శ్రీథరమాధురి - 138
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
మీ మనసులో మధనం జరుగుతూ ఉన్నప్పుడు, గురువు దానిలో జోక్యం కల్పించుకోరు. ఎడారిలో నీటిని అన్వేషిస్తూన్న వ్యక్తి లాగా మీరు సమాధానం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి.
ఇంట్లోనూ ఆఫీసులోనూ సుఖంగా కూర్చుని, సౌఖ్యజీవన స్థితిలోంచి, ప్రశ్నలు అడుగుతూ ఉండడం మంచిది కాదు, వాంఛనీయమూ కాదు.
మీ మనసుకు సంతృప్తిని కలిగించే సమాధానాల కోసం అన్వేషించండి.
ఒక చెరువులో లేక నదిలో మీ తలను నీటిలోకి తోసినప్పుడు, మీరు శ్వాస కోసం పెనుగులాడుతారు. జీవితం యొక్క సుఖాల నుంచి వైతొలగి పడే అటువంటి పెనుగులాటే, ప్రశ్నించే మనస్సుకు విశ్రాంతినిస్తుంది.
కార్ల్ మార్క్స్ నుంచి లెనిన్ దాకా, కృష్ణుని భగవద్గీత దాకా మీరు అనేక పుస్తకాలను చదివి ఉండవచ్చు. ఇదంతా సమయాన్ని వృథా చెయ్యడమే! ఇప్పటికే మీరు ఎంతో సమయాన్ని వృథా చేశారు. నమ్మకానికి పుస్తకాలు ఉండవు, అది హృదయం యొక్క భాష. అంతర్గతమైన ఈ భాషను పెంపొందించుకోండి.
బయటికి మాట్లాడే భాష నారాయణ భగవానుడిని చేరుకోవడానికి అడ్డుపడుతుంది. ప్రశ్నించడానికి బదులుగా, దైవం మిమ్మల్ని మెరుగైన నమ్మకంతో దీవిస్తారని ఆశిద్దాము.
****
నా పరంగా శుభ్రత మంచిదే...
శుభ్రంగా ఉండడం దైవీకమైనది...
నేను పూర్తిగా ఆమోదిస్తాను.
శుభ్రత గురించి గొప్పలు కొట్టే ఒక వ్యక్తి నాకు తెలుసు. నేను అతనితో చాలాసార్లు ఇలా చెప్పేవాడిని...
'దాని గురించి బడాయి చెప్పకు. శుభ్రంగా లేని వారిని నీచంగా చూడకు. శుభ్రంగా ఎలా ఉండాలో వారికి నేర్పించు. శుభ్రత లేని వారికి స్వచ్ఛమైన మనసు ఉండవచ్చు. శుభ్రంగా ఉండడం అనేది కేవలం బహిర్గతమైనది కాదు, అంతర్గతమైనది కూడాను! బయటికి శుభ్రంగా ఉంటూ, మలినమైన మనసుతో ఉండే వారిని; బయటికి మురికిగా ఉన్న స్వచ్ఛమైన మనసుతో ఉన్న వారిని, నేను చూశాను. కాబట్టి లోపల, బయట శుభ్రంగా ఉండడానికి వారికి సహాయం చెయ్యి.'
అతను వినలేదు.
అతను శుభ్రత గురించి గొప్పలు కొట్టడం కొనసాగించాడు. ఏ సబ్బు మెరుగైనదో, ఏ టూత్ పేస్ట్ మంచిదో వంటివి చెప్పసాగాడు. అలా బడాయి కొనసాగింది. ఈ మూర్ఖత్వానికి ఒక ముగింపు పలకాలని నాకనిపించింది.
నేను కొంత కఠోరంగా మారాను.
ఒక రోజున నేను ఇలా అన్నాను 'నీ శరీరంలో ఇంకా విసర్జన కాకుండా ఉన్న మలాన్ని నీవు ఏ విధంగా శుభ్రం చేసుకోగలవు? మలద్వారంలో ఉన్న వ్యర్థాల సంగతటి? ఏ సమయంలోనైనా దేహంలోపల మూత్ర ప్రవాహం ఉంటుంది. దాని గురించి నీవు ఏమి చేయబోతున్నావు?'
అతనిప్పుడు కనిపించటం లేదు. ఇంకొక వికెట్ పడింది...
****
దురాశ, స్వార్థం, లోభం, అహంకారం ఇవన్నీ కూడా కోపమనే అగ్నికి ఆజ్యం పోస్తాయి. ఇది మనసులో ఉండే దుష్ట శక్తులు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇవి మీలో పొదగబడి ఉన్నాయి.
కేవలం హృదయం నుంచి ప్రవహించే బేషరతైన ప్రేమ అనే నీరు, ఈ కోపాగ్నిని చల్లార్చి, ఇటువంటి దుర్గుణాలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది.
****
మీరు ఆత్మజ్ఞానం పొందుతున్న కొద్దీ, స్వచ్ఛతను సంతరించుకుంటారు. స్వచ్ఛత అనే ప్రక్రియ బయట, లోపల కూడా జరుగుతూ ఉంటుంది. కేవలం బకెట్లో కొద్ది పవిత్రమైన నీటిని ఒంపుకోవడం మిమ్మల్ని శుభ్రపరచదు. మీలో ఆ గుర్తింపు రావడానికి అదొక సంకేతంగా మాత్రమే పనిచేస్తుంది. సాక్షాత్కారమనే ప్రక్రియ మీలో మొదలయ్యాకా, మీరు పవిత్రత అనే మార్గంలో పయనిస్తారు. ఇంటిని, బట్టలని రోజూ శుభ్రపరచినట్లుగా ఇది ఉంటుంది. పవిత్రీకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ.
****




No comments:
Post a Comment