అనుకోని పరిచయాలు
అంబరీష్
గారు మన ‘గడసరి’ చిత్రానికి వినసొంపైన పదాలతో మొదటి చిత్రంలోనే పాటల రచయితగా గొప్ప
హిట్ కొట్టేసారు అంటూ దర్శకుడు మౌళి మైక్ లో మాట్లాడుతూ అతన్ని అభినందనల వర్షంతో ముంచెత్తాడు.
అంబరీష్
ముసిముసిగా నవ్వుతూ ‘నా పాట సరి సరి, నేను గడసరి , నీవు సొగసరి, మనకు జోడు కుదిరెను
గా, మనసు మనసు కలిసెనుగా, ఇరు కుటుంబాలను కలిపెదమా…
ఈ
పాట సినిమా విడుదల కి ముందే మీ అందరినోళ్ళలోను నానింది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక,
నిర్మాతలకు ధన్యవాదాలు! అనగానే చుట్టూ ఉన్న కుర్రకారు ఈలలతో, చప్పట్లతో హోరెత్తించారు.
తరువాత
కారులో అంబరీష్ అక్కడినుంచి ‘శారదా విద్యాలయ ప్రాంగణం చేరుకున్నాడు. ఉపాధ్యాయులంతా గేటువద్ద అతనికి స్వాగతం పలికారు. స్కూల్ ప్రిన్సిపాల్
అంబరీష్ వైపు గర్వంగా చూస్తూ, పూల మాల వేసి ఆహ్వానించాడు. తరువాత ఒక్కక్కరే మైక్ లో
సినీగీత రచయిత గా ఆవిర్బవించి, మన విద్యాలయానికి గుర్తింపు తీసుకువచ్చిన మన పూర్వ విద్యార్థి
అంటూ అతడిని ప్రశంసలతో ముంచెత్తి, శాలువ కప్పి సన్మానించారు.
అంబరీష్
తిరిగి ఇంటికి వెడుతూండగా, అతని కార్ డ్రైవర్ రమేష్ నవ్వుతూ అన్నాడు. “సారూ! మొన్నమీరు
కోవిడ్ ముందుదాకా మామూలుగానే ఉండేవారు. ఉన్నట్టుండి
సినీ గీత రచయితగా ఈ క్రొత్త అవతారము ఎట్టా వచ్చిందండీ?
అంబరీష్
నవ్వుతూ అన్నాడు.
“అవునురా
రమేష్, నాకూ విచిత్రంగానే ఉంది. ఏదో కాలక్షేపానికి కోవిడ్ టైం లో గృహ నిర్భంధంలో ఉన్నపుడు
రోజుకో కవిత చొప్పున 30 కవితలు రాసి అందరికీ వాట్సప్ లో పంపాను. వాళ్ళందరు బావున్నాయని,
మెచ్చుకునేసరికి అవన్నీ ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాను. నా కవితలు చదివిన వాళ్ళు ఎందరో
నన్ను ఎడా పెడా తమ వాట్సప్ గ్రూప్ లో చేర్చేసుకున్నారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభకి జూమ్
లో నా స్నేహితుడు చంద్రమౌళి ని ఆహ్వానించాను. ఐతే చంద్రమౌళి నా ఆహ్వానాన్ని చూడలేదు.
కాని ఆ వాట్సప్ గ్రూప్ లో ఉన్న సినీదర్శకుడు మౌళి గారు తననే ఆహ్వానించాను అనుకుని,
ఆ సభలో పాల్గొన్నారు. నేను కూడా ఇంకేమి చెప్పకుండా, ఆయననే ఆహ్వానించినట్టుగాను, ఆయన
దయతో నా ఆహ్వానాన్ని మన్నించినట్లుగా ఉపన్యాసంలో చెప్పాను. తరువాత జూమ్ లో నా స్నేహితులంతా
నా కవితలను విపరీతంగా పొగిడేసారు. దానితో మౌళిగారికి ఉత్సాహం వచ్చి, తను తీయబోతున్న
తరువాతి సినిమాలో నాకు పాటల రచయితగా అవకాశమిస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే నా పాటల పుస్తకానికి ముఖచిత్రం అందించిన ఈశ్వర్
రాకుండా, అతని ప్లేస్ లో నేను గతంలో చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ ఈశ్వరన్ వచ్చారు.
ఇలా
అనుకోని పరిచయాలతో, అదృష్టం కలిసి వచ్చి, నా దశ తిరితిపోయిందనుకో రమేష్!”
ఇంతలో
అంబరీష్ కి ఫోన్ వచ్చింది.
“అంబరీష్
ఇపుడే ఫేస్ బుక్ లైవ్ లో మీ ఉపన్యాసం చూసాను. మేము తీయబోయే సినిమాలో నటుడిగా అవకాశం ఇద్దామనుకుంటున్నాము.”
అంటూ క్రొత్త దర్శకుడు విక్రమ్ చెపుతాడు.
ఫోన్
డిస్ కనెక్ట్ కాగానే, అయోమయంగా చూస్తున్న అంబరీష్ తో “సార్! ఇది కూడా అదేనండీ! మరో
కొత్త అవకాశం. సోషల్ మీడియా లో కలసివచ్చిన అదృష్టం అంటే ఇదే కదా! ఇపుడు నటుడిగా మరో
క్రొత్త అవతారం ఎత్తండి” అన్నాడు నవ్వుతూ డ్రైవర్ రమేష్.




No comments:
Post a Comment