శివం-129 - అచ్చంగా తెలుగు

శివం - 129

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్



 నేను అనగా శివుడు 

( కార్తికేయుడు త్రిమూర్తులు తీసుకు వెళ్లిన ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా వారిని చూసి తన ఆత్మ స్థితిని పొంది అదే మహిమ లో ఉండగా వారు దర్శకత్వం మొదలుపెడుదుగానీ అన్నా కూడా ఇంకా ఆనందంగా బ్రహ్మ సమాధి స్థితిలో ఉండి  వారు ఇచ్చిన అనుభవ ప్రశ్నలకు సాహిత్య సమాధానాలు చెబుతూ ఉంటాడు.. ఒకవైపు హరసిద్ధ మహారాజుకి ఇదంతా ఏదో మాయ వలె తన మదికి గోచరిస్తూ ఉంటుంది, ఇక యుగాలుగా లక్ష్మీ మాత లక్ష్మీపతి అయిన విష్ణు దేవునికి కాళ్లు వత్తి వత్తి ఆవిడ చేతులు నొప్పులు పుడుతున్నాయని ఒక కమనీయ కావ్య సన్నిధి విసురుతాడు )

త్రిమూర్తులు "ఏమయ్యా దర్శక దిగ్గజా కనులు తెరిచి బాహ్య ప్రపంచంలోకి వచ్చి నాటకాన్ని మొదలుపెట్టు" అని అనేలోపు

కార్తికేయుడు " తండ్రి విష్ణు దేవా, అదృష్ట ధాత బ్రహ్మదేవా ,  మహాయోగి మహాదేవ, తల్లి లక్ష్మీదేవి, అన్నపూర్ణ తల్లి పార్వతి దేవి , జ్ఞాన బిక్ష కలిగించిన సరస్వతీ దేవికి మీ పాదములకు అర్హత ఉన్నా లేకపోయినా  నా సహస్ర వందనాలు,  కీర్తనలు రాయటం రాని అజ్ఞానం ఉన్నవాడిని నేను, భక్తి అంటే ఏమిటో తెలియని అజ్ఞాని నేను, కొద్దిపాటి జీవితాన్ని అనుకున్నది సాధించడానికి మీ అనుగ్రహాన్ని కోరే పచ్చి స్వార్థపరుడను నేను,  పూర్వ జన్మలో ఏ పాపం చేశానో తెలియని పిచ్చివాడిని నేను, ఈ జన్మలో కూడా ఎన్నో తప్పులు పాపాలు చేసిన వాడిని నేను, నాయందు కర్మ అని కక్ష కట్టక , పాపి నని శిక్ష వేయక, తెలిసి తెలియక చేసిన అపరాధములు పాపములు మన్నించి వాటిని పశ్చాత్తాపం పొందే విధంగా నాకు అనుగ్రహం కలిగించి నాకు కర్మ భారాన్ని వేయవద్దు తండ్రి.. ఎలాగైతే మా మహారాజు హరసిద్ధుడు కఠినమైన శిక్షలు పొందాడు .. కఠినమైన కార్యాలు ఎదుర్కొన్నాడు .. అవి నేను చేయలేను తండ్రి.. ఒకరిద్దరు తప్ప ఎవరు ఆదరణ చూపించని ఈ సగం అనాధ మీద కొంచెం దయ చూపించండి తండ్రి .. ఆరోగ్యంతో కడుపునిండా మూడు పూటలా కొంచెం శ్రేష్టమైన ఆహారం దొరికేటట్టు దీవించండి తల్లి 
. అందరికీ అండగా ఉండి అందరి కష్టాలు తీర్చే సామర్థ్యం ఇవ్వండి మహాదేవ, ఎవరికైనా తలరాత బాగోక నా దగ్గరికి వస్తే చాతనైన సహాయం చేసే గుణం జీవితాంతం అంతే ఉండేటట్లు చెయ్యి బ్రహ్మదేవా, 
మనుషుల్ని ఆకట్టుకొని వారికి ప్రియమైన వాడిగా ఉండే విధంగా మీ సద్గుణాలు నాకు ఇవ్వు విష్ణు దేవా, ఇక నా ఆశయానికి ఏది అడ్డు రాకుండా నాకు ఎటువంటి ఉపద్రవం జరగకుండా చక్కగా నా పని నేను చేసుకునే విధంగా నాకు దీవెనలు ఇవ్వండి త్రిమాతలు,  త్రిపితలు , నా ద్వారా నా కుటుంబం నా వంశం అభివృద్ధి జరిగి సత్ సంతానం ఈ భూమి మీద ఉపయోగపడే విధంగా అనుగ్రహించండి త్రిమూర్తులారా, అందరి గురువుల యొక్క ఆశీర్వాదం నామీద అంతే ఉండేటట్లు చేయండి ఓ నా ఇష్టదైవల్లారా ! "


నేను అంతే చూస్తున్నాను 

పార్వతీ మాత " అదేమిటి మహాదేవ మనము కళ్ళముందు ఉన్నా కూడా అలా కలత చెందుతాడు ఏమిటి"

నేను " దేవి అతగాడు రాసిన ఒక చిన్న రచన గుర్తుందా నీకు "

విష్ణు దేవుడు " ఏమిటది మహాదేవ " 

నేను " తమరి భక్తుడు ఒకరు , తమరు యందు అత్యంత ఇష్టంతో అత్యంత ప్రేమతో మిమ్మల్ని పూజించి ఆఖరి వరకు ఇహ  జీవితంలో ఒక్కొక్కటి పోగొట్టుకొని తమలో ఐక్యమయ్యాడు .. నా భక్తుడు ఒకడు కఠిన దరిద్రం అనుభవించి మరణ సమయంలో ముక్తి పొందాడు.. అతగాడి రచనలలో రాక్షసులు చివరికి సంహరింప బడ్డ వారి ఎంతో ఉన్నతంగా బతికారు కానీ భక్తులు మాత్రం చిన్నచిన్నగా ఒక్కొక్కటి తమవారిని చేజార్చుకుంటూ అన్ని కర్మ బంధాలు తొలగించుకుంటూ ఐక్యమయ్యారు.. కష్టాలు పడిన భక్తుల సంఖ్య ఎక్కువ అని అతగాడి అభిప్రాయం .."

అలా ఏం ఉడదు భక్తులారా
.. మీరందరూ నన్ను నమ్మి నా మీద భారం వేసి నడవండి మీరు కష్టాలు పడుతున్నారు అనుకోవద్దు .. ప్రార్ధ కర్మలు అంతమైపోతున్నాయని ఆనందపడండి.


కార్తికేయ " అవును మహాదేవ నేను కూడా ఎంత దరిద్రం ఉన్నప్పటికీ కూడా ఈ రచనలు చేస్తూ మానసిక ఉల్లాసం పొందేవాడిని.. అలాగనే వారు కూడా ఎంత  ఉన్నప్పటికీ కూడా తమరి నామస్మరణతో తమరి చిత్తస్మరణతో బాహ్య ప్రపంచం నుంచి ఆలోచన విముక్తులయ్యేవారు , కానీ నేటి సమాజం అటువంటిది కాదు కదా అయ్యా దయచేసి లక్ష్మి మాత పార్వతీ మాత సరస్వతి మాత మీ ముగ్గురు కలిసి నన్ను అనుగ్రహించిన, త్రిమూర్తులు కూడా ఎదుర్కోలేరని నాకు గుడ్డి నమ్మకం గట్టి నమ్మకం అసలు నిజం  అని అనుకుంటున్నాను"

నేను " ఇదేమి చోద్యం అయ్యా నీకేమన్న వరం కావాలంటే అడుగు వారు కోరుకుంటే మేమేం చేయమంటాం ఎటువంటి సందేహం "

కార్తికేయుడు " అవును మా లక్ష్మి మాత భూలోకానికి వచ్చేస్తే మా అమ్మ కోసం ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ వెంకటేశ్వరడిగా అవతారం ఎత్తావు.. మా సతి మాత చనిపోతే నీవు కూడా అంతే ఏడ్చావు.. పైగా మా అమ్మకి కాళీమాత లాగా ఉగ్రరూపం దాల్చిన తర్వాత నీవు సైతం ఆమెని ఎదుర్కొనలేక ఆమె ముందు పడుకొని ఆమె పాదాలు మీ వక్షాన్ని తాకిన తర్వాత మాత్రమే ఆవిడని చల్లబరిచావు .. వారి ప్రేమ ఉన్న యెడల వారి కోసం అయినా మీరు నన్ను కర్మ అని ఏడిపించరు "

విష్ణు దేవుడు " బుడతడు గట్టివాడే మహాదేవ! బాగా ముద్దు చేస్తున్నారు తమరు. రాక్షసులకి వరాలిస్తారు. తర్వాత మేము లాక్కోలేక పీక్కోలేక అవతారాలు ఎత్తుతాము.. ఇతగాడు అన్ని సూక్ష్మమైన విషయాలు పట్టుకొని మాటకు మాట మనల్ని బానే అడుగుతున్నాడు "

నేను " పోనీలే బావ అతగాడు ఏమి రాక్షసుడు లాగా చిత్ర వరాలు అడగట్లేదుగా తన జీవితాన్ని చక్కగా ఉండేటట్లు .. తన ఆశయం సిద్ధించే విధముగా.. అనుకున్నది చేసే విధంగా తన కుటుంబం అభివృద్ధి అయ్యేవిధంగా .. అన్ని రకాలుగా.. తధాస్తు ఇక ముక్తి అంటావా .. ఎట్లాగో తర్వాత కైలాసంలో కూర్చోబెట్టుకొని మన వాడి చేత కథలు రాయించుకోనా ఏమిటి .. అప్పుడప్పుడు వైకుంఠనికి కూడా పంపించి కథలు చెప్పిస్తాలే.. భక్తులు యొక్క కీర్తనలకు ఎంత పరవశం అయ్యాను ఇతగాడి కథలకు కూడా  అంతే అయ్యాను.. ఇతగాడు కథలో ఒక భక్తురాలు కోరిక మేరకు ఆమె బిడ్డగా మారిపోయాను నేను.. "

బ్రహ్మదేవుడు " అవును మహాదేవ ఆ కథలో చిన్నపిల్లాడి వలె మీరు ఎంతో ముద్దుగా ఉన్నారు , అతడు రాసిన కథ నేను చూసి మానసిక ఫలకంలో ఎంతో మయ మరిచిపోయాను "

నేను" విష్ణు దేవా తమకు తెలుసు కదా నా ముందు నా తర్వాత ఏదీ ఉండదు.. మీరు అవతారాలు ఎత్తి తల్లి ప్రేమ పొంది ఆ కోరిక అచ్చట ముచ్చట తీర్చుకున్నారు.. కానీ పుట్టుకేలేనీ నేను అంశలను భూమి మీద ప్రసరింప చేయగలను గాని నేను అవతారం వలే పుట్టలేను .. గిట్టలేను.. అందులకే నేను అవతారము ఎత్తలేను . కానీ నన్ను మామూలు మనిషి వలె తల్లి ప్రేమలో ఓలలాడించాడు కార్తికేయుడు కార్తికేయుడు.. ఇతగాడి కథలో నా తల్లి నా మీద చూపించిన ప్రేమకి నా మూడవ కంటి నుండి సైతం ఆనందభాష్పాలు కారాయి.. ఆ నిమిషంలో దేవుడైతే వరుము ఇచ్చేవాడిని.. కానీ చిన్న పిల్లని అయిపోయాయి కదా నన్ను ఎత్తుకొని నువ్వు కూడా ఆడుకో కార్తికేయ అని మాత్రమే సజ్ఞలతో చెప్పగలను "

త్రిమాతలు " అవును మహాదేవ ఆ కథలో మేము కూడా మిమ్మల్ని ఎత్తుకున్నట్టు రాశాడు, ఆహా ఏమీ ఆ కథ , ఇతగాడు ఆ కథ రాసినందుకైనా ఇతగాడి అభిలాషను మీరు నెరవారిచాల్సిందే స్వామి "

నేను " ఓయ్ ఎందుకు నెరవేర్చను అవన్నీ నెరవేరిపోతాయి.. అతగాడి భయాలన్నీ పట పంచలైపోతాయి.. ఇక మన వాడి సమయం మన అనుగ్రహం వల్ల బానే ఉంటుందిలే తను అనుకున్నది సాధిస్తాడులే " అంటూ కార్తికేయ బుగ్గలు చిన్నపల్లవాడివలె  గిల్లాను..

విష్ణు దేవుడు & బ్రహ్మదేవుడు " బాల రాముడు బాల ఆంజనేయుడు కథ , అందులో మహాదేవుని పాత్ర పొదిగిన తీరు అత్యంత అద్భుతం " 

లక్ష్మీ మాత " నేను సీతా అవతారంలో ఉన్నప్పుడు , లవకుశలు నా కడుపున ఉన్నప్పుడు ,, సాక్షాత్తు పార్వతీ మాత సరస్వతి దేవి వచ్చి నాకు సీమంతం చేసిన కథ రాశాడు మహాదేవ " నిజంగా ఆ కథ అత్యంత అద్భుతం 

సరస్వతి మాత " ఒక అహంకారికి చదువు విలువ తెలిపిన.. ఒక కథలో నా పాత్రను రచించిన తీరు మరింత అద్భుతం మహాదేవ , విష్ణుదేవ"


పార్వతీ మాత " శక్తిగా అన్నపూర్ణగా తన కథలతో నా గురించి అతడు రాసిన తీరు నాకు నచ్చినది మహాదేవ "

విష్ణుదేవ " మనవాడు ఎక్కడ కూడా పాత్ర ల ఔచిత్యం దెబ్బ తినకుండా రాసే తీరు అత్యంత అమోఘం "

కార్తికేయుడు సమాధి నిమగ్నమై మాట్లాడుతున్నాడు) " మహాదేవ విష్ణు దేవా బ్రహ్మదేవా, తల్లి లక్ష్మీదేవి తల్లి భారతి దేవి తల్లి సరస్వతి దేవి, ఏదైనా మీ పాత్రలు పట్టకించి 0 0 .1 శాతం తప్పుచేసిన అనంత బూరి క్షమాపణలు..

త్రిమాతలు త్రిమూర్తులు ( ఒకేసారి) 

" నీ కోరుకున్న విధంగా అన్ని జరుగుతాయిలే తధాస్తు" 

నేను " జరగాలి జరిగి తీరాలి మనవాడి ప్రతిభ ప్రపంచమంతా తెలియాలి 

No comments:

Post a Comment

Pages