ఓ రైతన్నా!!! - అచ్చంగా తెలుగు
ఓ రైతన్నా !!!
పావని యనమండ్ర 

ఓ రైతన్నా !!!
పసిడి పంటలు పండించి
చిరునవ్వులు మోముపై చిందించి
చమట చుక్కలు నీ నుదుట తుడుచుకొని
గంజి నీళ్లకు నీకు కరువా ?
బెంజి కార్ల లో తిరుగుతూ
నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసారా ?
దళారుల మోసం తో నిన్ను కొనేసిందా ఈ ప్రపంచం
మరి అదే బియ్యపు గింజ లేదేమిటి నీ ఇంట్లో
ఇదేనా నీకు జరిగే న్యాయం ?
నిన్ను చూసాడా ఓ అన్న
నీ బియ్యపు గింజ తిన్న ఆ మనిషి ఓ రైతన్న ?
తాగడానికి నీకు నీరు లేదు కానీ
పండించడానికి ఇతరులకి మాత్రం నువ్వే  ఓ హామీ!!
ప్రభుత్వం ఇచ్చిందా నీకు బీమా
యేమని చెప్పావు మరి నీ చిరునామా ?
కరువు నీ ఒక్కడికేనా ?
నువ్వు తడిపే ఈ భూమికి ఇక నువ్వే భారమేనా?
నీ బరువు తీర్చేది ఎవరు చెప్పు ?
నిన్ను నువ్వుగా పరిచయం చేసుకోలేవా ?
దళారుల వ్యాపారము వద్దు ఇకనైనా
కొత్త ప్రపంచం చూడలేవా?
చావుని గెలుచుకొని రా ఇకనైనా
ఇది నీ జీవితం ఓ రైతన్నా !!!!!!
***

No comments:

Post a Comment

Pages