ఈ దారి మనసైనది - 25 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 25
                                                                            అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వస్తారు అనురాగ్ తల్లిదండ్రులు.)
 అప్పటి వరకు తన ఎప్రాన్ జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడివున్న దీక్షిత "సరే అన్నట్లు తల వూపి చురుగ్గా కదిలి .....

" రండి! అంటి !” అంటూ ఉత్సాహంగా తన ఎర్రటి పెదవుల్ని నెమ్మదిగా విప్పి అందమైన తన చిరునవ్వుతో ఆహ్వానించింది. పైపెదవి విల్లులా సాగి ఆ నవ్వు అద్భుతంగా అన్పించింది ప్రియబాంధవికి.

ఇలాంటి వాళ్ళు తమ నవ్వుతోనే రోగాలను నయం చేస్తారనటంలో అతిశయోక్తి లేదని మనసులో అనుకుంటూ తన భర్తతో కలిసి దీక్షిత వెంట నడిచింది ప్రియ బాంధవి.

వాళ్లను అనాటమి డిపార్ట్మెంట్ వైపు తీసికెళ్లింది దీక్షిత.

రూమ్ లోకి ప్రవేశించగానే స్పెసిమెన్స్ దగ్గరికి తీసికెళ్లింది.

అక్కడ Triplets అంటే ముగ్గురు కవలలు, తర్వాత Twins అంటే కవలలు, Qudripletsఅంటే నలుగురు కవలలు, అదే విధంగా పిండం గర్భాశయంలో ఎలా పెరుగుతుంది. బేబీ  లోపల ఎలా డెవలప్ అవుతుంది. వాటి గురించి వివరించుకుంటూ..

తర్వాత అనాటమి మ్యూజియంలోకి తీసికెళ్లింది.

అక్కడ  బాడీ మొత్తం ఎక్స్ రే  తీసిన ఒక ఫోటో...సరిగా పెరగని బేబీ స్పెసిమెన్స్ ...Dissection చెయ్యబడిన చేతులు, కాళ్లు, చాతివాటిలో కన్పించే నరాలు, రక్తనాళాలు, అవయవాలు, అవి పని చేసే విధానం వివరించుకుంటూ....

అనాటమిడిసక్షన్ హాల్లోకి ప్రవేశించింది.

అందులో.... డెడ్ బాడీస్ వున్నాయి. ఒక డెడ్ బాడినిDisscetచేయబడిన చాతి వైపు చూపిసూ అందులో వున్న అవయవాలు. ఊపిరితిత్తులు, గుండె, అవి పని చేసేవిధానం, మరియు ఆస్థమా, ఊపిరితిత్తుల కేన్సర్, టి.బి. గుండెపోటు, బి.పి. ఎలా వస్తాయో వివరించి...

ఆ పక్కనే వున్న బోన్స్ (ఎముకలు) దగ్గరకితీసికెళ్లింది.

అక్కడ .... బాడీలో వున్న బోన్స్ - తొడ ఎముక, కాలి ఎముకలు, చేతి ఎముకలు, పుర్రె, వెన్నెముక, వాటన్నిటి గురించి వివరించి ....

క్రోమోజోమ్స్గీయబడిన ఫోటో ప్లేట్ దగ్గరికితీసికెల్లి-క్రోమోజోమ్స్ రెండు రకాలు. ఇరవె రెండు జతల ఆటోజోమ్స్ ఒక జత అల్లోజోమ్స్ (Sex Chromosomes)అంటారు. బేబీలోసెక్స్ క్రోమోజోమ్స్ యొక్క వైవిధ్యమైన కలయికవల్ల డౌన్ సిండ్రోమ్ 45 47 క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అనే బేబీస్పుడుతారు.

అక్కడ నుండి OPHTHAMOLOGY డిపార్ట్మెంట్ రూం వైపు తీసికెళ్లిఅప్తాల్మోస్కోపి అనే పరికరం గురించి, రేచీకటి గురించి, అందులో విటమిన్ ఎ యొక్క ప్రాముఖ్యత గురించి, శుక్లం ఎలా వస్తుంది, చక్కర వ్యాధి వున్న వారు కంటి జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించి....

ఇ.ఎన్.టి (చెవి, మక్కుగొంతు) డిపార్ట్మెంట్లోకి తీసికెళ్లింది.

అక్కడ . స్వర పేటిక నిర్మాణము, టాన్సిల్స్, ముక్కులో డి.ఎన్.యస్, మరియు సైనసైటిస్ గురించి వివరించుకుంటూ ...

లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ ఏ విధంగా చేస్తారో చూపించి....

ఆర్తోపెడిక్ డిపార్ట్మెంట్ వైపు తీసుకెళ్లింది ...

అక్కడ .... ఎముకలు ఏ విధంగా తయారవుతాయో, ఎందుకు గట్టిగా వుంటాయో, వాటికి వచ్చే వ్యాధులేమిటో, ఎక్స్ రేలో విరిగిన ఎముకలు ఏవిధంగా కన్పిస్తాయో చూపించి ....

పెడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వైపు తీసికెళ్లింది.

అక్కడ . ఇంకుబెటర్స్ లో ప్రిమెచ్యూర్బేబీస్ ఎలా డెవలప్ అవుతారో... పిల్లలు పుట్టిన తర్వాత వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లలకి ఇవ్వవలసిన పోషక పదార్ధాల గురించి చెప్పి....

ఆ తర్వాత... OBSTRATRICS 8 GYENACOLOGY డిపార్ట్మెంట్ లోకి తీసికెళ్ళి అక్కడ గర్భవతి అయినప్పడు తీసికోవలసిన జాగ్రత్తలు, తీసుకోవలసిన పోషక పదార్థాలు చేయించుకొవాల్సిన పరీక్షలు అదే విధంగా సరైనా పోషక పదార్ధాలు తీసుకోకుంటే బేబీ సరిగా డెవలప్ అవదు అని చెప్పి.... నార్మల్ డెలవరీ, సిజేరియన్ ఏ విధంగా చేస్తారో వివరించి.. ఆపరేషన్ చేసేటప్పుడు ఇవ్వవలసిన మత్తుమందు గురించి వివరించటానికి...

ఎనస్టిసియా డిపార్ట్మెంటికి తీసికెళ్లింది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages