శివం -128
శివుడే చెబుతున్న కథలు
రాజ కార్తీక్
దర్శకుని కధ 35
(కార్తికేయుడు మా చోటికి వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి తన నిజమైన ఆత్మ స్థితి తెలుసుకొని మాకు ప్రమాణం చేస్తూ తన్మయత్వం చెందిన తర్వాత.. తన రాసిన రచనలలో .. నేను వైకుంఠం వెళ్లటం సన్నివేశాలు మధ్యలో ఆగిపోయాయని బాధపడేలోపు తను సన్నివేశాన్ని పూర్తి చేయడం.. ఆ తర్వాత లేవయ్యా దర్శక పని మొదలు పెట్టని మేము ఆశీర్వాదం ఇవ్వటం)
(నేను అనగా శివుడు.)
రాజ్యానికి దూరాన ఉన్న ఒక కడుతున్న గుడి
అక్కడ మహారాజు హరసిద్ధుడు తనకున్న శిల్ప కళా తో శివపురాణం మొత్తాన్ని .. శివ కేశవుల తత్వాన్ని.. శిల్ప రూపంలో లాఘవంగా చెక్కుతున్నాడు..
తన కనులకు దృశ్యాలు ఏవో కనపడుతున్నాయి
అది తన యొక్క ప్రేరణలేక నిజమా అంది తెలుసుకోలేకపోతున్నాడు , తేల్చుకోలేకపోతున్నాడు
హరసిద్ధుడు
" ఏమిటి ఇలా పలుసార్లు జరుగుతున్నది నాది బ్రాంతి కాదు కదా! గడువును అనుసరించి రాజనీయమం అనుసరించి కార్తికేయుడు కళా ప్రదర్శన కోసం కళాకారులను పట్టుకుని తీసుకువస్తానని అన్నాడు.. నాకు చూస్తే కార్తికేయడిని మహాదేవుని వారు నాతో లీల ప్రదర్శించినట్టు, ఇలా ప్రదర్శిస్తున్నాడా! ఇది నిజమై ఉంటుందా నాకు మహాదేవుల వారు ఏం చెప్పదలుచుకున్నారు
. ఒక్క మహాదేవుడే కాకుండా.. సాక్షాత్తు మహావిష్ణువు బ్రహ్మదేవుడు అమ్మవార్లు సైతం కార్తికేయంతో కలిసిమెలిసి ఇలా ఉన్నారు.. ఆహా కార్తికేయుడు ఎంత పుణ్యాత్ముడు .. ఎంత భగవంతుని ఆకట్టుకున్నాడు.. ఆ భగవంతుడికి కూడా తన యందు చేసిన రచనల మీద ఎంత రక్త కట్టించి ప్రేమ పుట్టించాడు .. నాతో పలుమార్లు కార్తికేయుడు నీకోసం శివుడు వచ్చినప్పుడు నేను ఊర్లో లేను అన్నా! నాకోసం కూడా ఏదో ఒకనాడు శివుడు వస్తాడులేని చమత్కరించాడు.. దేవతలు తధాస్తు అన్నారేమో అది వాస్తవం అయినట్టు ఉన్నది , ఏమి జరగబోతుందో ఈ దర్శక రచన దురంధరుడు శిఖమణి
ఏం చేయబోతున్నాడో.. లేక ఈ మహాదేవుడు ఈ మహా దర్శకుడుతో ఆ మహావిష్ణువుతో కలిసి ఏమాహత్కర కార్యానికి తలపెట్టారో అత్యంత తొందరగా తెలుసుకోవాలని ఉంది సుమీ ,"అంటూ కుంభన్న ను తలుచుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నా హరసిద్ధుడు కి ఒక సన్నివేశం గుర్తుకు వచ్చింది అది తనతో మహాదేవుడు కుంభన్న రూపంలో వచ్చినప్పుడు జరిగినది
తనతో స్నేహితుడిగా అన్నగా తిరుగుతున్న సమయంలో
హర సిద్దు " కుంభన్నా! చూసావా నేను చెప్పిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరం శిల్పాలు.. ఎంత చక్కగా ఉన్నాయో .. అలాగే వారి పక్కన ఉన్న లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్ల విగ్రహాలు ఎంత బాగా ఉన్నాయో.. వీరందరినీ నిజంగా ఒక్కసారి చూడాలని ఉంది కుంభన్నా.. వీళ్ళల్లో ఒకరిని చూడటానికి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి, అలాంటిది అందర్నీ ఒకసారి చూడగలమా "
కుంభన్న " మనసుపెట్టి పిలువు కనపడతారు, వస్తారు, కాకపోతే వారు వచ్చినప్పుడు కనిపెట్టగల సామర్థ్యం మనకి ఉండాలి కదా ! అదొక్కటే అర్హత ప్రామాణికము పిచ్చపాటి హరి సిద్దయ్య "అంటూ తన బుగ్గలు లాగాడు
హర సిద్దు " ఓ అన్న ! పో అన్న ! నువ్వు కూడా తన ఆట పట్టిస్తూ ఉంటావు .."
కుంభన్న " ఆట ఏమీ లేదు హర సిద్ధా.. నీ పని నువ్వు చేసుకుంటూ పో నీకెందుకు నీ వెనక నేనున్నాను కదా నీ ఆశయాలు కోరికలు అన్నీ తీరుతాయి, నీ మీద ఎవరు ఎంత ఆదరణ చూపించినా వెర్రి బాగుల వాడివలె వారిని పూర్తిగా నమ్మకుండా నీ విచక్షణ నీ ధర్మం మీ యొక్క ఆత్మ గౌరవం కాపాడుకో నాయనా ! అతి ప్రేమ అతి కోపాన్ని అతి ఆదరణని తగ్గించుకొని , సహజంగా చిన్నపిల్లల మీద నీవు చూపించే ప్రేమ ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో అందరూ అలా ఉంటారని అనుకోకు సోదర హర సిద్ధ, అట్లా ఉన్నచో నీకు త్రిమూర్తులు దర్శనం ఇస్తారేమో ఎప్పుడో ఒకప్పుడు నీ జన్మ మార్గ నిర్దేశం అయిన తర్వాత " అని అన్నారు
హర సిద్ధా " తను ఇదివరకు లాగా లేడు , ఇప్పుడు ఎంతో హుందాగా మానసికంగా శారీరకంగా ఒక రాజు వలె పూర్తిగా తామరాకు మీద నీటిబొట్టి వలె మారిపోయాడు.. కుంభన్న మహాదేవుడు చేశాడు అదే ఇప్పుడు ప్రస్తుతం తను చేస్తున్నాడు.. ఒకవేళ
కుంభన్న మాటలకు అర్థం అదేనేమో అంటూ " తన శిల్పకళా నైపుణ్యాన్ని శిలల మీద చూపిస్తూ ఆలోచిస్తూ సాగాడు..
నేను " ఇక మన కార్తికేయుడు ఏం చేస్తున్నాడు చూద్దాం పదండి"
కార్తికేయుడు ఇంకా తన్మయ దృష్టిలో ఉండి.. బయటికి రాలేకపోతున్నాడు
త్రిమూర్తులు త్రి మాతలు ముగ్గురు
" ఓ దిగ్దర్శక ఓ మహా రచయిత , ఇక లేచి నీ దర్శకత్వం మొదలుపెట్టు విజయోస్తు నీ వెనుక మేమున్నాము " అంటూ ఆశీర్వదిస్తూ నవ్వుతూ ఉన్నారు
మన కార్తికేయుడు అదే తన్వైత్వంలో ఒక స్తోత్రం మొదలుపెట్టాడు
" నటరాజ స్వామి ఆశీర్వాదం కావాలి
వరదరాజ స్వామి ఆశీర్వాదం కావాలి
బ్రహ్మదేవుడు స్వామి ఆశీర్వాదం కావాలి
మహాలక్ష్మి దేవి ఆశీర్వాదము తక్షణమే కావాలి
సరస్వతి దేవి ఆశీర్వాదము ఎల్లప్పుడూ నామీద అంతే ఉండాలి
పార్వతి దేవి ఆశీర్వచనములు నాలో ఎన్నటికీ ఎప్పటికీ ఇమిడిపోవాలి
అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు కావాలి
అన్నిటికి మించి నా ఇష్ట దైవం ఆరాధ్య దైవం వీర హనుమంతుడు ఆశీర్వాదం కావాలి
మా గురువు శివరూపం సాధించిన కోటప్పకొండ లోని కలిసిన మా రాజా ఆశీర్వాదం కావాలి
మా రాజ బావ వరదరాజ ఆశీర్వాదం మరింత కావాలి
ఇకపై ఆటంకాలు లేకుండా నేను ముందుకు సాగిపోవాలి
ఇకపై ఎటువంటి నష్టాలు చూడకుండా నేను జీవిత పయనం మొదలు పెట్టాలి
అలానే అన్నిటికీ మించి మా ప్రధమ గణపతి తరువాత కుమారస్వామి యొక్క అండదండలు మాకు కావాలి,
తల్లి అన్నపూర్ణమ్మ నీ ఆశీర్వాదం కావాలి నీ దయతో ఎప్పుడూ బలంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి
తండ్రి మహా మృత్యుంజయ నీ యొక్క ఆశీర్వాదంతో మాకు మరింత ఆయుషుని ఆరోగ్యాన్ని పూర్తిగా ఇచ్చి మా యొక్క అప మృత్యులు తొలగించాలి
తండ్రి నరసింహదేవా మాకు కీడు చేసిన వారికి చేద్దామనుకునే వారికి మాలో నీవు వారికి కనపడాలి
"
నేను " నాయనా నీ శుద్ధ భక్తితో కోరుకుంటున్న ఈ దండకాన్ని "
అంటుండుగా లక్ష్మీదేవి చాలా బిగ్గరగా నవ్వినది
అందరూ ఆ వైపు చూడగా
లక్ష్మీ దేవి " వ్యాపారస్తులు వ్యాపారం మొదలు పెట్టుకునే ముందు కోరుకున్న కోరికలు వలె ఇతగాడి స్తోత్రము బలే ఉన్నది " అంటూ నవ్వింది,
లక్ష్మీ మాత మాత్రమే కాదు అందరము నవ్వుకున్నాం
విష్ణు దేవుడు " అవును మహాదేవ ! మనవాడు వినాయకుడిని కుమారస్వామిని కూడా తీసుకువచ్చారు.. అలాగా ఆంజనేయ స్వామిని కూడా తీసుకువచ్చాడు.... వారిక కూడా
ఈ నాటకంలో పిలుపుందా ? "
నేను " మనదేముంది తమరు జగన్నాటకాన్ని నేను విశ్వనాటకాన్ని రచించి నడిపిస్తున్నాము.. కానీ దర్శకుడు రాసిన నాటకాన్ని తను కదా నడిపించాల్సిందే ! ఏం చెప్తాడో ఏమో ఆ పని అయిపోయేదాకా ఆ పని కోసం ఆరాటపడుతూనే ఉంటాడు , ఎల్లప్పుడూ ఆ నిమిషానికి అన్నిటికీ మించి మంచిదిద్దామని చూస్తాడు , అందుకే కదా మనవాడు మనకు నచ్చిన రచయిత దర్శకుడు అయ్యాడు "
విష్ణు " కమ్మగా పాలకడలిపై శేషనాగు పై లక్ష్మీదేవి కాళ్లు పిసుకుతూ ఉండగా పడుకునేవాణ్ణి , నన్ను పట్టుకొని ఇతగాడి నాటకంలో పెట్టి ఇన్ని తిప్పలు పెడతావయ్యా మహదేవ " అంటూ చనువుగా అడిగాడు
ధ్యానంలో ఉన్న అదే అదే తన్మయిత్వంలో ఉన్న కార్తికేయుడు
" గురువా విష్ణు దేవా ! ఎంతసేపు మా అమ్మ నీకు కాళ్లు నొక్కాలి, పాపం ఎప్పుడైనా ఆవిడకి చేతులు నొప్పులు పుడతాయని ఆలోచించావా ! నా తల్లికి నేను చేతులు పిసుకుతాను అప్పుడు ఆవిడకి కొంత విశ్రాంతి కలుగుతుంది "
ఈ ఒక్క మాటతో లక్ష్మీదేవి తన భర్తకి కాళ్లు పిసుకడం వల్ల తనకు ఎటువంటి నొప్పి లేకపోయినా.. తన బిడ్డతో సమానమైన కార్తికేయుడు తనకి చేతులు నొప్పులు పుడతాయని , అందుకని వీలైతే తన చేతులు తో పిసుకుతానని వాత్సల్యంగా అనటం ఆవిడకి ఎంతో బాగా నచ్చినది.
కార్తికేయని కోరుకున్న విధంగా లక్ష్మీ మాత
" నీవు కోరుకున్న విధంగా తక్షణమే నీకు నా పూర్తి అనుగ్రహం లభిస్తుంది "అని ప్రత్యేకంగా ఆశీర్వదించింది
నేను " చెప్పా కదా అయ్యా మా వాడి కళాత్మక భావనలతో ఎవరినైనా ఇట్లానే మచ్చిక చేసుకుంటాడు హ హ "అంటూ నవ్వాను
విష్ణు దేవుడు " మన రచయిత దర్శకుడు ఈ ఆనంద స్థితిలో ఎంతసేపు ఉంటాడు"
నేను " బాబు మహా రచయిత, దిగ్దర్శక ఆశీర్వాదాలు మీకు సంపూర్ణంగా ఉన్నాయి లేచి ఏం చేయాలో చెప్పు "
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment