వరలక్ష్మీ రావమ్మ - ఇష్ట పదులు
అద్దంకి లక్ష్మి, ముంబై
1
శుక్రవారపు పూజలు శుభములు కలుగగాను
మహిళలందరకునూ మనసైన పండుగిది
అష్టైశ్వర్యాలిచ్చు ఆచరించే వ్రతము
భక్తి శ్రద్ధలతోను ముక్తి కొరకు చేయాలి
పీఠముపై కలిశము పువ్వులు పండ్లు పెట్టి
ప్రసాదాలన్నియు పవిత్రముగ వండాలి
కొత్త పెళ్ళికూతురి కోరిన కోర్కెతీర్చు
సకల జనుల కెల్లను సర్వ శుభాలనిచ్చు
2
మామిడి తోరణాలు మల్లెపూల దండలు
ధూప దీపాలతో దేదీప్యమానంగ
కొలువై యుండె తల్లి కోటి దండాలమ్మ
వరలక్ష్మీ దేవీ వరము లీయగ రావే
కలశ పూజ చేసి కానుకలు సమర్పించి
ముత్తైదువుల పిలిచి ముచ్చటగ తాంబులము
ఆశీస్సులిచ్చేరు అతివలు దీవించు
ఆయురారోగ్యాలు అమ్మవారిని కొలువ
***
No comments:
Post a Comment