శ్రీథర మాధురి - 137
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు)
అతడు: గురూజీ, నాకు ఒక ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన వ్యక్తి తెలుసు. అతను మోక్షానికి గ్యారెంటీ ఇవ్వగలనని అన్నాడు. నేను ప్రయత్నించనా?
నేను: ఎందుకు కూడదు? బహుశా ఆయన చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి కావచ్చు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలిసి ఉండవచ్చు.
అతడు: గురూజీ, నేను మిమ్మల్ని సీరియస్ గా అడుగుతున్నాను. దయచేసి నాకు దారి చూపండి.
నేను: నన్ను వివరించండి నాతో ఉంటే నేను మోక్షం కాదు కదా దేనికి గ్యారెంటీ ఇవ్వను ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా పరిణితి చెందలేదు లేదూ, నేను జ్ఞానినీ కాదు. అంతేకాక అతడు ఈ మోక్షం కోసం నిన్నే ఏదైనా ఉపాసన లేదా సాధనలో పెట్టవచ్చు. అది విజయవంతంగా పూర్తయ్యాక మోక్షద్వారాలు నీకోసం తెరుచుకున్నాయని అతను నిర్థారించవచ్చు. నా గురుకులంలో సాధన లేదు, ఉపాసన లేదు. నిజానికి ఎటువంటి దారి లేదు. నీవు నా వెనకాల ప్రయాణిస్తే, అది నిన్ను ఎటు తీసుకెళ్లదు ఎందుకంటే అసలు దారే లేదు కనుక! నేను ఇటువైపు వెళుతున్నాను నాకే తెలియదు. నాకు ప్రయాణం మాత్రమే ఇష్టం గమ్యం కాదు. నీకు గమ్యం పట్ల ఇష్టం ఉన్నట్లుగా కనిపిస్తోంది కనుక, దాన్ని గ్యారెంటీ ఇచ్చే ఎటువంటి వారు నీకు అవసరం అందుకే నీవు ఈ ఆఫర్ ను మిస్ కావద్దు.
అతను ఇప్పుడు ఆ వ్యక్తితో బిజీగా ఉన్నాడు అతను ఆశించినది దొరకాలని నా కోరిక, ప్రార్థన.
****
అతను: గురూజీ, నేను మోక్షాన్ని పొందడానికి బ్రహ్మచర్యాన్ని ఆవులంబిస్తున్నాను కానీ కొన్నిసార్లు నాకు మోహపు ఆలోచనలు కలుగుతాయి. అవి రాకుండా ఆపడం ఎలాగ? ఈ ఆలోచనలన్నీ పూర్వ సంస్కారాలను బట్టి వచ్చి మోక్షాన్ని పొందడానికి అడ్డుపడతాయా?
నా చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మొదట ఇతనికి బ్రహ్మచర్యం అంటే ఏమిటో కూడా తెలియదు.
అతడు అనేక పౌరాణిక సీరియల్స్ ను టీవీ చానల్స్ లో చూస్తూ ఉంటాడనుకుంటా, వాటిని బట్టి అతడు నిర్ధారణకు వచ్చినట్లుగా ఉంది. లేదా చాలా పుస్తకాలను చదివి ఈ నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు. అతడు సంస్కారాలు, మోక్షం వంటి పెద్ద మాటలను వాటి గురించి ఇసుమంతైనా తెలియకుండా ఉపయోగిస్తున్నాడు. బహుశా అతడు ఎవరైనా ఈ పదాలను వాడడం విని యాంత్రికంగా దాన్ని తిరిగి పలుకుతున్నాడు
ఇది చాలా విషాదకరమైన అంశం.
ఏదైనా ఒక చర్య లేదా నిశ్చేష్ట జరిగినప్పుడు లేదా జరగనప్పుడు దానికి సాక్షిగా ఉండాలి. మీరు బుద్ధి కాదు. దేహం కాదు. మూర్తీభవించిన స్వచ్ఛత. మీలో కల్మషం లేదు. మీరు నచ్చలేని వాస్తవానికి ఒక మచ్చుతునక. మీద్వారా జరిగేవాటికి, మీరు లేకుండా జరిగేవాఇకి మీ ఆత్మ సాక్షిగా ఉండాలి. మీరు కర్త కాదు.
బుద్ధి పనిలో ఉన్నప్పుడు, మీ బ్రహ్మచర్యానికి విలువ ఉండదు. చేయకుండా అప్పడమే బుద్ధి యొక్క పని. కాబట్టి శారీరక అవసరాల గురించి బుద్ధి దేహానికి గుర్తు చేస్తుంది, కనుక మీరు మోహానికి లోనవుతారు. దేహానికి దాని పరిమితులు ఉన్నాయి ఒక రిజర్వాయర్ నిండిన తర్వాత నీరు బయటికి పారాల్సిందే! ఒకసారి శుక్రకణాలు పోగయ్యాకా, హఠాత్తుగా మీరు నిద్రలో ఉన్న కూడా అవి బయటికి దారిని వెతుక్కుంటాయి. ఇందుకు బదులుగా మీరు ఏమీ తిననన్న బ్రహ్మచర్యాన్ని స్వీకరించాలి. అప్పుడు మీరు తమాషా చూస్తారు. మీరు ఆకలికి ఆగలేరు. మహా అయితే ఒక రోజు లేక రెండు రోజులు ఆ తర్వాత మీరు తినడం మొదలుపెడతారు.
బ్రహ్మచర్యం అంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు లేక చెయ్యకుండా ఉన్నప్పుడు మీ సొంత చర్యలను గమనించడం. మీరు కర్త కాదు, దైవమే కర్త. ఏది మీ సొంతం కాదు దేహము కానీ బుద్ధి కానీ ఏది మీకు చెందదు. ఏదీ మీది కాదు.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. అహంకారం, దురాక్రమణ, స్వార్థం, అసూయ వంటి అవరోధాలను అధిగమించండి. మీ చర్యల్లో, ఇతరుల చర్యల్లో దైవాన్ని దర్శంచండి. అన్నింటిలో, ప్రతి దానిలో దైవాన్ని అనుభూతి చెందండి. అలా ఉండండి. ఏదీ అవ్వాలని ప్రయత్నించకండి.
సాధారణంగా ఉండండి, అసాధారణమైనది మీపై ప్రసరిస్తుంది. మీరు అసాధారణంగా ఉండాలని ప్రయత్నిస్తే, అసహజంగా మారుతారు.
అసాధారణమైనది మీపై ప్రసరించినప్పుడు మోక్షానికి ద్వారాలు తెరుచుకోబడతాయి.
****
No comments:
Post a Comment