శివం- 131 - అచ్చంగా తెలుగు

 శివం- 131

శివుడే చెబుతున్న కథలు 

రాజ కార్తీక్ 


(కార్తికేయుడు సమాధి స్థితి కొనసాగుతుంది.. కుండలు తయారు చేసే భక్తుడు కదా తన రచనలో భాగంగా కార్తికేయుడు చెబుతున్నాడు.. సమాధి స్థితిలోనే ఉండి తన అంతరాల లో దాగున్న భక్తి తో ఇదంతా చెబుతున్నాడు .. కుండలు తయారు చేసే అతనికి  నామీద భక్తి పొంగిపొర్లడం.. తను మట్టితో నా విగ్రహాన్ని తయారు చేయాలనుకోవడం.. అహోరాత్రాలు కష్టపడి తన కుండలు చేయడం మర్చిపోవడం .. వర్తకులు తనకోసం రాగా నేను 15 రోజులకు సరిపడా కుండలు ఇవ్వడం ఇప్పటిదాకా కార్తికేయుడు చేప్పిన కథ )


నేను అనగా శివుడు ..


కార్తికేయుడు తన కథ చెప్పటం ప్రారంభించాడు 

"నేను చక్రాన్ని ఉపయోగించి కుండలను చేయగలను గాని నిన్ను చేయలేనా మహాదేవ అని ఎంతో ప్రాధయపడేవాడు.. వారు ఎవరికో కనిపిస్తావు కదా , అదే మహాదేవ వారు ఎవరికో నా రూపం వల్లే కనిపించి మరి కుండలు ఇచ్చావు కదా, అదేదో నాకే కనిపించవచ్చు కదా , నువ్వు పరీక్షలు పెడితే తట్టుకోలేని భక్తుడని ముందరే నేను నన్ను నీకు శరణు వేడుకుంటున్నాను కదా ,"  అని ప్రార్థించాడు 

కార్తికేయుడు " చూడండి మాహదేవా! ఒక దీన భక్తుడు కేవలం మీ దర్శనం కోసం మాత్రమే అడుగుతున్నాడు.. ఎన్ని అందించిన ఎన్ని వరాలు ఇచ్చిన తృప్తి లేక మరొక వరమడిగే వాళ్ళకి బోలా శంకరుడై వరాలు ఇచ్చే, మీ యందు అనురాగం కలిగిన నమ్మన భక్తుల్ని అనుగ్రహించడంలో కొంచెం చొరవ చూపించండి మహాదేవ, కొద్దిపాటి  జీవితాన్ని కొద్దిపాటి మానవ సంబంధాలను మీ అనుగ్రహం ద్వారానే పొందపడతాయి.. ఓ తల్లి గౌరీదేవి! మహాదేవుడు ఎక్కడ ఉన్నా పక్కనే మరొక రూపంలో వెలుస్తావు కదా , అలా మహాదేవుడికి మమ్మల్ని కరుణించమని చెప్పు తల్లి, తండ్రి విష్ణుదేవ , తల్లి లక్ష్మీదేవి, తండ్రి బ్రహ్మదేవా తల్లి సరస్వతి దేవి , మిమ్మల్ని కూడా ఇదే ప్రాధేయ పడుతున్నాం మహాదేవుల వారిని అడగటం వేరు మిమ్మల్ని అడగటం వేరు కాదు మాకందరు ఒకటే " 

నేను "ఎక్కడో  ఏదో మనసులో పెట్టుకున్నాడు కార్తికేయుడు, ఎన్నిసార్లు చెప్పినా పదేపదే ఇదే చింతనతో ఉంటున్నాడు, ఇక మీద అటువంటి
ఆటంకాలు ఏమీ ఉండవులే కార్తికేయ, నీవు ముందు కథ చెప్పు "

కా " అలా ఎన్నిసార్లు చేసినా మహాదేవుడి విగ్రహం తయారు చేయలేకపోవటంతో.. చేసే పనిలో నైపుణ్యం శ్రద్ధతోపాటు. కొన్ని ఘనకార్యాలకి కొద్దిపాటి అదృష్టం కూడా కావాలని తెలుసుకున్నాడు.. తాను మరొక ఆలోచన చేశాడు.."

విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు " ఏమిటి అది"

కా " ఇక లాభం లేదు అనుకోని , తను తనకు తెలిసిన కుండల్ని తయారుచేసి .. ఆ కుండలు తో మహాదేవుడి ప్రతిరూపాన్ని అమర్చాడు.. తన దగ్గర కుండలన్నిటిని ఒక వరుస సమూహంలో పరుస్తూ అచ్చు మహాదేవుడు కూర్చున్నట్లు చేశాడు.. మట్టితో చేయలేకపోయినా కుండలతో చేసినందుకు ఎంతో గాను ఆనందపడ్డాడు.. మహాదేవుడు తన కోసమే వచ్చి  కుండలు ఇచ్చి ఉన్నాడు.. అలాంటిది మాహ దేవుడు తన తయారు చేసిన ప్రతిరూపాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు నా గురించి ఒక్క నిమిషమైనా ఆలోచిస్తాడు ఆయన చల్లని చూపు నా మద పడితే చాలు అని ఎంతో ఆనందపడ సాగాడు.. 
కానీ ఈలోపు జోరున వర్షం పడటం మొదలయ్యింది.. వర్షంతో పాటు వడగళ్ళు కూడా.. మహాదేవుని రూపంలో అమర్చిన కుండలను తీసివేస్తే , అవి ఉత్త కుండలు అవుతాయి .. మరి అలానే ఉంచితే వడగళ్ల పడి మహాదేవుని రూపం కుండలు అన్నీ పగిలి చిద్రం అయిపోతాయి.. జోరున పడుతున్న వర్షం తో పాటు వడగండ్లు కుండలికి తగిలి పగిలిపోతున్న శబ్దం వినిపిస్తుంది.. అయ్యో తను మహాదేవుడి మట్టి విగ్రహాన్ని తయారు చేయలేకపోయాను .. కనీసం తన తయారు చేసిన కుండలు తో అయినా ఇలా పేర్చుకున్నాను .. బహుశా మహాదేవుడికి తన విగ్రహం తయారు చేయడం ఇష్టం ఉండదేమో అని తన అర్హత లేదు ఏమో అని.. కళ్ల వెంట గిరా గా వచ్చిన కన్నీటిని తుడుచుకున్నాడు.. మరుక్షణం ఒక అద్భుతం జరిగింది "

త్రీ మాతలు " ఏమిటది కార్తికేయ "


కా" తల్లి ! అతగాడు కుండలను నేల మీద పేర్చిన  క్రమంలో .. కొద్దిగా దూరం నుంచోని చూస్తే కచ్చితంగా మహాదేవుని భింబం కనబడుతుంది..
కానీ ఇప్పుడు ఏమైంది. వడగళ్ళు పడటం వల్ల
అది ఎంత అందంగా తయారయ్యిందంటే..
పైనున్న కుండ కి చిన్న రంధ్రం పడి నిజంగా శివుడి జటాజటాల్లో నుంచి నీరు వచ్చినట్టే వర్షపు నీరు కారుతుంది అమ్మ.. ఇక మెడ దగ్గర కకావికలమైనట్టు ఉన్న అచ్చు పాము ఆయన వెనక చుట్టుకున్నట్టు వచ్చిందమ్మా.. ఇక మొహం దగ్గర పెద్ద వడగల్లు పడిన మూడవ కన్ను వచ్చింది తల్లి.. అలాగా తన చెయ్యి దగ్గర ఒక డమరుకం.. మరొక చెయ్యి దగ్గర ఒక త్రిశూలం.. అలాగే అక్కడక్కడ కుండలు కొద్దిగా పగలటం వల్ల జింక చర్మం ధరించినట్టు... ఇలా మహాదేవుడి రూపం ప్రత్యక్షమైంది తల్లి 
అతగాడు తండ్రి మహాదేవ, నేను చేసింది నీకు నచ్చలేదు అనుకున్నాను కానీ దాన్ని ఇంకా నియంతట నీవే వర్షం రూపంలో బాగా చేసుకున్నావు ఇందాకటి దానికన్నా ఇది ఇంకా బాగుంది మహాదేవ అంటూ ఎంతో మురిసిపోయాడు.. అంటే తనకి మహాదేవుడు ఖచ్చితంగా తన తయారు చేసినవి ఇష్టపడ్డాడు అని ఎంతో ఆనందపడ్డాడు. ఆనందపడ్డాడు కాబట్టే కదా .. తనకోసం వర్తకులకి కుండలను ఇచ్చాడు అని తనను తానే మెచ్చుకున్నాడు.. చిన్నపిల్లవాడు ఏదో ఆటలో గెలిచినట్టు, "

నేను " మరి ఆ తర్వాత ఏమైంది ఆ భక్తుడిని దర్శనం ఇచ్చానా? "

కా " ఇచ్చారు ప్రభు ! నాకు ఇచ్చినట్టే అతని కూడా ఇచ్చారు "

నేను " ఎలా జరిగింది ఆ సన్నివేశం "

కా "  అలా ఆ భక్తుడు తనకు చేతనైన విధంగా మహాదేవుని వలె కుండలను పేర్చి... కొద్దిపాటి రంగులు కూడా వెయ్యసాగాడు.. కానీ ఆ భక్తుడికి ఎట్లైనా సరే చక్రం మీద మట్టితో కుండను తయారు చేసినట్టు మహాదేవుడు రూపాన్ని తయారు చేయాలని
 ఎంతో పట్టుదల పెట్టుకున్నాడు.. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి మట్టి మహాదేవుని వలే తిరగక  ప్రయత్నంలో విఫలం అయ్యేవాడు. 
కానీ ఒకనాడు తిండి నిద్ర మరిచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.. తన ఆరోగ్యం బాగున్న బాగోకపోయినా.. జ్వరంతో ఉన్న దగ్గు జలుబుతో ఉన్న  విశ్రాంతి తీసుకోకుండా ఎట్లైనా మహాదేవుని చేయాలని చేస్తూ విఫలమవుతూ కష్టపడుతూనే ఉన్నాడు 

బాగా మట్టి వేసి ఆ విగ్రహాన్ని తిప్పగా తిప్పగా తిప్పగా 

ఈసారి మహాదేవుడి విగ్రహం సాక్షాత్తు వచ్చింది..

అతగాడు దాన్ని చూసి మురిసిపోతున్నాడు ఆనంద పడుతున్నాడు.. ఆ విగ్రహం మాట్లాడటం మొదలైంది 

ఎందుకంటే అది విగ్రహం కాదు సాక్షాత్తు శివుడే తన భక్తుడు ఆవేదన తో చేస్తున్న తపస్సుకి సహాయం చేద్దామని వచ్చాడు 

శివుడు " నాయనా ! ఏమిటి పిచ్చి నీకు ఒంట్లో బాగోకపోయినా విశ్రాంతి తీసుకోకుండా " 

కుండలు వాడు " ఎవరు నాతో మాట్లాడేది.. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటాను నాతో ఎవరు మాట్లాడేది.." 

శివుడు " చక్రం మీద నుంచి లేచి నుంచున్నాడు మహాదేవుడు.." 

అతడు " మహాదేవ తమరి వచ్చారు నా దగ్గరికి.. అంటూ పాదాల మీద పడి ఏడ్చాడు.." 

శివుడు " ఏమయ్యా ఈ మట్టితో ఇంతే ఉండమంటావా? లేకపోతే నిప్పు దగ్గర నన్నేమన్నా కాలుస్తావా.." అంటూ సరదాగా మాట విసిరాడు 

అతడు " అదేంటి మహాదేవ నేను మిమ్మల్ని నిపుల కాల్చడం ఏమిటి" 

శివుడు " అప్పుడే కాదయ్యా కుండ గట్టిగా ఉంటుంది" 

అతడు " స్వామి" 

శివుడు " ఏమయ్యా నన్ను కుండ మట్టితో తయారు చేయాలని ఏమిటి తాపత్రయం మామూలుగా నన్ను పూజించకూడదా" 

అతడు " అందరూ అన్ని రకాలుగా పూజిస్తారు మహాదేవ కానీ నాకు ఆ విధానాలు ఏవి సరిగ్గా తెలియవు. అందుకే నాకు తెలిసిన ఈ కుండ రూపంలో ఇలా చేద్దాం అనుకున్న "

శివుడు" అలాగా కుండన్న!  కానివ్వు నువ్వు ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలో ఏ రకంగా పూజిస్తే ఆ రకంగా ఏ విధంగా అయితే ఆ విధంగా రావాలి కదా"

కుండన్న తల గీక్కుంటూ ,"  మహాదేవ "అంటూ ఆయన చూసి మురిసిపోతున్నాడు 

శివుడు " ఏమిటి మట్టిలా ఇంతే ఉండమంటావా లేకపోతే మామూలుగా మహాదేవుడు లాగా మారిపోమంటావా ? "

కుండన్న" మహాదేవుడు లాగా మారిపోండి ప్రభు అలా చూస్తే నాకు ఇంకా ఆనందం "

శివుడు " తధాస్తు" 

మహాదేవుని రూపంలోకి వచ్చిన శివుడిని చూసి.. ఎంతో ఆనందపడ్డాడు కుండన్న 

ఏదో చిన్న పిల్లవాడి వలె మారిపోయి శివుడి చుట్టూ తిరుగుతూ తనకొచ్చిన పిచ్చి నృత్యం చేస్తూ.. ఆయన నవ్విస్తూ , ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గర ఏ విధంగా సరదాగా ఆడుతుంటే ఆనందపడతాడు అట్లా శివుని ఆనంద పెడుతూ.. సరదా సరదాగా ఏదో ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉన్న తండ్రి కనపడితే ఆనందంగా నృత్యం చేసినట్లు చేస్తున్నాడు కుండన్న 

కుండన్న " నన్ను కరుణిస్తావా మహాదేవ" 

శివుడు " ఏం కావాలి" 

కుండన్న" నువ్వు ఎక్కడికి వెళ్ళబాకు చక్కగా నాతో పాటు ఇక్కడే ఉండు.. ఇక్కడికి ఈ మూల ప్రాంతానికి ఎవరూ రారు నేనే పట్టణానికి వెళ్లి సరుకు వేసి వస్తాను.. మనిద్దరం హాయిగా ఇక్కడ ఇట్లాగా ఉందాము "

}

నేను" ఈ కార్తికేయుడు మామూలు వాడి కాదు. నేను నా భక్తుని కరుణించానా లేదా? నా భక్తుడుతో ఏం చేశానని నన్నే పదేపదే అడిగేట్లు చెబుతున్నాడు కథ 
మనవాడు ఎవరికన్నా కథ చెప్తే.. అది సరై పోవాల్సిందే..

***

No comments:

Post a Comment

Pages