పంచమాధవ క్షేత్రాలు -4 - అచ్చంగా తెలుగు
పంచమాధవ క్షేత్రాలు -4 
శ్రీరామభట్ల ఆదిత్య 

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం, రామేశ్వరం:
మన దేశ ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం ఒకటి. జ్యోతిర్లింగ శ్లోకాలలో సేతు బంధేతు రామేశ్వరం అనే పాదం క్షేత్రానికి సంబంధించినదే. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరలింగం ఏడవది. రామేశ్వరం తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో పంబన్ అనే దీవిలో ఉంది...రామేశ్వరం నాలుగు ప్రక్కలా సముద్రమే ఉంటుంది. పంబన్ అనే అతి పొడవైన బ్రిడ్జి ద్వారా మాత్రమే మనము రామేశ్వరాన్ని చేరవలసి ఉంటుంది. రామేశ్వరం దీవి లో ధనుష్కోటి అనే ప్రదేశం నుండి శ్రీలంక లోని మల్లైతీవు అనే ప్రదేశానికి కేవలం 18 నాటికల్ మైళ్ళ దూరంలో అంటే 30 కి.మీ. దూరంలో ఉంటుంది. రామేశ్వరాన్ని దర్శించిన తర్వాతే కాశీ యాత్ర ఫలం సిద్ధిస్తుంది. అందుకే రామేశ్వరం కూడా కాశీ తో పాటుగా చార్ ధామ్ యాత్రలో ఒక భాగంగా మారుతుంది... శ్రీరాముడు లంకను చేరడానికి నిర్మించిన వారధి ఇక్కడి నుండే మొదలవుతుంది... లంకలోని రావణుడు శివ భక్తుడు. అందుకే క్షేత్రం శివ కేశవుల మధ్య వారధిగా అనుకోవచ్చు. రామునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరమయింది. ఇక్కడి శివుడిని రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడని అంటారు.
లంకాధిపతి యైన రావణుడు సీతను చెరబట్టి లంకలో ఉంచగా. ఆమెను రక్షించుటకై శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు బయలు దేరి వేళ్ళినట్లు చరిత్ర చెబుతుంది. రావణుని చంపి రామేశ్వరానికి తిరిగి వచ్చి రావణుని సంహరించడం వలన ఏర్పడిన బ్రహ్మహత్యా పాపము దాని దోష నివారణ చేయమని ఈశ్వరుని ప్రార్థించారు. దానికై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింప సంకల్పించారు. అందుకే తగిన లింగాన్వేషణకై హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు. హనుమ అన్వేషణలో ఎంతకూ తిరిగి రావడం లేదు. ఈలోగా ఆలస్యమవుతుందని సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించారు. లోగా హనుమంతుల వారు లింగాన్ని తీసుకువస్తారు. తిరిగి వచ్చిన హనుమంతులు తన లింగాన్ని ప్రతిష్ఠించకముందే ప్రతిష్ఠింప బడిన లింగాన్ని చూసి ఆగ్రహించితన తోకతో దాన్ని పెకిలించ ప్రయత్నం చేస్తాడు.... కానీ లింగం సీతమ్మ వారి హస్తంతో తయారు చేయబడినది కాబట్టి బయటకు రాలేదు. రాముల వారు హనుమంతుని బుజ్జగించి లింగాన్ని కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి. హనుమా దీనినే విశ్వ లింగమని పిలుస్తారు. మొదట నీవు ప్రతిష్ఠించిన లింగానికి పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్టించిన లింగాన్ని దర్శించుకుంటారని శ్రీ రాముల వారు మాట ఇచ్చారట. ఇప్పటికీ విధంగానే మనము దర్శించుకుంటున్నాము. హనుమ ప్రతిష్ఠించిన లింగాన్ని విశ్వ లింగమని. సీతమ్మవారు ప్రతిష్ఠించిన లింగాన్ని రామ లింగమని పిలిస్తారు. కథ మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలో కనపడదు. తులసీదాసుని రామ చరిత మానస్ లో ఉంటుంది
రామనాథస్వామిని దర్శించుకొనుటకు ముందుగా అగ్ని తీర్థంలో స్నానమాచరించాలి. తరవాత గుడిలోని 22 తీర్థంలలో గల పవిత్ర జలాలతో స్నానం చేయాలి. అవి 1) మహాలక్ష్మి తీర్థం 2) సావిత్రి తీర్థం 3)గాయత్రి తీర్థం 4)సరస్వతీ తీర్థం 5)సేతు మాధవ తీర్థం 6)గండ మాధన తీర్థం 7)కవచ తీర్థం 8)గవయ తీర్థం 9)నల తీర్థం 10)నీల తీర్థం 11)శంకర తీర్థం 12)చక్ర తీర్థం 13) బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్థం 14)సూర్య తీర్థం 15)చంద్ర తీర్థం 16)గంగా తీర్థం 17)యమునా తీర్థం 18)గయా తీర్థం 19)శివ తీర్థం 20)సత్యామృత తీర్థం 21)సర్వ తీర్థం 22)కోటి తీర్థం . ఇవి అన్నీ గుడిలోనే కలవు.


పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి ఆలయం రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయ ఆవరణలో ఉంది. అలాగే ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు కూడా ఉంది. లక్ష్మీ కటాక్ష ప్రాప్తికై భక్తులు కోనేరు స్నానాలు చేస్తారు...ఇక్కడి శ్రీ సేతుమాధవ స్వామి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. సేతుమాధవ స్వామిని "శ్వేత మాధవ స్వామి" అని కూడా పిలుస్తుంటారు... ఎందుకంటే స్వామి విగ్రహం పాలరాతితో చేయబడింది కాబట్టి....

No comments:

Post a Comment

Pages