వయసు ఒక... - అచ్చంగా తెలుగు
వయసు ఒక .... 
వి. శ్రీనివాస మూర్తి 

తెల్లవారుజాము ఐదు గంటలు. అప్పుడే అమెరికా నించి వచ్చిన కృష్ణ సామాను లోపల పెట్టి సోఫా లో కూర్చున్నాడు.
“ఎలా ఉన్నారు నాన్నా"  ఎనభయి సంవత్సరాల రామయ్యను అడిగాడు అరవై ఏళ్ల కృష్ణ.
” ఐ ఆమ్ ఒకే  ,నీవు ఎలా వు న్నావు?? కోడలు, పిల్లలు అంతా బాగున్నారు కదా ??ఫోన్ లో అన్ని తెలుస్తున్నాయి  అనుకో అలవాటు కొద్దీ అడిగాను.మొహం కడుక్కో కాఫీ తాగుదాము . కృష్ణ మొహం కడుక్కొని వచ్చే లోపల మంచి వాసన తో వేడి కాఫీ కొడుకు కు ఒకటి తనకు ఒకటి తెచ్చుకొన్నాడు.” ఎందుకు నాన్న, నేను చేసేవాడిని కదా ఈ వయసులో మీకు శ్రమ". 
“దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి వచ్చావు. నాకు అలవాటే. ఎంతైనా నీవు నా కొడుకువే రా. పిల్లలు కు పనులు చేయడము తల్లి దండ్రులకు ఎంతో ఆనందం ఎంత వయసులొ అయినా .”
“మీరేమో వినరు. ఈ వయసులో ఒంటరి గా వద్దు వచ్సి మాతో వుండమంటే వుండరు. స్వతంత్రం గా ఉండాలంటారు.మాకేమో మనసంతా ఇక్కడే ఉంటుంది. మాకా ఇండియాకి షిఫ్ట్ అవడము కుదరదు. ఎన్నాళ్ళు ఇలా??  వంట మనిషి ఎన్ని గంటలకు వస్తుంది. రెగ్యులరు గా వస్తోందా.”
“ నేను వద్దన్నా వంట మనిషి ని పెట్టి వెళ్లారు. నాకు అది ప్రతిబంధకమే . ఆమె వచ్చే వరకు ఆగాలి.నాకు నచ్చినట్లు ఉండవు వంటలు. పైగా నాకు ఒంట్లో ఎంతో  శక్తి ఉంది. నాకు కాలము ఎలా గడవాలి.?? అంతే కాకుండా,ఎదో పనిలో నిమగ్నం కాక పోతే ఏవో పనికి మాలిన ఆలోచనలు. గతం గురించి గాని భవిష్యత్తు గురించి గాని. ఏమీ ప్రయోజనము ఉండదు. వంట ఆవిడకు అన్ని చెప్పాలి. చెప్పే లోపు చేసుకుంటే పోలా. నాకు కావలసింది నేను చేసుకొని  హాయిగా తింటాను. నాకు ఇదే సులభం గా ఉంది. నేను 80 ఏళ్ల వాడినని ఆలోచనే రానివ్వను మనసులోకి . మీరు నా గురించి దిగులు చెందకండి. మీ రందరూ సంతోషము గా ఉండి అప్పుడప్పుడు చూసి పోతుండండి. . పూర్తి గా శక్తి నశించినప్పుడు చూద్దాము ఏమి చేయాలో. కాసేపు విశ్రాంతి తీసుసుకో.నేను ఈ లోపల నా యోగ , ధ్యానము చేసుకొని వస్తాను.”
ఇప్పుడే నిద్ర రావాడము లేదు అంటూ హిందూ పేపరు తిరగవేస్తూ నాన్న చేసే యోగ చూస్తూ కూర్చున్నాడు. ఉప యోగ తో  మొదలు పెట్టి ప్రాణాయామం, తరువాత ధ్యానము లో దాదాపు 45 నిమిషాలు నిమగ్నమయ్యాడు. అలవోకగా కింద కూర్చుని అవన్నీ చేస్తుంటే ఆశ్చర్యము ఆనందము కలిగాయి కృష్ణ కు. ఆయన ముఖంలో ఏదో వర్ఛస్సు కనిపించింది. అవగానె " ఇడ్లీలు పెట్టాను  త్వరగా స్నానము చేసిరా అని పేపరు చదువుకొంటూ సొఫా లొ కూర్చున్నాడు రామయ్య . కొడుకు స్నానము చేసిరాగానె. ఇద్దరికి వేడివేడి ఇడ్లీలు చట్నీ తో వడ్దించాడు. . ఆ ఇడ్లీలు చట్నీ అమ్మ చేసినట్లే వున్నాయి. అయిదు సంవత్సారల క్రితం చనిపోయిన అమ్మ గుర్తు కొచ్చి  కళ్ల ల్ల్లొ నీళ్లు నిలిచాయి. అమ్మ పోతూ తన ఆరోగ్యం , వంటలో మెలకువలు నాన్న కు వదిలి వెల్లినట్లు అనిపించింది .
స్నానము చేసి వంట మొదలు పెట్టాడు నాన్న. మధ్య మధ్యలో అమెరికా  విషయాలు అడుగుతూ తన దైనందిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుతున్నాడు. వంటింట్లోంచి సాంబారు ఘుమఘుమలు ముక్కులులకు చేరుతున్నాయి.
“ఇంకా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నారా  నాన్నా” అంటే అవునరా రోజు ఒక గంట సేపు ట్రేడింగ్ చేస్తాను. మంచి  మంచి షేర్లు నా పేరు మీద చాలానే ఉన్నాయి. రోజూ ఒక అర గంట ఎకనామిక్ టైమ్స్ చదువుతాను. నా మైండ్ పదును గా ఉంటుంది.” డబ్బు కొసము కాదు . మనసును పదను పెట్ట డానికే. 
మాట్లాడు తుండ గానే భోజనము తయారు అయింది. కృష్ణ స్నానం ముగించుకొని అన్ని టేబుల్ మీద పెట్టడానికి నాన్న కు సహాయం చేసాడు. ఇద్దరు మాట్లాడు కొంటూ భోజనము తినడము మొదలు పెట్టారు. అన్ని చాలా రుచి గా ఉన్నాయి.ఎలా ఉన్నాయని అడుగుతూ ఇంకా కొంచెము వేసుకో అని వడ్డిస్తూ భోజనము ముగించారు.
కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి తాను కుడా నడుము వాల్చాడు.నాన్న గురించి అలొచిస్తూ  కునుకు తీసాడు .నాలుగు గంటలకు లేచి అల్లం టీ చేసి ఇద్దరికి తెచ్చాడు . రవీంద్ర భారతి లో సంగీత కార్యక్రము వుంది . వెల్దాము . అయిన తర్వాత హొటల్లొ భొజనము చేసి వద్దాము. రాగలవా అని కొడు కుని అడిగాడు. సరే అని బయలు దేరాడు. చక చకా నాన్న నడు స్తుంటే ఒకొ సారి అందుకో లేక పొయాడు .
పాటల  ప్రొగ్రాము చాల బాగుంది. నాన్న తాళం వెస్తూ. తల తిప్పుతూ నిమ గ్నమయి అనుభవించాడు. తను కూ డా చాల రొజుల తర్వాత మంచి ప్రొగ్రాము అనుభవించాడు. హొటల్లొ చక్కగా భొంచేసి ఇంటికి చేరారు. పళ్లు తొము కొని నిద్రకు ఉపక్రమించా రు నాన్న. తను కూడా నిద్ర కు ఉపక్రమించాడు క్రిష్ణ .
ఉదయం లేచేసరికి ఎనిమిది. నాన్న అప్పటికే లేచి పనులు చే సుకొంటున్నా రు . “నాన్న గారు ఈ మధ్య ఆరొగ్య పరీక్షలు చేయించు కొన్నారా ?? " అనగానే లొపలికి వెళ్లి  తీసుకొచ్చాడు . కొడుకుని నీవి కూడా ఫోన్ లో ఓపెన్ చేయి సరి చూద్దాం .క్రిష్ణ ఫోన్ లో ఓపెన్ చేయగా సరి చూ సి గర్వంగా చాల వరకు నావే మెరుగు గా వున్నాయి అని . ఒరే నీవు ఇంకా ఫిట్ గా వుండడానికి ప్రయత్నించు . సమయము చాల దని ఊరుకొకు .శరీరము, మనసు ఆరోగ్యము గా వుండేటట్లు  చూసుకో .
సరే నాన్న , మీ సంతొష జీవితానికి  మూలము ఏమిటి .
నాన్న క్లుప్తంగా " నా ఆనందానికి నేనే  కారణము అని నమ్ముతాను. బాహ్య మైన వాటికి ఎలా స్పందించాలి అనేది నా ఎంపిక అని నమ్ముతాను. ఉదాహరణకు ఎవరు నాకు కొపము తెప్పించాలని ఎంత ప్రయత్నించినా కోప పడడమా లేదా అనేది మన ఎంపిక .అలాగే అందరిని అన్ని వే ళలా మెప్పించాలి అని ప్రయిత్నించను. గతం గురించి గాని జరగబొయే దాని గురించి గాని అలొచనలు నా మనసు లొకి రానివ్వను . మనకు అందుబాటులొ వున్నది కేవలము ఈ క్షణము అని అనుకొంటాను. కష్టము అయినా సుఖం అయినా అంగీకరించి ముందుకు పో వాలని నా భావన. ఏ పని చేసినా పూర్తిగా నిమగ్నమయి చేస్తాను. నా వయసు నా అలొచన లొకి రానివ్వను. చిన్న పిల్లవాడి మనస్తత్వం తొ జీవించడము .తప్పు చేస్తె క్షమాపన. ఎదుటి వారిని క్షమించడము . లే ని వాటికి వ్యధ చెందక వున్నవాటికి ఆనంద పడడము .అందరిని ప్రేమ తొ 
చూ డడము ." ఇంతే . ముగించాడు. క్రిష్ణ మనసు పెట్టి విన్నాడు. కాసే పు  మౌనంగా వుండి పొయాడు. జ్ఞానొదయము కలిగినట్ల నిపించింది. ఏదో ఆలోచిస్తున్నావు అని నాన్న అడిగితే ఈ లొకంలొకి వచ్చాడు.
ఇంతలొ తాతయ్యా అంటూ పక్క ఇంట్లొ ని పాప వచ్చింది.  ఎత్తుకొని వొళ్లొ కూచో పెట్టుకొని ఆడించాడు. పాపతొ సమానంగా పరుగెత్తుతూ ఆడడు. పాప ఎలా చెప్తె అలా ఆడాడు. పాప అమ్మ పిలిస్తే వెళ్లింది. 
వారంలొ మూడు రొజులు. దగ్గర్లొ వుండే బడి లొ పిల్లలకు ఇంగ్లిషు ,లెక్కలు , నీతి బొధ చెప్తాను. అది ఎంతో ఆనందము కలిగిస్తుంది. చిన్న పిలవాడిని అయిపొతా. 
మన ఇంట్లొ అందరి  పుట్టిన రొజులకు అనాధ ఆశ్రమ పిల్లలకు లంచ్ ఏర్పాటు చే స్తాను. వాళ్ళ కళ్ళలొ అనందం నాకు మరింత శక్తి  ఇస్తుంది. ఇలా చెప్పుకొంటూ పొతున్నాడు. జీవించడము అంటే ఎమిటొ కొద్ది కొద్ది గా తెలుస్తూంది. 
అలా కొడుకు సెలవలు గడిచి పో యాయి.  ఇద్దరు కలిసి బాగా ఎంజా య్ చెసారు. బయట రకరకాల వంటలు రుచి చూసారు. కలిసి సిని మాలకి  వెళ్ళారు. చుట్టాల ఇళ్ళకి వెళ్ళారు. తొట పని చేసారు. చెస్ అడరు. స్నెహితుల్లా మాటలా డు కొన్నరు, రొజులు తొందరగా గడిచాయి, 
 తిరుగు ప్రయా నానికి రొజు వచ్చేసింది. ఇంతకు ముందులా దిగులు తో. వెళ్ళ డము లేదు. నాన్న స్వతంత్రంగా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు అనే త్రుప్తి. తొ  తిరుగు ప్రయాణము నకు సిద్ధమయ్యాడు. 
ఒరే అబ్బాయి , నా గురించి మీరు దిగులు పడకండి. వయసనేది  అని నాన్న అంటుండ గానే "ఒక సంఖ్య " అని కొడుకు భర్తీ చేసాడు. ఇద్దరు నవ్వుకొంటూ కౌగలించుకొని కారు ఎక్కారు విమానా శ్ర యానికి .

No comments:

Post a Comment

Pages