అర్జునుడి రెండవ భార్య "ఉలూపి లేక ఉలూచి"
అంబడిపూడి శ్యామసుందర రావు
ఉలూపి లేదా ఉలూచి అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది ఈమె ప్రస్తావన విష్ణు పురాణం, భాగవత పురాణాల్లో వస్తుంది మహాభారతంలో ఆదిపర్వంలో అర్జునుడు ఉలూపిల సంబంధం గురించి వస్తుంది. ఈవిడ నాగరాజు కౌరవ్య కుమార్తె.మహాభారతంలో ఉలూపి గురించి చాలా తక్కువ చెప్పబడింది. ఉలూపిని మహాభారతం - భుజగత్మజ, భుజగేంద్ర కన్యక, భుజగోట్టమ కౌరవ, కౌరవ్యదుహిత, కౌరవ్యకులానందీ, పన్నగానందినా, పన్నగసుత, పన్నగ, మగజమజలో ఉలాపే, ఉలూపి, ఉలుచి, లేదా ఉలూచి అని అనేక పేర్లతో పిలుస్తారు.ఈమె తండ్రి గంగా నదిలో నీటి అడుగున పాముల రాజ్యాన్ని పాలించేవాడు. ఈవిడ బాగా శిక్షణ పొందిన యోధురాలుగా వర్ణించారు.ఈవిడ రూపాన్ని సగం కన్య గాను సగం పాము గాను పౌరాణిక రూపంగా వర్ణించారు. నడుము క్రింద ఉన్న భాగం పాము లేదా మొసలిని పోలి ఉంటుంది.
పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లాడటం వలన వారు ఏర్పరచుకున్న నియమము ఏమిటి అంటే పాండవులలో ఎవరైనా ద్రౌపదితో ఏకాంతంగా ఉంటే మిగిలిన వారు ఆ వైపుకు వెళ్లకూడదు ఏ కారణం చేతనైన పాండవులలో ఏ ఒక్కరైనా ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ పాపానికి పరిహారంగా వారు భూప్రదక్షిణ చేసి రావలసి ఉంటుంది.ఒకసారి తప్పనిసరి పరిస్థితులలో ద్రౌపది ధర్మరాజుతో ఉన్నప్పుడు అర్జునుడు ధనుర్భాణాల కోసం వారి గదిలో ప్రవేశించాడు నియమ ఉల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు ఆ పాపానికి పరిహారంగా,సాధుజీవులను రక్షించడానికే అయినా, నియమ ఉల్లంఘన జరిగింది కాబట్టి భూప్రదక్షిణ చేయవలసి ఉంటుంది.కాబట్టి అర్జునుడు, రాజ్య రాజధాని నగరమైన ఇంద్రప్రస్థ నుండి స్వీయబహిష్కరణ విధించుకుని బ్రాహ్మణులతో కలిసి, అర్జునుడు నేటి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి వెళ్తాడు.
అర్జునుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి గంగానదీతీరానికి చేరాడు. అక్కడ గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన తన కర్మలు చేయటానికి గంగా నదిలో స్నానం చేసినప్పుడు, అదే సమయానికీ నదిలో పాతాళలోకం లోని సర్పరాజు (నాగా యువరాణి) ఉలూపి, ఈదులాటగా(ఈత) జలవిహారంలో అటుగా స్నేహితులతో వచ్చి ఆ గంగానదిలో స్నానం చేయడానికి వచ్చిన ఆజానబాహుడైన అర్జునుడి అందాన్ని చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడుతుంది. ఆమె తన వంశాన్ని వెల్లడించి, అతనిపై తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అర్జునుడు తన తీర్థయాత్రలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నానీ, ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. తన బ్రహ్మచర్యం అర్జునుడి మొదటి భార్య ద్రౌపదికి మాత్రమే పరిమితం అని ఉలూపితో వాదిస్తాడు. గంగాతీరాన విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని ఉలూపు అతన్ని పట్టుకుని నదిలోకి స్నేహితులతో వచ్చి లాగారని తరువాత అతను తెలుసుకుంటాడు. అర్జునుడిని కాళ్ళు చేతులను బంధించి పాతాళలోకానికి తీసుకువెళ్తుంది. ఆయనను వారు చివరకు కౌరవ్య నివాసమైన నీటి అడుగున రాజ్యంలో పాతాళలోకం లోని సర్పరాజు తన నాగలోకానికి తీసుకొని పోతుంది
అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు . ఉలూపి అతనికి తన కోరిక వెల్లడించింది. కానీ అర్జునుడు భూప్రదక్షిణం చేసేవాడిని నాతొ పెళ్లి ఏమిటి అని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు కానీ ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె మాట వినలేదు చివరకు తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తానని అని తనలోకానికి తీసుకువెళ్లి తండ్రి
కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధయాగం లో అశ్వానికి రక్షణగా అర్జునుడు గాండీవం అక్షయ తూణీరాలు ధరించి వెళతాడు.ఆ అశ్వము త్రిగర్త, ప్రాగ్జోతిషపురం, సింధుదేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది. తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయం తెలిసిన మణిపురం యువరాజు బభ్రువాహనుడు ఆయనకు ఎదురెళ్లి నమస్కరించాడు. అర్జునుడు తన కుమారుని ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు. ఈ నిరాదరణకు కారణం తెలియని బభ్రవాహనుడు మౌనంగా పక్కకు తప్పుకున్నాడు.కలత చెందిన అతడు విచారంగా వెనుదిరినప్పుడు .ఒక స్త్రీ ఎదురుగావచ్చి, ‘నాయనా నేను ఓ నాగకన్యను! నా పేరు ఉలూపి.నేను నీకు అమ్మ నవుతాను. యుద్ధం రాజధర్మం. వెళ్లి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుందని’ చెప్పింది. ఉలూపి మాటలకు బభ్రువాహనుడు.. తల్లీ తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను తప్పా, పిరికివాడిని కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించి అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడి అర్జునుడితో యుద్ధం చేయనారంభిస్తాడు అర్జును
యుద్ధం సాగుతుండగా కొడుకు వేసిన శరం సవ్యసాచిగుండెల్లో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు. అదే క్షణంలో అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు మూర్చపోయాడు. విషయం తెలుసుకున్న చిత్రాంగద,ఉలూపి యుద్ధ భూమికి వచ్చి రథానికి అడ్డంగా పడివున్న కొడుకును, నిర్జీవంగా ఉన్న భర్తను చూసి దుఃఖించింది సోదరి ఈ పసివాడిని ఎందుకు యుద్దానికి ప్రోత్సహించావు నా భర్తను నాకొడుకు బ్రాకించకపోతే నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణాలను అర్పిస్తాను అని చిత్రాంగద అంటుంది కాసేపటికి తేరుకున్న బభ్రువాహనుడు తండ్రిని చంపిన పాపానికి తానూ ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు.అప్పుడు ఉలూపి మృత సంజీవిని మణిని తలుచుకొని ఆ మణిని భబ్రువాహనుని చేతులో పెట్టి కుమారా కుమారా విజయునికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిండి ఈ మణిని అయన హృదయం పైన పెట్టు అంది భబ్రువాహనుడు ఆవిధంగా చేసిన వెంటనే నిద్రనుంచి మేల్కొన్నట్లుగా అర్
అర్జునుడు యాగశాలను సమీపించగానే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు అర్జునుడికి ఎదురు వెళ్ళి స్వాగతము పలికి సాదరంగా యాగశాలకు తీసుకుని వెళ్ళారు ఇంతలో అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగధలు బభ్రువాహనుడు హస్థినకు వచ్చి చేరారు. వారిని అర్జునుడు ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళి పరిచయము చేసాడు. తరువాత ధృతరాష్ట్ర, గాంధారీల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదము అందుకున్నాడు అశ్వమేధయాగము పూర్తి అయింది కలియుగం ప్రారంభమైన తరువాత, పాండవులు ద్రౌపదితో కలిసి పదవీ విరమణ చేసి, వారి ఏకైక వారసుడు అర్జునుడి మనవడు పరీక్షిత్తు కు సింహాసనాన్ని విడిచిపెట్టారు. వారి వస్తువులు సంబంధాలన్నింటినీ విడిచిపెట్టి, వారు తమ కుక్కతో కలిసి హిమాలయాలకు తమ చివరి తీర్థయాత్ర చేసారు. ఉలూపి గంగానదిలోని తిరిగి ఆమె తన రాజ్యానికి వెళ్లంది.
***




No comments:
Post a Comment