నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే)--పరంజ్యోతి - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే)--పరంజ్యోతి

Share This
నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే)-పరంజ్యోతి
శారదా ప్రసాద్ 


హాయిగా సాగిపోతున్న నా జీవితంలో ఒక్కసారి పెద్ద తుఫాను వచ్చింది!అది హార్ట్ ఎటాక్. తుఫాను  శరీరంలోనే వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను! నాకు 1997 లో heart attack వచ్చి,ఆ తర్వాత Angioplasty with Stenting చికిత్సతో ప్రాణాలతో బయటపడ్డాను. బహుశః నేను చేయవలిసిన పనులు ఇంకా మిగిలివున్నాయేమో! నాకు గుండెనొప్పి రావటం నిజంగా నా జీవితంలో కెల్లా గొప్ప అపురూపమైన సంఘటన!నన్ను మేల్కొలిపిన సంఘటన!! మీరు నమ్మండీ, నమ్మకపోండీ - మరింత సుసంపన్నమైన, స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపటానికి రెండో అవకాశాన్ని ఆ సంఘటన నాకు భగవంతుని దయవల్ల లభించింది.కేర్ హాస్పిటల్ లో నాది మూడవ ఆపరేషన్.నాకు వేసిన stent పేరు, AKS స్టెంట్.అంటే, Abdul Kalam Soma Raju Stent. అలా Abdul kalam గారు నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తే కాకుండా,నాకు ప్రాణదాత కూడా అయ్యారు.ఒక వ్యక్తిని మనం నూరేళ్ళు గుర్తుంచుకోవాలంటే....ఆ వ్యక్తి నూరేళ్ళు బ్రతక నవసరం లేదు!ఒక్క రోజు ఇతరుల కోసం జీవిస్తే చాలు.కేర్ హాస్పిటల్ లో నేను చేరిన వెంటనే నన్ను చూడటానికి నా సహోద్యోగి,సోదర సమానుడు చిరంజీవి మాధవపెద్ది దుర్గాప్రసాద్  చూడటానికి వచ్చాడు. ఆ రోజుల్లో దుర్గాప్రసాద్ P.A. to G.M గా ఉండేవాడు. వెంకటరామన్(జనరల్ మేనేజర్)గారు హాస్పిటల్ వారితో మాట్లాడి, ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చెయ్యండి,ఖర్చు ఆంతా బ్యాంకు reimburse చేస్తుంది అని అక్కడికికక్కడే లెటర్ ఇచ్చారు.Staff  మేనేజర్ గా పనిచేయుచున్న మరొక మిత్రుడు Y.S.Prasad కేర్ హాస్పిటల్ ను వెంటనే approved list of hospitals జాబితాలో చేర్చి హాస్పిటల్ వారు ఇచ్చిన estimation amount మొత్తానికి draft పంపారు. ఇదంతా సంధానం చేయించింది ,నా తమ్ముడు చిరంజీవి చంద్రుడు!అలా, అంతమంది  సహకార,సహాయాల వల్ల నిలిచిన ఈ ప్రాణాన్ని--భగవంతుని దయవల్ల సుసంపన్నమైన,స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపటానికి రెండో అవకాశాన్నిపొందాను. ఇది నాకు లభించిన వరంగా నేను భావిస్తుంటాను.'Accept the things,your acceptance will be gifted ' అని మా నాన్నగారు చెప్పిన మాటల అంతరార్ధం  అర్ధం అయ్యింది.అప్పటినుంచి,నా ప్రవృత్తిలో చాలా మార్పు వచ్చింది. అంతవరకూ, నేను చాలా aggressive గా ఉండేవాడిని. నా జీవితంలో రెండే అధ్యాయాలు. అవి,హార్ట్ ఎటాక్  రాకముందు,హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత ! హాస్పిటల్ నుండి discharge అయి వచ్చే సమయంలో డాక్టర్ సోమరాజు గారి రూంకి వెళ్ళటం జరిగింది.ఆయన రూంలో గోడ మీద వ్రాసిన కొటేషన్ 'The greatest Healers are God and Time ' అన్నది నాకు  ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. నేను పూర్వం ఒక chain smoker ని!Red Wills cigarettes త్రాగేవాడిని.శ్రీ సోమరాజు గారు నేను వెళ్ళేటప్పుడు ఒక చక్కని సందేశం ఇచ్చారు.అదేమిటంటే!,"Mr.Sastry!you have to kill your wills,particularly Red Wills"అప్పటినుండి wills మరియు Red Wills నానుంచి పూర్తిగా తొలగిపొయ్యాయి. అప్పుడు నేను కొంత depression లో ఉండేవాడిని.నన్ను పలకరించటానికి నా సహోద్యోగి, మిత్రుడు,హితుడు అయిన శ్రీ కటకం సాంబశివరావు గారు వచ్చారు.అప్పుడు, నేను జోనల్ ఆఫీసు,గుంటూరులో పనిచేసేవాడిని."శాస్త్రి గారూ! ఎలా ఉన్నారు"అని ఆప్యాయంగా పలకరించిన సాంబశివరావు గారికి  నానుండి అప్రయత్నంగా వచ్చిన " I am searching for a black cat in the darkness " అన్న సమాధానం పూర్తిగా నచ్చింది.(పైన నేను చెప్పిన సమాధానం ఎక్కడో చదివిందే ,గుర్తుకు రావటం లేదు). వెలుతురులో నిష్ప్రయోజనమైన పనులు చేస్తూ అన్వేషణ చేయని వారికంటే,చీకటిలో అన్వేషణ చేసే మీరే గొప్ప! అని ప్రోత్సహించి నాకొక యోగమార్గాన్ని వివరించారు మిత్రుడు సాంబశివరావు. నేను అదే యోగమార్గంలో నేటికీ కొనసాగుతున్నాను!చాలామంది అన్నీ తమకే తెలుసుననే భ్రాంతిలోపడి నూతిలో కప్పలవలే ఉంటానికి ఇష్టపడుతారు!కానీ, ఈ విశాల ప్రపంచంలోకి వచ్చి ,తెలియని విషయాలు తెలుసుకోవటానికి ఇష్టపడరు! ' అహం ' అనే తెర మన కళ్ళను వాస్తవాలను చూడటానికి అడ్డుపడుతుంది.నా మిత్రుడు శ్రీ సాంబశివరావు గారు, నాతో పంచుకున్న విషయాలను మీతో కూడా పంచుకుంటానికి సంతోషపడుతున్నాను.అవి ఏమిటంటే---జ్ఞానానికి మనిషిలో అహంభావాన్ని పెంచే(పంచే) లక్షణంవుంది .సాహిత్యాభిలాష (చదవటం,వ్రాయటం,ఏదైనా కావచ్చు) కూడా జ్ఞాన సముపార్జనలో భాగమే కదా! ' తెలుసును ' అనే భావమే జ్ఞానం.ఆ ' తెలుసును ' అనే ' భావం ' ఏర్పడటానికి ఏది మూల కారణమో తెలిసిన రోజున 'తెలుసును ' అనేది 'భావం 'గానే మిగులుతుంది!తప్పితే,దానికి ' అహం' తోడు కాదు.అది తెలియకపోతే 'భావానికి 'అహం' తోడు కావటం తధ్యం. తెలియటానికి పనికివచ్చే సాధనం మాత్రమే మనలో ఉంది .తెలిసే ప్రక్రియకు మూలకారణం మాత్రం మనం కాదు.నేను తెలుసుకుంటున్నాను అనే భావం కాక , ' తెలియవలసిన అవసరం నా తత్వానికి వుంది ,తెలుస్తుంది ' అని భావన చేసుకోవాలి.అదే వాస్తవం కూడా! ఒక ప్రఖ్యాత రచయిత గొప్ప శాస్త్రవేత్త కాకపోవచ్చు!అలాగే, ఒక శాస్త్రవేత్త ప్రఖ్యాత రచయిత కూడా కాకపోవచ్చు.ఎందుకంటే, కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, అన్నీ తెలియవు!ఈ నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటం,తెలియటం అనేది నిత్యం జరిగే ప్రక్రియలు! అందరికీ అన్నీ తెలియడమనేది ఇప్పుడు నడుస్తున్న సృష్టి విధానంలో అసంభవం.తెలిసే విషయాలలోనూ, తెలిసే విధానంలోనూ,తెలిసే స్థాయిలోనూ కూడా వ్యత్యాసాలు ఉంటాయి.ఈ తెలియటమనేది వ్యక్తిపరమైనదీ,వ్యక్తి ప్రమేయంతో జరిగేది కాక, సృష్టి పరమైనదీ,సృష్టి ప్రణాళికలోనిదీ! కనుక,ఏయే తత్వమున్న వ్యక్తులకు ఎప్పుడు, ఏది,ఎలా తెలియాలో, తెలియబడాలో, అప్పుడే అవి తెలియబడుతాయి!!ఒకే విషయాన్ని కొందరు మరో కోణంలో చూస్తారు,వారికి అదే విషయం వేరొక విధంగా అర్ధమవుతుంది. అందుకే, ఆలోచించి నాకు  తోచిన, అందుబాటులో ఉన్న మంచి మార్గాన్ని ఎన్నుకుంటాను!" లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది పెంజీకటికావల ఎవ్వండు ఏకాకృతి వెలుగున్? అతని నే సేవింతున్"...(లోకాలు,చక్రవర్తులు, ప్రజలు అందరూ గతించిపోతే సూర్య చంద్రుల ప్రకాశం ఆగిపోయి కటిక చీకటి ఆవరించినప్పుడు ఆ చీకటికి అవతల పరంజ్యోతిగా ప్రకాశించేవాడిని నేను ప్రార్దిస్తున్నాను) మరికొన్ని వీలుచూసుకొని మరొకసారి! 
***

No comments:

Post a Comment

Pages