పాత మనిషి - అచ్చంగా తెలుగు

పాత మనిషి

Share This

పాత మనిషి

తురగా వెంకటేశ్వర్లు 


నేనొక పాత మనిషిని!
ఇప్పుడు కూడా నేను మా తాత
కట్టించిన ఇంట్లోనే ఉంటున్నా!
దాని పునాది అంత గట్టిది.
మా అమ్మా, నాన్నలే నాదైవాలు,
మా మాష్టారే నాకు త్రిమూర్తులు,
బాపూజీ నా నాయుకుడు.
నన్ను కుడి చెంప మీద కొట్టిన వాడికి,
ఎడమ చెంప చూపించి, వాడిని
బయటకు తరుముతా!
నాలో సగం నా పెళ్ళామే!
చెట్లు చేమలంటనే నాకిష్టం.
చెట్లు పోయినా, మనిషి పోయినా
ఒకే బాధనాకు.
నాలో దాన కర్ణుడు లేడు గానీ,
పక్షి వాలితే నాలుగు గింజలు జల్లుతా,
పశువు కనపడితే పది పరకలు పెడతా,
అడిగిన వాడికి గుప్పెడు మెతుకులు వేస్తా!.
మా వీధిలో కూరలమ్మి నన్ను అన్నా! అంటే,
పాలవాడు బాబాయ్! అంటాడు.
ఆర్.టి.సి. బస్సు లోసే ప్రయాణిస్తా.
కేసిసేని నాకు క్రొత్త.
లాండులైను లోనే మాట్లాడుతా!
ఉత్తరాలు వ్రాయుడం, రేడియో వినడం నా హాబీలు.
సప్తగిరి నా ఛానలు!
సీరియల్సుకి సీరియస్సు కాదు నేను.
సుబ్బలక్ష్మీ సుస్వరాలు చెవున పడితే,
చెవికోసుకుంటూ!కురుక్షేత్ర నాటకమంటనే పరుగెడతా!
సినీమాలో సావిత్రి కళ్ళల్లో నీళ్ళు కనపడితే,
నా కళ్ళూ ఊరుకోవూ!
నాకు తెలిసిన భక్త పోతన చిత్తూరు నాగయ్యే!
నడిచయినా వెళ్ళి విశ్వనాధ్ చిత్రాలు చూస్తా!
ఛీ! నీవి అన్నీ పాత్ర బుద్దులే! అనంటే!
గర్విస్తా! నేనొక పాత మనిషిని!
*******

No comments:

Post a Comment

Pages