"జీవచ్ఛవాలు..."
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
నది పక్కనున్నా
దాహం తీర్చుకోలేని దౌర్భాగ్యం
గుండెలనిండా కమ్మటి గాలి పీల్చుకుని
ఆహ్లాదాన్నందలేని దురదృష్టం
వెర్రితలలు వేసిన స్వార్థం
ప్రకృతిని అపవిత్రం చేసింది
అడవిని..జీవజంతుజాలాన్నీ అణచి వేస్తూ వచ్చిన
మనిషి కన్ను..ఇప్పుడు మనిషిమీదే పడింది
మానవ బాంబై పేలతాడో
నరరూప రాక్షసుడై పేట్రేగిపోతాడో తెలియని పరిస్థితి
రాతికి దేవుళ్ళ రూపాలిచ్చి
ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చినా
అతని అంతరంగం అస్పష్టమే!
అనుక్షణం అప్రమత్తులమై
సహజానందాలని సైతం కోల్పోతున్న మనం
ఖచ్చితంగా జీవచ్ఛవాలమే!
***
No comments:
Post a Comment