2016 2016 లో... - అచ్చంగా తెలుగు

2016 లో...

పూర్ణిమ సుధ 
1. రెండువేల నోటు జూడ సుకుమారముగనుండు
చిల్లరెతికి తేను చావుకొచ్చు
ఏటిఎమ్ లైను ఎడతెగని బాధరా
’మోడి’ ఫికేషనేమి మాయ జేసె...
2. నింగికెగిసె నేడు స్వరగాన గంధర్వ
బెంగటిల్లె జనుల ఉల్లమెల్ల
రంగరించె రాగమాదేవదేవుల కాడ
మంగళంపల్లి గాత్రమిపుడు...
3. పంపునటంచు పరాయిదేశ జనుల
ఇంపుగ జెప్పె గొప్ప క్యాంపేనులోన
ఎంపికదియె లోకమంత విస్తుబోవ
ట్రంపు గెలుపు కాదె ’హిల్లేరి’యస్ గా..!
4. జయము జయమటంచు జనులు బారులు దీర
జయజయధ్వానాల నడుమ నిష్క్రమించెను అమ్మ
రాయని వీలునామాకు రాజులే అందరూ
’ఆయా’ల పాల్జేసె సంతులేని అమ్మ
5. యూరి ఉదంతపు ఉన్మాదం
టెర్రరిజం రూపేణ ప్రమాదం
వెర్రి తలలు వేసిన మతోన్మాదం
తరిమికొట్టిన మన భారతం
6. అర్జీ పెట్టుకున్నా ఆపని చెడుని
దర్జాగా చెప్పి ప్రక్షాళణ చేసిన నమో
ఈ ఏటి మేటి పదం మన భారతాన
సర్జికల్ స్ట్రైకే అది ముమ్మాటికీ..! యుద్ధమైనా నల్ల ధనమైనా..!
7. ఎక్జిట్ అంటూ ఆగని అలక
వలసల పోటీ తట్టుకోలేక
బ్రిటన్ పెట్టెను వేరు కుంపటి
బ్రెగ్జిట్ అయ్యెను మేటి చీలిక
8. ఒలింపిక్ ప్యారాలంపిక్ నందు
ఫలియించెను మహిళల పట్టుదల
కాంస్య రజత స్వర్ణమన్న బేధమే కాని
పేరు నిలిపె దేశ బంగారు తల్లులు...
9. నల్ల ధనము పట్ట నరేంద్రుని మేథ
ఎల్లడెల్ల చేసె పెద్ద నోటు బ్యాను
తెల్లబోయి చూసె సామాన్యజనులెల్ల
కొల్లగొట్టె కొత్త నగదు ’నల్ల’ వారు...
10. కవ్వింపు చర్యలను ప్రియముగా గావించు
కయ్యానికే దువ్వు కాలు ఎపుడు
దెయ్యాల అడ్డాగ మారె మన నైబర్లు
చైనా ’పాకే’ వైరమిప్పుడిక
11. నగదు లేదని నీవు చింతించవలదిపుడు
తగని సంతసమున మునగవలయు
తెగని షాపింగుతో వేధించు పని లేదు
మగని పర్సు చూసి జాలి కలుగు
12. వ్యాలెట్టు లెన్ని యాపులుగా మారి
బ్యాలే డ్యాన్సులు చేయ బాగులేదు
జుత్తు మెండుగయున్న కొప్పు మడువగవచ్చు
బ్యాలెన్సు లేని వ్యాలెటేల ?
****

No comments:

Post a Comment

Pages