గోత్రం అంటే ఏమిటి ?
అంబడిపూడి శ్యామ సుందర రావు


మన హిందూ సాంప్రదాయంలో గోత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణముగా గుడికి వెళ్లి మన పేరున అర్చన చేయించుకోవాలంటే ఆ పూజారి మన గోత్రం అడుగుతాడు మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతాడో మీకు తెలుసా?మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు? అలాగే పెళ్లిళ్లు కుదుర్చుకోవడానికి కూడా వారి గోత్రాలు అడుగుతారు సగోత్రీకుల మధ్య వివాహం కుదరదు మన మహా ఋషుల చే సృష్టించబడిన అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి .గోత్ర వ్యవస్థ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? కొడుకులకు మాత్రమే ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె కు గోత్రం ఎందుకు మారాలి? ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! మొదట్లో గోత్రములు బ్రాహ్మణా క్షత్రియ వైశ్యులకు మాత్రమే ఉండేవి క్రమముగా అన్ని వర్ణాల వారికి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ గోత్ర వ్యవస్థ బ్రాహ్మణులలో బలంగా ఉన్నది అందుచేత ముందు బ్రాహ్మణుల గోత్రాల గురించి తెలుసుకుందాము.
భారత దేశము నందు కల బ్రాహ్మణ కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక గోత్రము, ప్రతి గోత్రానికి ముగ్గురు (త్రయార్షేయ) లేదా అయిదుగురు (పంచార్షేయ) ఋషుల వరస ఉంటుంది. ఈ ఋషుల వరసే ఈ కుటుంబాల మధ్య వారధి. బ్రాహ్మణ వివాహ విధి ప్రకారం, సగోత్రీకులు (ఒకే గోత్రం ఉన్న అబ్బాయి, అమ్మాయి) వివాహమాడరాదు. ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి.అలానే, త్రయార్షులలో మొదటి ఋషి కలవరాదు. వీరు దాయాదుల లెక్కన వస్తారు. ప్రతి గోత్రము సప్తర్షులలో ఒకరి నుంచి వచ్చినదే. గోత్రం అనగా మూల పురుషుడు పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యుని తాలూకు విత్తనానికి (లేదా వీర్యకణానికి) జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి, గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.బౌద్ధాయనస్రౌత-సూత్రము ప్రకారము విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి (కృష్ణాత్రియ) , వశిష్ట, కాశ్యప , అగస్త్య అనే 8 మంది ఋషులు, వారి సంతానం పేర్లే బ్రాహ్మణ గోత్రములు. ప్రజాపతి కి, ఈ 8 మంది ఋషులకి సంబంధము లేదు. వీరిని, వీరి సంతానమును గోత్రములని , మిగతా వారిని "గోత్రవ్యయవ" అని అంటారు. గోత్రములన్నీ గుంపులుగా విభజింపబడ్డాయి. వశిష్ట గణము నాలుగు గా విభజింపబడింది. అవి ఉపమన్యు, పరాశర, కుండిన, వశిష్ట. వాటికి మళ్ళీ పక్షాలు ఉన్నాయి. గణము, పక్షము, గోత్రము, ఇలా వస్తాయి. గణము, పక్షం, గోత్రము, అన్నీ కలిపి చదవడానిని ప్రవర అంటారు. పరాశర గోత్రానికి ప్రవర "వశిష్ట, శాక్త్య, పరాశర". ఉపమన్యుకు "వశిష్ట, భరద్వసు, ఇంద్రప్రమద". 19 మంది ఋషులు దాకా, ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, ఇలా ఎంత మందితో అయినా ప్రవర ఉండవచ్చు. ఆంధ్రదేశములో కాశ్యపస గోత్రానికి కనీసం రెండు ప్రవరలు ఉన్నాయి. ఒకటి త్రయార్షేయ ప్రవర, ఇంకొకటి సప్తార్షేయ ప్రవర. ప్రవరలు రెండు విధాలుగా ఉన్నాయి.శిష్య - ప్రశిష్య - ఋషి పరంపర,పుత్ర పరంపర పుత్ర పరంపరలో ఒక ఋషి కలిసినా వివాహం నిషిద్ధము. శిష్య - ప్రశిష్య - ఋషి పరంపరలో సగము, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఋషులు కలిస్తే వివాహం నిషిద్ధము
మొదట్లో గోత్రాలు బ్రాహ్మణుల వరకే ఉండేవిట దీనిలో అంతరార్థం గుర్తించి ఇతర వర్ణాల వారు కూడా పాటిస్తున్నారు. . సాధారణముగా మనము ఏ వంశములో పుట్టామో అదే మన గోత్రం గా వస్తుంది. మొదటగా ఈ గోత్రాలు సప్త ఋషుల పేర్ల మీద మొదలయ్యాయి.ఆ విధంగా ఋషులు గోత్ర పాలకులుగా గుర్తింపు పొందడం వలన వారి పేర్ల మీద బ్రాహ్మణులలో గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాత వ్యవసాయములో వాడే పనిముట్లు లేదా ఉపయోగించే ఆయుధాలు లేదా విద్య నేర్పే గురువు పేరు మీద గోత్రాలు ఏర్పడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే భారత దేశములో సుమారు 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని వినికిడి
గోత్రం అనే ప్రస్తావన మొదటిసారి చాందోగ్య ఉపనిషద్గో లో సత్య కామ జబాలి అనే కదా లో వినిపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని బాలుడు గౌతమ మహర్షిని విద్య నేర్పమని అడిగితె నీ తల్లిదండ్రులు ఎవరు నీ గోత్రం ఏమిటి అని అడుగుతాడు. గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, గురుడు భూమి, వేదం అని అర్థాలు. రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం గోత్రం అంటే 'గోశాల' అని అర్థం ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూల పేర్లు కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.గోత్ర వ్యవస్థ సశాస్త్రీయమైనది చాదస్తం అని కొట్టిపారేయకండి
గోత్రం తెలియని వారు ఏమి చేయాలి అంటే పండితుల అభిప్రాయం ప్రకారం విష్ణువు ను పూజించే వారు అయితే విష్ణు గోత్రం అని శివుడిని పూజించే వారు అయితే శివ గోత్రం అని చెప్పుకోవచ్చు. మరికొంతమంది పండితులు గోత్రం తెలియనప్పుడు కాశ్యపుడు అనేక విషయాలకు మూల పురుషుడు కాబట్టి కాశ్యపస గోత్రం అని చెప్పవచ్చు.
***
No comments:
Post a Comment