హృదయాలోచనలు
అఖిలాశ

ఆకాశంలో నక్షత్రాలు విసిరేసినట్లు
నా హృదయంలో ఆలోచనలు
చిందర వందరగా పడి ఉన్నాయి..!!

ఆ ఆలోచనలను అక్షరాలుగా మారి
మొలకలై మెరవాలని తహతహలాడుతుంటే..!!

ఆ ఆలోచనల అంతరంగం ఎరిగిన నేను
కాగితంపై కవన సేధ్యం చేసి
కవితల విత్తులను నాటను..!!

నేడు అవి మొలకలే
కాని.....................
రేపటికి మహావృక్షలౌతాయి కదా ఓ అఖిలాశ..!!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top