రూపాయి
రోజా రమణి
రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తుంటావ్? అని అడిగితే
ఉన్నోడికి భయం పుట్టిస్తుంటాను.
లేనోడికి ఆశ పుట్టిస్తుంటాను.
ఉన్నోడిని వ్యసనాల పాలు చేస్తాను.
లేనోడి ఆకలితో ఆడుకుంటాను.
* ఉన్నోడికి "నన్నెలా ఖర్చు పెట్టాలా! అని పరుగులెత్తిస్తాను."*
* లేనోడికి "నన్నెలా అందుకోవాలా అని ఉరకలెత్తిస్తాను."*
* ఉన్నోడికి ఉప్పు కారం వేసుకుని తింటే జబ్బు తెప్పిస్తాను*
లేనోడికి ఉప్పు కారం వేసుకు తినాలంటే అప్పు చేయిస్తాను
ఉన్నోడికి కూర్చున్న చోటికి అన్నీ అందించి ఒళ్ళు తెప్పిస్తాను.
లేనోడికి కావలిసింది దక్కాలంటే ఉన్న ఒళ్ళు కరిగిస్తాను.
* ఉన్నోడి అహంకారాన్ని రెచ్చగొడతాను.*
* లేనోడి ఆత్మవిశ్వాసానికి సవాల్ నవుతాను.*
ఉన్నోడికి భయంతో నిద్ర పట్టనివ్వను.
* లేనోడికి ఆశతో నిద్ర పట్టనివ్వను.*
సరిగ్గా చెప్పాలంటే ప్రాణం లేని నేను, ప్రాణం ఉన్న మనుషులలో ఉన్నోడు, లేనోడు అని తేడా లేకుండా ఇద్దరినీ ఏకచక్రాధిపథ్యంతో ఏలేస్తుంటాను.
✍️రోజా రమణి
No comments:
Post a Comment