చివరి కోరిక
-కొడాలి సీతారామా రావు
‘మీ రిపోర్ట్సు అన్నీ బాగున్నాయి.రేపు ఆపరే షన్ చేయవచ్చు.మీరు కంగారు పడవల సిందేం లే దు. పేరుకే ఓపెన్ హార్టు సర్జరీ అయి నా చాలా చిన్న ఆపరేషన్ లా వుంటుంది.’ చె ప్పింది డాక్టర్ అవనిజ.
‘ధేంక్సమ్మా.నాకేం భయం లేదు.మీ హా స్పిటల్ గురించి రివ్యూలు బాగున్నాయనే న న్నిక్కడకి తీసుకొచ్చారు మా పిల్లలు.ఒక చి న్నసందేహం.ప్రతిభ ఏమవుతారు మీకు.’ అ డిగాడు దశరథ్.
‘మా అమ్మగారే.ఏం అలా అడిగారు.’ నవ్వు తూ అడిగింది అవనిజ.సమాధానం ఆమెకి తె లుసు.అ లాంటి మాటలు చాలా మంది చెప్పా రు ఆమెతో.
‘సారీ అమ్మా. బందరు హిందు కాలేజిలో నా క్లాస్ మేట్ ప్రతిభ పోలికలు మీలో వుంటే మీకు దగ్గరి బం ధువనుకున్నాను.’
చిన్నగా నవ్వుతూ చెప్పింది అవనిజ ‘మా అమ్మ గారే.బి ఎస్సీ తరువాత ఎంబిబిఎస్ కాకి నాడలో చది వారు.బందరులోనే జిల్లా గ్రంథా లయం ఎదురుగా క్లిని క్ పెట్టారు.ఆపరేషన్స్ డా.లతగారి హాస్పిటల్ లో చేసేవారు.మూడేళ్ళ తరువాత ఉస్మానియాలో ఎం డీ చేసారు.అప్ప టికి పెళ్ళయింది.మా నాన్నగారు కాలేజిలో అ మ్మ క్లాస్ మేటే -వాసురావు గారు. విజయవా డలో కలెక్టరేట్లో పనిచేసేవారు.లవ్ మేరేజ్ వారిది.
విజయవాడలో,గుంటూరులో గవర్నమెం ట్ హాస్పిటల్లో చేసింది అమ్మ.మా డిగ్రీలు పూ ర్తయ్యి ఇక్కడ హాస్పిటల్ పెడితే ఇక్కడకి వ చ్చింది.ఇప్పుడు డెభ్భై ఐదేళ్ళు.మూడేళ్ళ క్రి తం దాకా ఆపరేషన్స్ చేసే వారు.ఇప్పుడు ఓ పి చూస్తున్నారు.ప్రస్తుతం నెదర్లాం డ్స్ లో జరు గుతున్న కార్డియాక్ సెమినార్ కి వెళ్ళారు.పేప రు సబ్మిట్ చేస్తున్నారు.ఇప్పటికి ఇరవై పేపర్లు సబ్మిట్ చేసారు. ఎల్లుండి వస్తారు.మరుసటి రోజు హాస్పిటల్ కి రాగానే మిమ్మల్ని పరిచ యం చేస్తాను. ఆవిడ కూడా సంతోషిస్తారు.’
‘థేంక్యూ అమ్మా ఇంతసేపు నీ విలువైన సమ యం నా కోసం కేటాయించావు.నాకూ చాలా సంతో షంగా వుంది.’
$$$
డాక్టరుతో మాట్లాడుతున్నప్పుడు పక్కనే వున్న అతని భార్య తనూజ ‘పోన్లెండి.మీ చిరకాల కోరిక తీరబోతోంది.ఎవరెవరినో ,ఎన్నో ఏళ్ళుగా అడుగుతు న్న ప్రతిభ ఇప్పుడు మీ ముందే వుంది. అదృష్టవంతులే’అంది.
దశరథ్ ఆమె చేతిని తీసుకుని పెదిమలకి తగిలించుకున్నాడు.’నేను చాలా అదృష్టవంతు ణ్ణి ప్రతిభ ఆచూకి దొరకటం వల్ల కాదు.నువ్వు భార్యగా దొరకటం వల్ల.బంగారం లాంటి పిల్ల లు,కోడళ్ళు,మనుమలు,మనమరాళ్ళు. నిం డు సంసారాన్ని ఇచ్చావు.ఏనాడూ నన్ను ఏదీ అడగలేదు.తక్కువ జీతంలో సంసారాన్ని నడి పావు ఏ లోటూ లేకుండా.అందుకు అదృష్టవం తుడిని.’మనస్ఫూ ర్తిగా అన్నాడా మాటలు.
‘ఇక ప్రతిభని చూడాలన్నది ఒక కోరిక అం తే.ఆవిడ పట్ల నాకు ఏ భావమూ లేదు.’
ఇంతలో అబ్బాయి కింద వున్నానని ఫోన్ చేసాడు.మళ్ళీ రేపు ఉదయం పెందరాళే వస్తా నని, ధైర్యం గా వుండమని చెప్పి వెళ్ళింది.
హాస్పిటల్ లో ఒకరే వుండాలి.
$$$
దశరథ్ కి ఛాతీలో మంటగా వుండటంతో ఒక హాస్పిటల్ కి వెళ్ళారు.వారు పరీక్షలు చే సి రక్తనాళాల్లో బ్లాకులు ఏర్డడటం వల్ల ఆపరే షన్ చేయాలని చెప్పారు.ఆ విషయం చెప్ప టంతో పిల్లలు ముందు వచ్చారు.అతనికి ఇ ద్దరు అబ్బాయిలు.వాళ్ళకి ఇద్దరేసి పిల్లలు.ఇ ద్దరూ బెంగుళూరులో వుంటున్నారు.
వాళ్ళు ఈ హాస్పిటల్లో చేర్చారు.ఓపెన్ హా ర్ట్ సర్జరీ అన్నాక కోడళ్ళు పిల్లలతో వచ్చారు.
$$$
దశరథ్ తండ్రి తాలూకా కోర్టులో క్లర్కు బం దరులో.అతనికి దశరథ్ తోపాటు మరో కూతు రు వుంది.దశరథ్ కి ఇంటి పరిస్థితులు తెలి యటం వల్ల డిగ్రీ అవగానే విజయవాడలో ఓ ప్రైవేటు మెడికల్ ఆఫీసులో చేరాడు.కొన్నాళ్ళ తరువాత హైదరాబాదులో అదే కంపెనీలో చే రాడు.
అతను డిగ్రీ చదివేటప్పుడు మొదటి రోజు పరిచయాలు జరుగుతున్నప్పుడు ప్రతిభని గమనించాడు.ఆమె అంటే ఆకర్షణ ఏర్పడింది. క్లాసులో ఆమె కనపడేలా కూచుని ఆమెని గ మనిస్తుండేవాడు.
ఆమె అందగత్తె కాదు.చాలా సాదా సీదాగా వుంటుంది.చామన ఛాయ.లంగా ఓణీతో వుం డేది పొందికగా.చెవులకి రింగులు,చేతికి గాజు లు,దోసగింజ బొట్టు.ఎక్కువ పౌడరు రాసిన ట్టు వుండదు.కానీ ఆమెలో ఆకర్షణ వుంది.
దశరథ్ ఆమెని గమనించటం చూసిన అ తని మిత్రుడు చెప్పాడు ‘ఆమె మీద ఆశలు పెంచుకోకు. ఆవిడ తండ్రి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్.మా ఇంటి దగ్గరేలే.మన స్థాయికి అం దదు.’
దశరథ్ చెప్పాడు ‘ఆమెని నేను ప్రేమించ టం లేదు.ఒక పసిపాప నవ్వుని ఎలా చూడా లనిపిస్తుందో అలా చూస్తున్నా అంతే.వేరే ఆ లోచనలే లేవు.అసలు చదువు పూర్తి కాకుం డా ఆ ఆలోచనలు సరైనవి కూడా కావు.’
$$$
దశరథ్ చెల్లెలి పెళ్ళి అయ్యాక అతనికి పెళ్ళి చేయాలనుకున్నారు అతని తల్లిదండ్రు లు.మొదట చూసిన అమ్మాయినే చేసుకుం టానన్నాడు. అలాగే మొదట పెళ్ళి చూపుల్లో తనూజ అతనికి నచ్చింది.ఐతే ఆమెకి ఎడమ కాలు పోలియో వల్ల కొద్దిగా కుంటుతోంది.
తల్లి అదే విషయం చెప్పింది.హైదరాబాదు లో అనేక ట్రస్టుల ద్వారా పరీక్షలు చేసి తగిన పరికరాలు ఉచితంగా ఇస్తున్నారు. కాకపోయి నా డాక్టర్ సలహాతో ఆ ఏర్పాటు మన మైనా చేసుకోవచ్చు. అదేం పెద్ద లోపం కాదు అని చెప్పాడతను.
కొడుకుకి ఇష్టమైందని ఆ పెళ్ళి జరిపించా రు. తనూజ కాపురాని కొచ్చినప్పటినించీ వా రితో కలిసిపోయింది.అత్తగారికి సహాయం చే యటమే కాకుండా తన వంటలతో వారి ఆదర ణ పొందింది. ఆడపడుచుని సొంత చెల్లెలులా చూసేది.
తనూజకి జైపూర్ పరికరం అమర్చారు.ఇ ప్పు డామె నడకలో పెద్ద తేడా లేదు.
కాపురాని కొచ్చిన కొత్తలోనే చెప్పాడు ప్రతి భ పట్ల తన ఆరాధన గురించి.అతని మాటల్లో ప్రతిభ పట్ల వేరే భావం లేదని అర్థం కావటంతో ఆమె అపార్థం చేసుకోలేదు.
అప్పటి నించీ ఎంతో మందిని,ఎన్నో విధా ల ప్రయత్నించాడు ప్రతిభ ఆచూకి గురించి. బందరు వెళ్ళినప్పుడు ఆమె వున్న ఇంటి చుట్టుపక్కల అడిగి చూసాడు. తెలుసుకోలే కపోయాడు.అప్పటినించీ ప్రయత్నిస్తూనే వు న్నాడు.ఆమెని చూడటమే అతని చివరి కోరి క.విషయం తెలిసి అతని కోడళ్ళు కూడా ఆ శ్ఛర్య పోయారు.
$$$
‘నాకు గుర్తు రావటం లేదు.బహుశా మా గ్రూపు ఫొటోలో చూస్తే గుర్తుపట్టగలనేమో.అ యినా మీ నాన్నగారిని తప్ప,నలుగురు ఆడ పిల్లలు తప్ప పెద్దగా గుర్తులేదు.మీ నాన్నగా రైనా ఎలా గుర్తున్నారంటే - మా ఇం గ్లీషు లె క్చరర్ టోణ్ పే గారు ఒకరోజు క్లాసులో ఆయ న గురించి చెప్పారు.
‘ ‘మీ క్లాసులోనే ఓ గొప్ప రచయిత వు న్నాడు.మన మేగ్జైన్లో అతని కథ పడింది. అతన్ని అభినందిద్దాం.’ అన్నారు ఇంగ్లీషు లో.అలా ఆయన లేచి నుంచుంటే అందరం చప్పట్లు కొట్టాం.అప్పటి నించీ ఆయనతో పరి చయం’ చెప్పింది ప్రతిభ తన కూతురు దశర థ్ గురించి చెప్పినప్పుడు.
‘సరే రేపు చూస్తావుగా.’
***
మరునాడు హాస్పిటల్ కి వెళుతూనే దశర థ్ రూముకి వెళ్ళింది ప్రతిభ. అతన్ని చూస్తూ నే ‘ఎలా వుంది మీకు.ఈరోజు ఇంటికి వెళ్ళిపో వచ్చు.’అంటూ స్టెతస్కోపుతో అతన్ని పరీక్షచే యసాగింది.
ఆమెని చూస్తూనే లేచి కూచునే ప్రయ త్నం చేసాడు దశరథ్.ఆమెతో వచ్చిన నర్సు ఆ మంచాన్ని అతను కూర్చునేందుకు వీలు గా పైకి లేపింది.అతను రెండు చేతులూ జో డించి ఆమెనే చూడసాగాడు.అతని కళ్ళల్లో నీళ్ళు.
‘అంతా బాగానే వుంది.నెలకోసారి వచ్చి చె క్ చేయించుకోండి.మనం ఏభై ఏళ్ళ తరువాత కలుసుకున్నాం. చాలా సంతోషం.కళ్ళల్లో ఆ నీళ్ళెందుకు అంతా బాగుంది కదా.’
‘ఇవి నీళ్ళు కావు.ఉద్విగ్నతతో కూడిన ఆ నందం. కాలేజి రోజుల నించీ మీ అభిమానిని. మిమ్మల్ని చూడాలని నా చివరి కోరిక.అది నె రవేరిందన్న సంతోషం.’
డా.ప్రతిభ ధేంక్స్ చెప్పి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది.అతని భార్య అతని భుజం మీద చేయి వేసి అతన్ని శాంతింపచేసింది.
***




No comments:
Post a Comment