శ్రీథర మాధురి - 136 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 136

Share This

  శ్రీథర మాధురి - 136 

                                        (పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు)




అతను ఒక గొప్ప సాధువు. పరమ జ్ఞాని. మంచి హృదయం కలవాడు. ఒకరోజు ఒక బహిరంగ ప్రదేశంలో నేను అతన్ని కలిసాను.
 
అతను మోక్షం గురించి చాలా మాట్లాడుతున్నాడు. ఈ జీవితాన్ని ఒక వేదనగా భావిస్తున్నాడు.
 
చివరికి అతనిలా అడిగాడు, 'ఒక గురువుగా మోక్షం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ విషయంలో మోక్షం ఎప్పుడు కలుగుతుంది?' 
 
నేను ఇలా అన్నాను 'మొదట మనం అహంకారం, స్వార్థం, కోపం, అసూయ పశ్చాత్తాపం, లోభం వంటి వాటి నుంచి మోక్షం పొందాలి.‌ పోటీతత్వం నుంచి, ఇతరుల పట్ల దుర్భావనల నుంచి కూడా మనం మోక్షం పొందాలి.

నాతో అనుబంధాన్ని కలిగి ఉన్న కుటుంబాలన్నీ, మొదట కనీసం దీనిని సాధించేందుకే నా ప్రయత్నమంతా.‌ అనేక జన్మల తర్వాత వీరు దానిని సాధించవచ్చు. అందుకోసం, అనేకమార్లు వారితో ఉండి వారిలో మార్పు తీసుకురావడం కోసం నేను మరల మరలా జన్మించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ పూర్తయ్యేదాకా, నేను స్వార్థపూరితంగా లేదా దురాశతో అనికూడా అనగలను, నా మోక్షసాధన గురించి ఆలోచించలేను. ఆ పరమాత్మలో ఐక్యమయ్యే అవకాశం దొరికేందుకు ముందు ఒక ప్రయోగిగా లక్ష్యం పూర్తి అయ్యేంతవరకు నేను భూమిని అనేక మార్లు సందర్శిస్తూ ఉంటాను. ఇదంతా ముగిశాక కూడా ఒకవేళ దైవం నేను తిరిగి భూమిపై జీవితాన్ని ఒక పురుగుగా లేక శైవలం(algae) దకుడ జీవితాన్ని మొదలుపెట్టాలని కోరుకుంటే నేను అటువంటి సేవలో ఆనందంగా పాల్గొంటాను. ఎందుకంటే దైవేచ్ఛకు లోబడడం తప్ప నా జీవితంలో నాకు ఎంపిక లేదు. ఇది కూడా పూర్తిగా ఆయన అనుగ్రహమే. కాబట్టి నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రస్తుతం ఎటువంటి తొందరా లేదు.
  
అసలు కూడా తిరిగి హుందాగా నవ్వారు.
     
****
ఒక  ఆసక్తికరమైన ప్రశ్న... మోక్షం అంటే ఏమిటి? బుద్ధి నుంచి విముక్తా లేక జన్మ‌నుంచి విముక్తా? దీనిని గురించి ఆలోచించాల్సి ఉంది.
 
తుదకు భగవంతుడు 'ఆయనే కర్త' అన్న అంశాన్ని మీరు తెలుసుకునేలా చేస్తారు. ఏదీ ఆయన దృష్టిని దాటిపోలేదు. చాలాసార్లు మానవమేధస్సు తర్కంలో ఉంటుంది. కొంతమంది మనుషులకు దైవానికి లోబడడానికి ప్రేరణ, తర్కం కావాలి.  వారు శరణాగతి వెడితే వారికి మోక్షం లేక స్వర్గం దొరుకుతుందన్న ప్రలోభం మనుషులకు కావాలి. ఇటువంటి తీపిఆశ చూపిస్తే తప్ప వారు శరణాగతి వేడరు. శరణాగతి తరువాత దైవం ఏమి చిన్న ఆమోదించాలని ఆయన అంటే ఎంతమంది మనుషులు శరణాగతి వేడుతారు?
   
ఎవరు శరణాగతి కోసం ముందుకు రారు. అందుకే దైవం ఇలా అనాల్సి వచ్చింది. 
  
"సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజః |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ”

కాబట్టి 'మీరు నన్ను శరణు వెడితే, నేను మీ కర్మలన్నింటిని నా ఖాతాలోకి తీసుకొని మీకు అభయమిస్తాను అని దైవం అంటారు. కాబట్టి 'మోక్షం' అనే తాయిలంతో దైవం మనకు ప్రేరణ కలిగిస్తే తప్ప మనం శరణాగతి వేడము.

కాబట్టి, మొత్తం ప్రపంచం వ్యాపారమయమని దైవానికి తెలుసు. వస్తుమార్పిడి విధానంలాగా ప్రతిదానికీ బదులుగా ఏదో ఒకటి కావాలి. అందుకే ఒకరు సంపూర్ణ శరణాగతి వేడినప్పుడు ఆయన మోక్షమనే తాయిలాన్ని అందిస్తున్నారు.
 
మోక్షానికి అతీతంగా దైవేచ్ఛను ఆమోదించి, ఆయన పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో సంపూర్ణ శరణాగతి వేడే ఒక్క భక్తుడి కోసం దైవం వెతుకుతున్నారని నా భావన. దైవం రక్షించినా, శిక్షించినా కూడా నిబంధనలు లేకుండా ఎటువంటి ఫలితాలు ఆశించకుండా ఆయనను ప్రేమించే ఒక్క భక్తుడి కోసం ఆయన వెతుకుతున్నారు.

***


No comments:

Post a Comment

Pages