ఎంగిలి - అచ్చంగా తెలుగు
ఎంగిలి (హిందీ మూలం శ్రీ ఆరిగపూడి రమేష్ చౌదరి)
తెలుగుసేత- దాసరి శివకుమారి


“నిజంగా ఇది కష్టకాలమే గడ్డు పరిస్థితి అనుకుంటే గడ్డు పరిస్థితే కాదనుకుంటే కాదు. కాని మనం ప్రయత్నిస్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది అని పిళ్లైగారు తన భార్యతో ఏదో ఒక పొడుపు కథ చెప్పినట్లుగా చెబుతున్నారు. 
తన భర్త ఎవరు గురించి చెప్తున్నాడో ఆమెకు తెలుసు అయినా ఏమీ తెలియనట్లుగానే ఇంతకీ మీరు చెప్పే విషయం దేని గురించి మీ సోమసుందరం గురించేనా అన్నది. 
“అవును వాడి గురించే ఇంట్లో కనబడట్లేదు ఎక్కడికి వెళ్లాడు?”
“ఇంక ఎక్కడికి వెళ్తాడు ఏ బజారు పోయి ఉంటాడు.”
“సుమతి కనబడలేదు.”
“అది స్కూల్ కి వెళ్ళింది కదా?”
“స్కూల్ వదిలే సమయం అయింది కదా?”
“ఇంటికి వస్తూనే ఉండవచ్చు.”
“సోము గురించి సుమతి కి ఏమైనా ఆలోచన ఉన్నదా?”
“చిన్న పిల్ల అదే మా ఆలోచిస్తుంది? దానికి ఎలాంటి ఉద్దేశాలు అయినా ఉండవచ్చు, కానీ చివరకు నెగ్గేది నా మాటే. నేను నా కూతుర్ని ఏ కసాయివాడి కైనా ఇచ్చి చేస్తా కానీ ఒక అసమర్థుడుకి మాత్రం ఇచ్చి కట్ట పెట్టను. మీకు చెల్లెలి కొడుకు. మేనల్లుడు అయితే కావచ్చు, కానీ వాడు వట్టి దద్దమ్మ. వెనకాల పొలం పుట్రా లేదు. చేసేందుకు పని పాట లేదు. మంచి రూపసి కాడు. అతనిలో ఏం చూసి మన బిడ్డని ఇచ్చి పెళ్లి చేయాలి?”
“నీ ఉద్దేశం నాకు తెలుసు అనుకో, కానీ బావా అంటూ సుమతి ఏమైనా అభిమానం పెంచుకున్నదేమో అన్న అనుమానంతో అడుగుతున్నాను.”
“ అభిమానమా? భలేవాళ్లే అసల వాడిని  చూస్తేనే అది నొసలు చిట్లిస్తుంది, సరిగా మాట కూడా మాట్లాడదూ. ఏదో మేనత్త కొడుకు కాబట్టి ఎప్పుడైనా ఎదురుపడితే పెదాల మీదకు ఒక చిన్న నవ్వు తెచ్చుకుంటుంది అంతే అంతకు మించి మరేం లేదు.”
 “హూ.. సరే అయితే”
“మీరేమీ ఆదుర్దా కానీ హైరానా కానీ పడాల్సిన పనిలేదు మీ చెల్లెలితో నిర్మొహమాటంగా చెప్పండి నా కూతుర్ని నీ కొడుకుకిచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పండి.”
“చెప్పు..చెప్పు అంటే ఎలా చెప్పాలి? మా ఇళ్ళల్లో ఎప్పటినుండో బంధువులలోనే  పెళ్లిళ్లు జరుపుకునే ఆచారమే ఉన్నది.”
“ఏంటి కొనసాగేది మీరేమన్న ఇలాంటి పెళ్లి చేసుకున్నారా!లేదు కదా. మరి మీ అమ్మాయి పెళ్లి మాత్రం ఎందుకు చుట్టాలలో చేయాలి? నా కూతుర్లు నా కూతురులో ఏ లోపమన్నా ఉన్నదా! పెళ్లి కాకుండా ఇంటపడి అఘోరిస్తున్నదా? ఇవ్వాళ కాకపోతే రేపైనా మంచి సంబంధం చేసుకుని బతుకుతుంది.
ఆ...ఆ  అలాగే నువ్వు అన్నట్లుగా మంచి సంబంధమే చేద్దాం అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. మనసున తేలిక చేసుకోవడానికి సిగరెట్ వెలిగించి సాగాడు. పిళ్లైగారు ఏ విషయాన్నైనా ఎక్కువసేపు ఆలోచించరు. వచ్చిన సమస్యలు నిదానంగా వాటంతట అవే పరిష్కారం అవుతాయన్న ఆలోచనతో ఉంటారు. అది వ్యాపారమైనా కావచ్చు, తన కూతురి పెళ్లి విషయమైనా కావచ్చు.
“ఇంకొక్క మాట మీ చెల్లెలు వాళ్లు నా కూతురికి సరైన నగానట్రా ఏమైనా చేయించగలరా! కడుపునిండా తిండి పెట్టడమే గొప్ప. అసలు పెడదామనుకున్నా ఆ ఇంట్లో ఏమైనా ఉంటే కదా! అంటూ గారి భార్య ఒకటే నసపెట్టసాగింది.
“అవును నువ్వు అన్నది నిజమే అనుకో.”
“పెళ్ళంటూ జరిగితే రెండు సమాన స్థాయి గల కుటుంబాల మధ్య జరగాలి. మనం ఎక్కడ? వాళ్ళు ఎక్కడ?” 
“వ్యాపారంలో కలిసి రాకపోతే మనం కూడా  వాళ్లలాగే బీదరికం లోనే ఉండి పోయే వాళ్ళం వాళ్ల లాగానే ఒకటి రెండు ఎకరాల బీడు భూమితో కుస్తీ పడుతూ ఉండేవాళ్ళం “
“అలా అంటున్నారా పోనీ వాళ్లను కూడా వ్యాపారం చేసి చూపించమనండి, ఉన్న వ్యవసాయమే చేసుకోవడం వాళ్లకు రాదు. అటు వ్యాపారము తెలీదు, ఇటు వ్యవసాయము రాదు. అలాంటి వాళ్ళు దేనికి పనికి రారు.”
భార్య మాటలు విన్న పిళ్లైగారి కోపం నషాళానికి అంటింది, అయినా తమాయించుకున్నాడు.హద్దు,ఆపూ  లేకుండా అలాగే ఆమె నోటికి జడుస్తూ ఉంటాడు. అయినా మాటలు కూడతీసుకుంటూ సమానత్వం సంగతి పక్కన పెట్టు. చుట్టరికంని చూసుకోవాలి కదా!ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్ల వాడి చేతిలో డిగ్రీ ఉన్నది అన్నాడు.
“డిగ్రీ తో ఏం చేస్తాడు. ఒక మాదిరి ఉద్యోగం కూడా రాదు. ఈ రాజకుమారుడిని చూసి ఎవరైనా మూడు నాలుగు వందల కన్నా ఎక్కువ జీతం ఇవ్వటానికి ముందుకు వస్తారా ఏంటి? మీరు మేనల్లుడు అంటూ ఆ దౌర్భాగ్యుడికి  నా కూతుర్ని కట్టబెడితే ఆ తరువాత నాకు పిండాలు పెట్టాల్సి వస్తుంది. మీకు నేను మళ్లీ చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు న నా కూతుర్ని ఆ ఇంటికి మాత్రం పంపను. మీరు కలలో కూడా ఊహించుకో వద్దు కూతురికి మేనల్లుడికి పెళ్లి చేద్దామన్న ఆలోచన రానివ్వద్దు.” అంటూ ఆమె ఖరాఖండీగా చెప్పింది.
“కానీ వాళ్లు మన సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆ ఆశతోనే ఏవంక దొరికిన సోమ శంకరం ఇక్కడికి వచ్చి పోతున్నాడు. మరి అలాంటప్పుడు....”
“మరి ..లేదు, ఏమి లేదు మీరిలా అనుకునేటట్లు అయితే అతగాన్ని మన ఇంటి ఛాయలకు రానివ్వను. నా కూతురు పెళ్లి కాకుండా ఉండిపోయిన నాకిష్టమే. మళ్లీ మళ్లీ ఇది అంతా మీకు చెప్పను. మీరు మౌనంగా ఉన్నా, నేనే సోమశంకర్ కి తగ్గ సమాధానం చెప్పి పంపుతాను.
“వద్దు వద్దు నువ్వేం చెప్పొద్దు సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను. నువ్వే ఏదైనా రెండు మాటలు అంటే చుట్టాలు అందరూ కలిసి దాన్ని పెద్దది చేసి నానా రభస సృష్టిస్తారు.నీకు నేను చెప్పాలా? ఏంటి! నువ్వు చాలా తెలివిగల దానివి .బంధుత్వాన్ని అంత తేలిగ్గా తెంచుకోవడానికి నువ్వేమన్నా పిచ్చిదానివా? ఏ వ్యవహారం ఐన తెగేదాకా లాగవుకదా  అంటూ పిళ్లైగారు తన భార్యను చొచ్చగొట్టారు. వినియోగదారుణ్ణి మాటలతో మభ్యపెట్టి తియ్యతియ్యగా మోసం చేస్తూ వాళ్లను బురిడి కొట్టించి నట్లు భార్యను మాయ చేస్తూ ఉంటాడు.ఇంకా నవ్వుతూ నీకు విరుద్ధంగా ఒక్క మాట కూడా ఈ ఇంట్లో ఎవరు మాట్లాడారని ఏ పని జరగదని నీవు మాత్రం ఎరగని దానివా ఏంటి! అంటూ మరింత బుజ్జగిస్తూ, “ నా కండువా తీసుకురా. కొంచెం బజారు దాకా వెళ్ళొస్తానని” చెప్తూ  ప్రస్తుతానికి ఆ విషయాన్ని అడ్డుకున్నారు.  భార్య తెచ్చి ఇచ్చిన పై కండువా భుజంమీద వేసుకుంటూ ఇంట్లో నుండి బయటకు నడిచారు రామస్వామి పిళ్లైగారు. తన ఇల్లంత ఎవరో దుమ్ము ధూళితో నింపి నట్టుగా తనకు ఊపిరాడనట్లుగా అనిపించి బజార్లో సేద తీర్చుకోవాలని అనుకున్నారు.

పిళ్లైగారు బజారు నుండి ఇంటికి వచ్చేటప్పటికి కూడా మేనల్లుడు ఇంట్లో ఎక్కడ కనబడలేదు. బహుశా వాడు వెళ్ళిపోయి ఉంటాడు, అని అనుకుంటూ కొంత బాధ పడ్డాడు.కానీ ఆ బాధను బయటకు తెలియనివ్వకుండా ప్రశాంతంగా కనబడటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే భార్య అంటే భయం ఉన్నది.ఈ రోజు తను ధనవంతుడిగా,సమాజంలో పెద్ద మనిషి గా చలామణి అవుతున్నాడు అంటే దానికి కొంత కారణం భార్య కూడా. బయటి సమాజానికి అతడు చాలా పెద్ద వ్యాపారస్తుడు. అతడి పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల ప్రాంతాలకు బాగానే పాకినవి, కానీ ఇంట్లో మాత్రం ఇంటి ఇల్లాలే  యజమానురాలు.
ఒకప్పుడు రాజకీయంగా కూడా పావులు కదిపాడు. కానీ వ్యాపారంలో రాణించినట్లుగా రాణించలేకపోయాడు. ఇంకా వాటికి శాశ్వతంగా దూరంగా ఉండాలనుకున్నాడు. ఆ ఊళ్ళో  జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటూ, వాటిల్లోనే ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు.
పిళ్లైగారికి ముగ్గురు పిల్లలు.ముగ్గురిలోకి పెద్దది సుమతి, తరువాత వాళ్ళిద్దరూ మగపిల్లలు.ఒక విధంగా యజమానురాలైన భార్య,ఆమె చెప్పు చేతుల్లో ఉండే పిల్లలు. ఇలాంటి ఇంట్లో తనకు కావలసినంత సుఖము సంతోషము లేవని పిళ్లైగారు బాధపడుతూ ఉంటారు. బయటి ప్రపంచంలో సుఖసంతోషాలను వెతుక్కోవాలి. అలా వెతుక్కోవటం తప్పేమీ లేదనే  అభిప్రాయానికి గట్టిగా వచ్చాడు.కానీ తను ఉన్న ఊర్లో తనను ఎవరూవేలెత్తి చూపే అవకాశం లేకుండా నడుచుకునే చతురుడు కూడా.
భార్య పట్టు పట్టిందని కూతురు సుమతిని స్కూల్లో చదువు పూర్తికాగానే దూరంగా ఉన్న మద్రాసులోని ఒక కాలేజీలో చేర్పించారు. ఏ నెపంతో కూడా ఆ తర్వాత సోము మేనమామ ఇంటికి రాలేదు. సుమతి కోసం మద్రాసు వెళ్లి అక్కడి వీధుల్లో మజ్ను లాగా తిరగాలన్న ఆలోచన లేని వాడు. 
మేనల్లుడి విషయంలో పిళ్లైగారు మొదట్లో బాధపడ్డాడు. కొంత పశ్చాత్తాపం లాంటిది కూడా కలిగింది. ఆయన భార్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఉండటం సాగింది. పిళ్లైగారు కూడా ఆ తర్వాత నిశ్చింతగా ఉండసాగారు. ఎందుకంటే ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించి బాధపడే మనస్తత్వం కాదు గనుక. దేని గురించి తల బద్దలు కొట్టుకుని అలవాటు కూడా లేదు.
అప్పుడప్పుడు తనకు ఉల్లాసం,ఆనందం సమకూర్చుకోవాలని నెపంతో మద్రాసు వెళ్ళే వాడు తన ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊర్లోను పిళ్లైగారిని చాలామంది ఎరుగుదురు.మద్రాసు మహా పట్నంలో అతడిని గుర్తించే వారు లేరు.పెద్ద పట్టణాలలో ఉండే వాళ్ళు పక్క వాళ్ళ గురించే తెలియనంత విచిత్రంగా ఉంటారు. ఏదో ఒక ఊరు నుండి ఇక్కడకు వచ్చి పోయే వాళ్ళ సంగతి ఎవరికి పడుతుంది. 
మళ్లీ ఈసారి మద్రాసు వచ్చాడు పిళ్లైగారు. చాలా ఖరీదైన హోటల్లో దిగారు. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ దిగుతారు. ఆ హోటల్లో అయ్యే ఖర్చు సగటుమనిషి ఊహల్లో కూడా రాదు. పిళ్లైగారు హోటల్ లో దిగగానే ఎప్పుడు వచ్చి కలుసుకునే వ్యక్తి వచ్చి కలిశాడు. పిళ్లైగారి ప్రతి కోర్కెను ఆజ్ఞ లాగా భావించి తు.చ తప్పకుండా ఆచరించే నమ్మినబంటు అతను. అతనే అచ్యుతన్.
అచ్యుతన్  గది తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి చేతులు జోడించి ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు జోడించి మరి నిలబడ్డాడు. “నేను మీ ఊరు ఎందుకు వచ్చేది నీకు తెలుసు తాజాగా అదిరిపోయే టట్లు ఉండి మనకు అనుకూలంగా.... అంటూ పిళ్లైగారు ఆపేశారు. ఇంకా ఎక్కువగా వివరించి అచ్యుతన్  కు చెప్పక్కర్లేదు. ఆ విషయం అచ్యుతన్ కి  అలవాటే.
“చూపులకు అచ్చం పోతపోసిన విగ్రహమే సార్ కానీ రాత్రి పూట కాదు సార్. మీరు సాయం కాలమే ఎదురు చూడాల్సి ఉంటుంది సార్ . “సరుకు మాత్రం సరి కొత్తగా ఉండాలని తెలుసుగా” అన్నారు పిళ్లైగారు. పక్కా వ్యాపారస్తుడు లాగా అచ్యుతన్ అలాగే నన్నట్లు గా తల ఊపాడు.
ఈలోగా పిళ్లైగారు తన కూతురు సుమతిని చూసి వస్తానని బయలుదేరి వెళ్లారు. తన ఊర్లో తన ఇంట్లో ఉన్న గ్రామీణ యువతి సుమతి ఇక్కడకు వచ్చి పక్కా మదరాసీ గా మారిపోయింది. వంపుసొంపులన్నీ  కనపడేటట్లు వేసుకున్నబట్టలు, తైల సంస్కారం లేకుండా గాలికి ఎగిరిపోయే పొడి పొడి వెంట్రుకలతో ఉన్నది. రోల్డ్ గోల్డ్ నగలు ఒంటిమీద మెరుస్తూ ఉన్నాయి. సుమతి ముఖంలో విచిత్రమైన కదలికలు ఆమె ఆహా భావాల్లో ఆడంబర కనబడుతున్నాయి. తమ పిల్లల్ని పల్లెటూరి బైతులు అనుకోకుండా నాగరికులుగా తయారుచేయాలని కలలుగంటూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పట్టణాలకు పంపి ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆ బాటలోనే నడిచి పిల్లలు ముఖ్యంగా బాలికలు తాము ఎంతో నాగరికులు అని నిరూపించుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే వాళ్లు, సుమతి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. పైగా ఆమె వైఖరి తండ్రికి  ఏమాత్రం నచ్చలేదు అసంతృప్తిగా హోటల్కు తిరిగి వచ్చాడు. భోజనం చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు ఆ తర్వాత మద్రాసు నగరంలో కాలక్షేపానికి వెళ్లాడు. నాలుగు అవుతూనే హోటల్కు తిరిగి వచ్చాడు. గదికి వచ్చి స్నానం చేసి తాజాగా తయారయ్యాడు.

బయట ఇంకా సంధ్య చీకట్లు అలుముకోలేదు. అచ్యుతన్  లోపలికి వచ్చాడు, చేతులు జోడించి అయ్యా!  మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. నేను వారితో అన్ని విషయాలు మాట్లాడాను. నేను ఇక్కడ వరండాలోనే ఉంటాను. ఏ అవసరం వచ్చిన గంట మోగించండి. నేను క్షణాల్లో వచ్చి వాళ్తాను అన్నాడు.
“అలాగే”అంటూ దర్భంగా తలపంకిస్తూ పిళ్లైగారు స్నానాలగది కి వెళ్లారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది ఆయనకు లేదు స్నానాల గది నుండి తిరిగి వచ్చేసరికి మంచం మీద అలంకరణతో మెరిసిపోతున్న ఒక యువతి కూర్చుని ఉన్నది. ఆమెను చూస్తేనే పిళ్లైగారు అవాక్కయ్యారు. ఒంట్లో నెత్తురు చుక్క  లేకుండా పాలిపోయి కొయ్యబారి నట్లయింది. కళ్లముందు చీకట్లు కమ్మి అంతా వలయాలు వలయాలుగా కనబడసాగింది. ఎదురుగా మంచం మీద కూర్చున్న యువతి పరిస్థితి కూడా అంతకు తక్కువగా ఏం లేదు. ఇద్దరు కూడా ఒకరి వెనుక ఒకరు సూటిగా చూసుకోలేక కళ్ళు మూసుకుని నేలచూపులు చూడసాగారు. 
పిళ్లైగారే ముందుగా తెప్పరిల్లి, తన్నుతాను సంబాళించుకుంటూ  వచ్చావా సుమతి!  నువ్వు వచ్చి మంచి పని చేశావు, లేకపోతే నేను మీ హాస్టల్ కు మరోసారి వచ్చి కలుద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం తీరుబడిగా మాట్లాడుకుందాం అంటూ తనకు కలిగిన గగుర్పాటు దాచే ప్రయత్నం చేశాడు. సుమతి మంచం మీద నుండి లేచి నిలబడి నేల మీద ఉన్న తివాచీని కాలితో రాయ సాగింది. ఆమె తల మీద కొండ ఏదో వీరికి పడ్డట్లుగా ఉన్నది. తండ్రి అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేక విలవిలలాడుతూ లోలోపల రోధిస్తున్నది. “నాన్నగారే కదూ!  ఆయనే ఏంటి ఇలా ఈ పట్టణంలో అనుకుంటూ కంపించిపోసాగింది.

“నీ హాస్టల్ ఇక్కడికి దగ్గరేనా సుమతి?” 
మౌనంగా ఉండిపోయింది.
“నాకు తెలుసులే అప్పుడప్పుడు కాలేజీలో చదువుకునే ఆడపిల్లలు ఇక్కడకు వచ్చి కాఫీలు టీలు తాగి వెళుతుంటారు నువ్వు కూడా అలాగే వచ్చావా! కాఫీ ఏమైనా చెప్పించడం అన్నావా! అంటూ గంట కొట్టాడు.
సుమతి తను లోపలికి వస్తూనే అచ్యుతన్ కి చెప్పే వచ్చింది లోపలి నుంచి గంట శబ్దం వినబడగానే నువ్వు లోపలికి వచ్చేయాలి హాజరు గా ఉండు అని.
దాంతో బాగా పెందలకడనే గంట శబ్దం వినిపించే సరికి అచ్యుతన్ గాభరాగా పరుగెత్తుకు వచ్చాడు ఏం సాబ్ సరకు నచ్చలేదా చాలా ఎంపికచేసి తెచ్చిన సరకిది. ఇక్కడి వాళ్ళు ఈ సరకును....

నోర్ముయ్ వెళ్లి కాఫీ తీసుకురా! అని చెప్పి చిరునవ్వు చిలకరిస్తూ సుమతీ వంక తిరిగాడు పిళ్లైగారి చిరునవ్వు వెనక బడబాగ్ని ఉన్నది. సుమతిని ముక్కలు ముక్కలు చేయాలా, లేక తనే స్వయంగా పొడుచుకుని చావాలా అని ఆలోచించాడు. సుమతి ప్రవర్తన ఏంటి ఇలా ఉన్నది సిగ్గుతో చితికిపోతున్నాననుకొన్నాడు. తండ్రీ కూతుళ్లు ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా ! సుమతి ని కలవాలని ఈ హోటల్కు నా లాంటి ఎంతో మంది వచ్చి ఉంటారు. ఓరి భగవంతుడా!ఇప్పుడు ఏం జరుగుతుంది. 
ఆ విషయాన్ని కాకుండా మరేదైనా మాట్లాడాలి. “అమ్మ ఏమైనా ఉత్తరం రాసిందా సుమతి”
“లేదు నాన్నగారు!” అంటూ గోడ వైపు తిరిగి నిలబడింది.
ఒకరికి ఎదురుగా ఒకరు ఉన్నారు కానీ తల ఎత్తి ఎదుటి వారిని చూడాలని ఇద్దరికీ లేదు.
“అమ్మ నిన్ను తీసుకురమ్మని నన్ను పంపింది సామాను సర్దుకుని సిద్ధంగా ఉండు”
ఆ మాటలు విన్న వెంటనే గబాల్న లేచి నిలబడింది. పెద్ద పెద్ద అంగలు వేస్తూ గది నుండి బయటకు నడవబోయింది. ఆమెకు నిప్పుల మధ్యలో నిలబడినట్లు గాను నాలుగు వైపుల నుండి అగ్నిజ్వాలలు తనను గ్రహించటానికి వస్తున్నట్లుగాను అనిపించింది.
“కాఫీ తాగు వెళ్ళు సుమతి” అన్న పిళ్లైగారి మాటలు వినిపించుకో నట్లుగా సుమతి బయటకు వెళ్ళిపోయింది. పిళ్లైగారు చేతులు కట్టుకుని గదిలో గబగబా పచార్లు చేయసాగారు అంతకంటే గబగబా ఆయన ఉచ్చ్వాస నిశ్వాసాలు వదల సాగాడు. రిసెప్షన్ కు ఫోన్ చేసి వెంటనే తన బిల్ సిద్ధం చేయమన్నాడు. ఇంకెప్పుడు ఈ హోటల్లో అడుగు పెట్టనని ఒట్టు పెట్టుకున్నారు.

మద్రాసు నుండి పిళ్లైగారు తన ఊరు చేరుకున్నారు. ఆలస్యం చేయకుండా తన చెల్లెలి ఇంటికి వెళ్లారు.ఇప్పుడాయన ముందు రెండు సమస్యలున్నాయి బంధుత్వాన్ని కాదనుకొని వాళ్లతో సంబంధం కలుపుకోనని అని చెప్పి వాళ్లను బాధ పెట్టాల్సి వచ్చింది.  ఆ బాధను తగ్గించడం మొదటి సమస్య. ఇంత జరిగిన తర్వాత ఏమీ జరగనట్టు వాళ్లతో సంబంధం కలుపుకోవడం కోసం వాళ్ళను ఒప్పించడం రెండవ సమస్య.తను వాటిని పరిష్కరించగల అవుతానన్న ధైర్యంతోనే అక్కడికి వెళ్లి మాటలు మొదలు పెట్టాడు
 సుమతి తెలివిగల పిల్ల తను బావనే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టు పట్టింది. వాళ్ళ అమ్మ కూడా కూతురు కోరికను కాదనలేకపోయింది. ప్రిన్సిపాల్ గారికి సుమతి అంటే కోపం, ఆ కోపంతోనే సుమతికి కాలేజీ నుండి టి.సి ఇచ్చి పంపేశారు. దాంతో నేను నా కూతుర్ని మద్రాస్ నుండి ఇంటికి తీసుకు వచ్చాను.
వాళ్ల నాన్న చెప్పే మాటలు సుమతికి కూడా అర్థం అయ్యాయి.ఆయన ఎందుకలా చెబుతున్నారో కూడా బాగా గ్రహించింది. పిళ్లైగారి భార్య ఎప్పట్లానే తన భర్త మీద యుద్ధం ప్రకటించింది. కానీ చివరకు కుక్కిన పేను లాగ ఉండిపోక తప్పలేదు.
పిల్ల పెండ్లి త్వరగా జరగాలని దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కాను ఆయన ఇలా దయతలచాడు. అంటూ  సోమసుందరం లోని మంచి గుణాలను అన్నింటిని అందరి దగ్గర ఏకరువు పెట్టసాగింది. ఇంతకుముందు సోము పేరు కూడా ఇష్టపడని ఆమె ఆ నోటితోనే సోముని  పొగడ్తలతో ముంచెత్తి సాగింది.

బీదవారికి వారి బీదరికమే పెద్ద సమస్య పిళ్లైగారు పిల్ల పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన చెల్లెలికి సంతోషమే కలిగింది. ఏదైనా కానీ ఇదివరకటి బంధుత్వం, ఇరు కుటుంబాల మధ్య ఆర్థిక తారతమ్యం వలన ఒకరికొకరు దూరమయ్యారు. ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ద్వారా మరల తన పుట్టింటి వారికి దగ్గరగా ఉండొచ్చు.అది చాలు తనకు అనుకున్నది. 
జరిగిన విషయానికి మౌనంగా అయిపోయాడు. రాత్రింబవళ్లు ఒకటే మధన పడతాడు తనలో తను మధనపడడం తప్పితే సుమతితో ఒక్క మాట మాట్లాడలేదు. సుమతి మాత్రం తండ్రి ఎదుట మౌనంగానే ఉండిపోయింది. కూతుర్ని చంపాలా లేక తానే చావాలా అని పిళ్లైగారు రెండు మూడు సార్లు ఆలోచించారు. కానీ బాధ్యతలు కట్టి పడవేసి మృత్యువు సంగతి మరుగున పడేసినాయి,కానీ లోపల్లోపల అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. క్షణిక విలాసం కోసం కక్కుర్తి పడి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు.
పాపం అమాయక సోమసుందరం బలై పోతున్నాడు బాగా డబ్బున్న తన మేనమామ బజార్లో ఎంగిలి చేసి పడేసిన భార్య జీవితాంతం భరించమని తనకు ఇస్తున్నాడని అతను ఊహకు కూడా అందని విషయం. సుమతి సోమసుందరంల వివాహ మండపంలో పిళ్లైగారు నిండా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చెడిపోయిన వస్తువును కూడా ఎంతో లాభంతో అవతల వారికి  అంటగట్టేసారు కనుక.
***

No comments:

Post a Comment

Pages