బతుకమ్మ పండుగ పాట
-సుజాత. పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
'మా పూల పండుగ ఉయ్యాలో..బతుకమ్మ వేడుక ఉయ్యాలో!'
(బతుకమ్మ పాట)
బాల భానుడితోడ ఉయ్యాలో
బాలబాలికలంతా ఉయ్యాలో
పొద్దుపొద్దునే లేచి ఉయ్యాలో
ముద్దుముచ్చతోటి ఉయ్యాలో
పూలబుట్టలునింపి ఉయ్యాలో
భక్తిశ్రద్ధలతోనిలిపె ఉయ్యాలో
బంగారుబతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ అనిన ఉయ్యాలో
బతుకు నూరేళ్ళు ఉయ్యాలో
సౌభాగ్యలక్ష్మియని ఉయ్యాలో
కలిమి బలిమినిచ్చు ఉయ్యాలో
కల్పవల్లియని ఉయ్యాలో
పొంగారుసంబరములుయ్యాలో
బంగారుబతుకిచ్చె ఉయ్యాలో
బతుకమ్మ తల్లి ఉయ్యాలో
బంగరు తల్లి ఉయ్యాలో
నదులు చెరువుల చెంత ఉయ్యాలో
ముదితలందరు జేరి ఉయ్యాలో
ముదముతో పాడిరి ఉయ్యాలో
ముచ్చటైనపాటలుయ్యాలో
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
మురిపాలవెల్లియని ఉయ్యాలో
కలగలిపి జేసిరి ఉయ్యాలో నృత్యగానాలు ఉయ్యాలో
తంగేడు రుద్రాక్ష లుయ్యాలో
గోరింటగునుగుపూలుయ్యాలో
చెంగల్వచేమంతు లుయ్యాలో
బంగారు రంగు పూలుయ్యాలో
బంతి బొండు మాలలుయ్యాలో
సింగారించిమురిసితిరుయ్యాలో
బొడ్డెమ్మని చూసి ఉయ్యాలో
ముగ్ధమోహనంతో ఉయ్యాలో
ఆయురారోగ్యాలనుయ్యాలో
ఇయ్యమనికోరితిరి ఉయ్యాలో
అష్టైశ్వర్యములను ఉయ్యాలో
అందియ్యమనిరి ఉయ్యాలో
పసుపుకుంకుమలతో ఉయ్యాలో
సిరిసంపదలనిచ్చి ఉయ్యాలో
సల్లంగ చూడమని ఉయ్యాలో
నియమముగా పూజించిరుయ్యాలో
వేడుకొనిరి పడతులందరుయ్యాలో
పసుపు గౌరమ్మని ఉయ్యాలో
పేద సాధలని ఉయ్యాలో
బేధ భావము లేక ఉయ్యాలో
ఐకమత్యముతో కూడి ఉయ్యాలో
పేర్చిరందరు పూలు ఉయ్యాలో
భోగభాగ్యములు కన్నా ఉయ్యాలో
కలిసి ఉండుట మేలని ఉయ్యాలో
కూర్చి ఇచ్చిరి మగువలు ఉయ్యాలో
శాంతి సందేశము ఉయ్యాలో
తెలంగాణాప్రత్యేక సంబురముయ్యాలో
సమైక్య కుటుంబ నిదర్శనముయ్యాలో
మా పూలపండుగ ఉయ్యాలో
బతుకమ్మ వేడుక ఉయ్యాలో
మా ఆడబిడ్డరో ఉయ్యాలో
ఏడాదికొకమారు ఉయ్యాలో
దీవించ వచ్చెరో ఉయ్యాలో!
మముదీవించ వచ్చెరో ఉయ్యాలో!!
***
No comments:
Post a Comment