కుచేలుడు - అచ్చంగా తెలుగు
కుచేలుడు
- కృష్ణ మణి
వాడు ఎన్నడూ అడగలేడు సహాయం అవసరం ఉండి వస్తాడు ఎలా అడగాలో తెలియక అటు ఇటు చూస్తూ తడబడుతాడు ఒక నిమిషం ఉండమని నాకు ఇవ్వాల్సిన వానికి ఫోన్ చేసి అరిస్తే అదేదో వీడినే అన్నట్లు అవమాన పడతాడు పలానా వాడు డబ్బు విషయంలో తెగ ఇబ్బంది పెడుతున్నాడురా అని బాధను చెప్పుకున్నాను నేనడిగి ఇచ్చేటట్లు చేస్తానురా బెంగపడకని ధైర్యం చెప్పి వెళ్ళాడు నాకు డబ్బిచ్చేవాడు తిరిగిస్తూ ఆ అన్నకు ఎందుకు చెప్పవన్నా నీ డబ్బును ముంచుతానా అన్నాడు స్నేహానికి విలువిచ్చి మన కష్టాలను తనవిగా భావించే వాడే నిజమైన మిత్రుడు ఇప్పుడు నా మిత్రుడు కుచేలుడు కాని నేను కృష్ణుడిని కాలేననే బాధను మిగిల్చాడు వాడు ****

No comments:

Post a Comment

Pages