భారతమాత 70 వ స్వతంత్ర సంరభం - అచ్చంగా తెలుగు

భారతమాత 70 వ స్వతంత్ర సంరభం

Share This

భారతమాత 70 వ స్వతంత్ర సంరభం 

పెమ్మరాజు అశ్విని 


ఈ సంవత్సరం పంద్రాగష్టు తో భారత మాత నుదిటిన స్వతంత్య్ర తిలకం దిద్దుకొని 70 సంవత్సరాలు,దీనితో భారత మాత 70 ఏళ్ళ పండు ముత్తైదువ గా కళకళలాడుతోంది .
ఈ పండు ముత్తైదువా శరీరం ఎన్ని ముడతలు పడివుందో, అంతకుమించిమనసు ఎన్ని తీపి చేదుల కలయిక తో నిండిన భావోద్వేగాలు నింపుకొని ,పైకి నిండు కుండ లా తొణకక చిరునవ్వులు చిందిస్తోంది.
          మన భారత మాత ని ఆవిడ లో నిండి నిబిడీకృతమై న సంపదకు ఆకర్షింపబడని విదేశీయులు లేరంటే అతిశయోక్తి కాదేమో .మొహమ్మదీయులు మొదలుకొని ఫ్రెంచ్,పోర్చుగీస్ (బుడతకీచులు),ఆంగ్లేయుల వరకు ఎందరో భరతమాత సంపదను కొల్లగొట్టిన వారే ,వీరిలో మహమ్మదీయులు లో బాబర్ వంటి వారు మన దేశం లో స్థిర నివాసం ఏర్పరచుకొని తరాల తరబడి రాజ్యపాలన చేశారు.
        మన దేశాన్నీ  వ్యాపార ధోరణి లో లూటీ చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుల దే .అటువంటి ఆంగ్లేయుల మీద చరిత్రకారుల ప్రకారం మొదటి తిరుగుబాటు చేసింది 1857 మంగళ్ పాండే నాయకత్వం లో ,ఆ తిరుగుబాటు సఫలం కాకపోయినప్పటికీ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది.
        ఆ తరువాత లాల్,బాల,పాల్ ,భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,అల్లూరి సీతారామరాజు,వీరపాండ్య కట్టబొమ్మన ,రవీంద్రనాథ్ టాగోర్,గోపాల కృష్ణ గోఖలే,మహాత్మా గాంధీ,నెహ్రు వంటి ఎందరో లెక్కకు మించిన నాయకులు దేశం మొత్తం ప్రాణాలకు తెగించి,కొందరు హింస మార్గాన్ని అనుసరిస్తే ,గాంధీ గారి బాటలో కొందరు అహింస,సత్యాగ్రహాలని ఆయుధం గా చేసుకొని పోరాడి మన తల్లి నుదుట 1947 లో స్వాతంత్రయ తిలకాన్ని దిద్ది పుట్టిన గడ్డ ఋణం తీర్చుకున్నారు.
      అయితే ఎందరో త్యాగధనుల త్యాగం కారణంగా మన సాధించుకున్న స్వతంత్ర దేశానికీ పునాదులు వేయడం లో కొన్ని తప్పటడులు పడ్డాయేమో అనిపిస్తుంది,మంచి ఎక్కడున్నా స్వీకరించాలన్న ఆర్యోక్తి ని అనుసరించి ఎనిమిది దేశాల రాజ్యాంగాల నుంచి తెచ్చుకొని చివరకి మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత ని చేసారు. మన రాజ్యాంగాన్ని మంచి చేయాలనీ ఉద్యేశంతో నే తయారుచేశారు ,కానీ దానిలో వున్న లోటుపాట్ల ను అదును గా తీసుకొని చాల మంది దురాశపరులు లబ్దిపొందడం మనకు విదితమే.
      ఇదేకాక జిన్నా లాంటి స్వార్ధపరులు నాయకత్వపు ముసుగు లో రగిల్చిన కాశ్మిరు అనే రావణకాష్టం 69 ఏళ్ళ స్వతంత్య్ర భరతమాత కడుపులో నేటికీ చిచ్చుపెడుతూనే వుంది. ఇరుదేశాలలోను ప్రభుత్వాలకి ప్రభత్వాలు మారుతున్నప్పటికీ పరిస్థితి లో మార్పు లేదు, ఏ రోజు కాశ్మీరీల గురించి ఏ దుర్వార్త వినాల్సివస్తుందో అని సగటు భారతీయుడి గుండె కొట్టుకుంటూనే వుంది.
      ఈ గ్రహపాటు చాలదన్నట్టు అస్సాం,బీహార్,కర్ణాటక,గుజరాత్,మహారాష్ట్ర వంటి ఎన్నో రాష్ట్రాలు వేర్పాటువాదపు చిచ్చు ని రగిల్చి దెస ప్రజల ప్రశాంతతని ,ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు కొందరు స్వార్ధపూరితమైన రాజకీయ వాదులు .ఇహ అవినీతి, అత్యాచారాలు, అధికధరలు, దారిద్యం అనుభవిస్తున్న ప్రజానీకానికి మన దేశం పెట్టింది పేరుగా తయారవుతున్న తరుణం లో 2014 వ సంవత్సరం లో ఎన్డీఏ ప్రభుత్వం వారు శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం లో పగ్గాలు చేపట్టారు .
          స్వచ్ఛ భారత్ ,మేక్ ఇన్ ఇండియా ,జన్ధన్ యోజన,కౌశల్ యోజన వంటి ఎన్నో వినూత్న మైన ప్రణాళికలతో ప్రజలతో మమేకం అయ్యి అవినీతి ని పారద్రోలడం తో పాటు ,పొరుగు దేశాల అందునా అగ్రరాజ్యాలతో సత్సంభందాలు పునరుద్ధరించి భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేకమైన హోదా ను కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎంతైనా శ్లాఘనీయం .ప్రభుత్వాన్ని నడపడానికి కాదు,వ్యవస్థ లో ని లోపాలని ,లోటుపాట్లని తెలిపేందుకు ప్రజలకి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గరవడమే గాక ,విదేశీ గాలికి రెపరెపలాడుతూ కోన ఊపిరితో వున్న ఎన్నో కుటీర పరిశ్రమలు,చేనేతి కళలకు ఒక అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి ,యువతను వారి నైఫుణ్యాన్ని మెరుగు పరుచుకుని స్వయం ఉపాధి కల్పించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షించదగినది .
        ఇలా జాగృతమైన యువ జనాభా తో చక్కటి అభివృద్ధి ని సాధించి మన 70 వసంతాల పండుముత్తైదువని అగ్రరాజ్యాలకి పోటీగా తయారు చేయాలంటే అందులో ప్రజలు సమానమైన పాత్ర వహించాల్సి ఉంటుంది .అప్పుడే కదా "ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత" ఎంపిక అతి పెద్ద ప్రజాస్వామ్యానికి గౌరవం.
**********

No comments:

Post a Comment

Pages