శ్రీధరమాధురి – 23 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 23

Share This

శ్రీధరమాధురి – 23

(ఆత్మజ్ఞానం గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు  )ఆత్మజ్ఞానులు కలిసినప్పుడు, నవ్వడం తప్ప, చేసేందుకు ఏమీ ఉండదు. వారు సమస్త జగతినీ చూసి నవ్వుతారు.
 ***
ఆత్మజ్ఞానులు కలిసినప్పుడు, బుద్ధి ఆటలాడదు. కేవలం స్వచ్చమైన మనసు మాత్రమే మాట్లాడుతుంది.
 ***
ఒక శిష్యుడిగా ఈ రోజు మీరు నిర్వహిస్తున్న పాత్ర గురించే ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందా లేక   మాతో మీరు ఎటువంటి పాత్రను నిర్వహిస్తారా అన్నది, మేము చూస్తాము.
 ***
ఆత్మజ్ఞానం కలిగినప్పుడు, మీరు పగలబడి నవ్వుతారు. అప్పుడు మీరు మొదట ,ఇన్నేళ్ళూ మీరు యెంత మూర్ఖంగా ఉన్నారోనని గుర్తిస్తారు. అది పగలబడి నవ్వేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
 ***
బుద్ధి, మనసు రెండూ కేవలం దైవానుగ్రహం వల్లనే పనిచేస్తున్నాయి. పరిపూర్ణమైన అనుభూతికి రెండూ అవసరమని, బహుశా ఆయన భావించి ఉంటారు. ఆ అనుభూతి ఆత్మజ్ఞానంగా వికసించనుంది. ఆ ఆత్మజ్ఞానం చీకటిని పారద్రోలనుంది. హృదయంలో నాకు దైవమిచ్చిన ఆత్మవిశ్వాసం వల్లనే ఆశ నాలో చిగురిస్తోంది. చివరకు ఆయనే మన రక్షకులు కనుక, మేము అన్నీ ఆయన పాదాలవద్దనే అర్పిస్తాము. ఆయనే మాకు తండ్రి, రక్షకులు. ఈ సృష్టిలో ఉండాలన్న కోరిక బలపడుతోంది.ఎందుకంటే, ఈ ఉనికే దైవం కనుక.
 ***
ఒకసారి షూజో శిష్యుడైన షింజి గురువుగా మారాడు. చాలా ఏళ్ళ తర్వాత, షూజో, షింజి కలుసుకున్నారు. వారిద్దరూ కలిసి, చాలాసేపు నవ్వారు. షూజో యొక్క మరొక శిష్యుడు ఇలా అడిగాడు – మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు ?
షూజో – అతను నా శిష్యుడిగా ఉన్నప్పుడు, నేను నవ్వేవాడిని, అతను మౌనంగా ఉండేవాడు. ఇప్పుడు అతను నాలాగే ఆత్మజ్ఞానం కల గురువుగా మారాడు కనుక, మాకు ఇక చేసేందుకు ఏమీ లేదు, అందుకే మేమిద్దరమూ నవ్వుతున్నాము.
 ***
ఆత్మజ్ఞానానికి అనేక మార్గాలున్నా, హృదయాన్ని అనుసరిస్తూ చేరే మార్గమే అత్యంత సులువైనది.  
***
అతను – గురూజీ, నాకు ఆత్మజ్ఞానానికి దారి చూపండి.
నేను – అలాగే, నీవద్ద క్రొవ్వొత్తి ఉందా ?
అతను – ఉంది గురూజీ.
నేను – అగ్గిపెట్టి ఉందా ?
అతను – ఉంది గురూజీ.
నేను -ఇప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చో.
అతను – సరే గురూజీ.
నేను – ఇప్పుడు క్రొవ్వొత్తి వెలిగించు. వెలిగించావా ?
అతను – వెలిగించాను గురూజీ.
నేను – ఇప్పుడు నెమ్మదిగా క్రొవ్వొత్తి తీసుకుని, ముఖంవద్దకు తీసుకువచ్చి, జ్వాల వంక నేరుగా చూడు. చూస్తున్నావా ?
అతను – చూస్తున్నాను, గురూజీ.
నేను – దీన్నే కాంతి దగ్గరగా ఉండడం ( ఎన్ లైట్ ఎన్ మెంట్ ) అంటారు.
 ***
 ఆత్మజ్ఞానం అంటే, ఈ విశాల విశ్వంలో ఒకరు తమ ఉనికిని గాఢముగా అవగాహన చేసుకోవడమే.
***
పొరుగువారిపై అరుస్తున్న ఒక వ్యక్తి 
ఇంట్లో ఆనందంగా వంట చేసుకుంటున్న ఒక గృహిణి
అంకితభావంతో పూజ చేస్తున్న ఒక పూజారి
పక్కా ప్రణాళికతో దొంగతనం చేస్తున్న దొంగ
ఆ సమయంలో వారి బుద్ధి యొక్క స్థితిని సూచిస్తారు, కాని ఒక ఆత్మజ్ఞాని, వీరందరినీ చూసి నవ్వుతారు.
 ***
శిష్యుడు – గురువర్యా, మీరు ఆత్మజ్ఞానం పొందాకా, ఏమి చేసారు ?
గురువు నవ్వి, ఇలా చెప్పారు – నేను ఇస్త్రీ చెయ్యాల్సిన బట్టలు ఉన్నాయి, చేసాను.
***
గురువు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే, తనను చూసేందుకు వచ్చిన వ్యక్తిని కలిసేందుకు వెంటనే అంగీకరించారు.
దర్శనార్ది – గురువర్యా, నేను జ్ఞానిని. నేను ఆత్మజ్ఞానాన్ని పొందాను. మీరు నన్ను ఏమైనా అడగవచ్చు, నా జవాబు నేను జ్ఞానినని నిరూపిస్తుంది. ఈ పరిసరాల్లో మీరు అత్యంత జ్ఞానం కలవారని, నేను విన్నాను. కాబట్టి, నాకు తగిన జ్ఞానాన్ని, మీరే   కలిగిఉన్నారని, నేను అనుకున్నాను. మీరు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టండి.
గురువు – సరే, నేను నీ సవాలును అంగీకరిస్తున్నాను. అయితే,  జ్ఞానం పట్ల నీ మక్కువను గురించి నేను ప్రశ్నించడం మొదలుపేట్టబోయే ముందు, ఒక సులువైన ప్రశ్న వేస్తాను, సరేనా ?
దర్శనార్ది – సరే, అలాగే.
గురువు – నీవు ఈ గదిలోకి వచ్చేముందు నీ చెప్పులను ఏ వైపు విడిచావు ?
వచ్చినవానికి ఏమీ గుర్తురాలేదు. ఆతను మౌనంగా ఉండడం చూసి, గురువు, ‘ఎడమ ప్రక్కన విడిచావు,’ అన్నారు.
దర్శనార్ది సిగ్గుపడి, వెళ్ళిపోయాడు.
గురువు శిష్యుడిని చూసి, కన్నుగీటి, “ ఈ తలుపుకున్న సందు ద్వారా నేను అతను వచ్చేముందు చూశానని, నేను అతనికి చెప్పెయ్యనా ?” అని అడిగారు.
గురువు, శిష్యుడు పగలబడి నవ్వసాగారు.
శిష్యుడు – గురువర్యా, మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా, మరి తలుపు సందులోంచి అంత దూరం ఎలా చూసారు ?
గురువు నవ్వి ఇలా అన్నారు, ‘ తలుపు సందులో నుంచి చూసేందుకు నేను తలుపు వద్దకు వెళ్ళడం అవసరమా ?’
శిష్యుడు అవాక్కయ్యాడు.
***
అతను – గురూజీ, మా గురువు తానొక ఆత్మజ్ఞానినని చెబుతారు. ఆయన కేవలం నిజమే మాట్లాడతారు. ఆయన తను చాలా తృప్తి కలవాడినని చెబుతారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
నేను – తన గురువును గురించి ఇతర గురువులను అడగడం శిష్యుడికి ఎంతమాత్రం తగదు.
***
ఒక బౌద్ధ సన్యాసికి ఆత్మజ్ఞానం కలిగింది. అంతకు ముందు ఆ మఠంలో ఉన్న గ్రంధాలయం నుంచి అతను అనేక పుస్తకాలను చదివేవాడు.
ఒకరోజున అతను గ్రంధాలయానికి నిప్పు అంటించాడు.
శిష్యులు – మీరు ఏమి చేస్తున్నారు గురువర్యా ? మీరు మొత్తం గ్రంధాలయాన్ని కాల్చేసారు.
గురువు నవ్వి, ఇలా అన్నారు. – ఆత్మజ్ఞానం కలిగిన తరువాత నేను, ఈ పుస్తకాలే అందుకు ఇన్నేళ్ళు పట్టడానికి కారణమని తెలుసుకున్నాను. ఇవి లేకపోతే, నాకు ఎప్పుడో ఆత్మజ్ఞానం కలిగేది. ఈ పుస్తకాలు నా ఆలోచనలని  చేసి ‘శూన్య స్థితికి’ చేరకుండా చేసాయి. అందుకే ఈ చచ్చిన కర్రలపైన(కాగితం చెట్టు బెరడు నుంచి చేస్తారు కదా )నా శిష్యులు సమయం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరంతా వీలైనంత త్వరలో వెలుగును అనుభూతి చెంది, గ్రామాలకు వెళ్లి, శాంతిసామరస్యాలను వ్యాప్తి చెయ్యాలని నా కోరిక. అందుకే నేను గ్రంధాలయాన్ని తగులబెట్టాను. ఈ నా చర్య మీ అజ్ఞానాన్ని కూడా దగ్ధం చెయ్యాలి.
 ***
ప్రతి జ్ఞానం కల ఆత్మ ఒక గురువే. వారు ఎల్లప్పుడు శక్తివంతమైన సానుకూల అక్షరాలతో ఆవరించి ఉంటారు. ఇది వారి చుట్టూ ప్రకాశాన్ని వ్యాపింపచేస్తుంది. వారి వద్దకు వెళ్ళిన ఎవరికైనా స్పందన కలిగి, ఉత్తేజాన్ని పొందినట్లు అనుభూతి చెందుతారు. నిజానికి, మీరు ప్రతికూల అక్షరాలతో ఆవరించి ఉన్నవారిని కలిసినా, వారు కూడా కొంత ప్రతికూలశక్తి ని వెలువరిస్తూ ఉండడం వాళ్ళ, మీకు వారివద్ద ఉండాలని అనిపించదు. ఇది ఆలయాల్లో కూడా జరుగుతుంది. ఈ సృష్టి అంతా, అనుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంది. దాన్ని బట్టే, మనలో స్పందనలు కలుగుతాయి. అనుకూలమైనవి దుఃఖాలను ఆనందాలుగా మారిస్తే, ప్రతికూలమైనవి, ఆనందాన్ని దుఃఖంగా మారుస్తాయి.
***

No comments:

Post a Comment

Pages