అదీ ఒక కవిత్వమేనా? - అచ్చంగా తెలుగు
అదీ ఒక కవిత్వమేనా?
పారనంది శాంతకుమారి.


పేదవాని ఆకలిని అంతం చేయలేని
కవిత్వం ఒక కవిత్వమేనా?
బీదవాని బాధలను అర్ధం చేసుకోలేని
కవిత్వం ఒక కవిత్వమేనా?
అట్టడుగు కులాలవారి అణచివేతని 
అడ్డుకోలేని కవిత్వం ఒక కవిత్వమేనా?
అర్ధంలేని ఆచారాలపై తిరుగుబాటు ప్రకటించలేని
కవిత్వం ఒక కవిత్వమేనా?
దైవంపేరుతో జనాలని దోపిడీ చేస్తున్న దొంగ స్వాముల వైనాన్ని
బట్టబయలు చేయలేని కవిత్వం ఒక కవిత్వమేనా?
కన్నవారిపై కరుణ చూపని కొడుకుల నీచత్వాన్ని నిలదీయని 
కవిత్వం ఒక కవిత్వమేనా?
న్యాయమేదో నివేదించని, ధర్మమేదో బోధించని
కవిత్వం ఒక కవిత్వమేనా?
సత్యాన్ని స్ప్రుశించని, సామరస్యాన్నిసృజించని
కవిత్వం ఒక కవిత్వమేనా?
మానవత్వాన్ని స్పందించని, మాధవత్వాన్ని అందించని
కవిత్వం ఒక కవిత్వమేనా?
కరుణని కురిపించని,మనసుని మురిపించని
కవిత్వం ఒక కవిత్వమేనా?
అర్ధం లేని రిజర్వేషన్లను తూర్పారబట్టని
కవిత్వం ఒక కవిత్వమేనా?
ఆడవారిపై జరిగే అత్యాచారాలను అసహ్యించుకోని
కవిత్వం ఒక కవిత్వమేనా?
 ***

No comments:

Post a Comment

Pages