అక్షర చినుకులు - అచ్చంగా తెలుగు

అక్షర చినుకులు

Share This
అక్షర చినుకులు
 ...అఖిలాశ  

శ్రీ బండికల్లు జమదాగ్ని గారు రాసిన 'మట్టి నా చిరునామా' కవిత సంపుటి సాయంత్రం వేళ వర్షం కురిసినప్పుడు వచ్చేమట్టి సువాసన ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆయన అక్షరాల వర్షం మన గుండె నేల పై కురిసి ,మన హృదయం పరిమళభరితం అవుతుంది.
కదలిక అనే కవితలో మట్టి,రైతు మరియు విత్తనం యొక్క అనుబంధాన్ని చెప్తూ ,వారే నా చిరునామా అని ప్రకటించి తను బడుగు బలహీన వర్గాల కవి అని తెలియజేసారు.నువ్వంటే వెన్నెల అని తన ప్రియురాలిని వెన్నెలతో పోలుస్తూ రాసిన కవిత ప్రేమతత్వాన్ని భోదిస్తుంది. కరచాలనం ఒక సంగమం అని చెప్పి ఆ స్పర్శతో దుఃఖాలన్ని హరించుకుపోతాయి అంటారు. కాల చక్రాన్ని శాసించే సూర్య చంద్రుల గురించి చెప్తూ, ఆ కాల ప్రవాహంలో మనము కొట్టుకుపోతాము అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు.
కొన్ని ఛాయాచిత్రాలు జీవితానికి స్పూర్తినిస్తాయి మరి కొన్ని హృదయంలో పదిలమౌతాయి అంటూ ఛాయాచిత్రాల గొప్పదనం గురించి తన అభిప్రాయాన్ని విశ్లేషించారు. తొలకరి సొగసుల్లో తడిపి ముద్ద చేస్తూ ,చైతన్యము వైపు మౌన ప్రవాహలై సాగాలి అని తన ఆకాంక్షను వినయంగా ఆకుపచ్చని సందేశంతో మనకు తెలియజేస్తారు. గోదారమ్మ గొప్పదనం...మన తెలుగు బాష కమ్మదనాన్ని చక్కగా కవిత్వకరించారు.
ఈయన మంచి ప్రేమ కవి కనుక, నీ రూప లావణ్యమే,తలపుల బందిని,జ్ఞాపకాల నీడలలో చూపులకు ప్రేమనివ్వడం తెలుసు,ప్రేమంటే,ప్రేమికులం,నీ నవ్వు,చెక్కిలి అందం,ఎన్ని జన్మలైన,అణువణువులో,ఇలా చాల కవితలు ప్రేమ గురించి,భార్యభర్తల అనుబధం గురించి చక్కని భావుకతతో నింపేశారు.
***

No comments:

Post a Comment

Pages