరా బాబు..!!
నాగ్రాజ్...

బంధాలు బాంధవ్యాలు
అనురాగం ఆప్యాయతలు
లాక్డౌన్ చేసి
సంపద సృష్టికి దారులు తెరిచాం

"తీరిక" 
ఆ మాటకు కర్ఫ్యూ విధించి
డబ్బువెంట శరవేగంగా
పరుగు లంఘించుకున్నాం

ఏం తిన్నాం ఎలా ఉన్నాం
పట్టింపు లేదు
ప్రకృతి పరిశుభ్రత 
లెక్కేలేదు

నిర్లక్ష్యపు నీలి నీడలు
కమ్ముకున్న మానవాళికి
ఒక పురుగు వేసిన లాక్డౌన్

జాగ్రత్తరా బాబు... జాగ్రత్త
ఇక ఏమాత్రం ఏమరుపాటు
పనికిరాదు

***

No comments:

Post a Comment

Pages