ఒకటైపోదామా ఊహల వాహినిలో -27
కొత్తపల్లి ఉదయబాబు
" అమ్మ. మన వెళ్లాల్సిన మురుడేశ్వర్ ఎక్కడుందో
ఒకసారి గూగుల్లో చదువుతాను. ఫోన్ ఇస్తావా? " గుడి నుంచి ఇంటికి వచ్చాక హరిత అడిగింది తల్లిని.
నవ్వుతూ కూతురికి ఫోన్ తెచ్చి ఇచ్చింది శకుంతల.
" ఎందుకమ్మా నవ్వుతున్నావ్?" అమాయకంగా అడిగింది హరిత.
" బిడ్డ వివాహం జరుగుతుందంటే ఏ తల్లి కన్నా
సంతోషంగా ఉంటుంది కదమ్మా " అన్యవనస్కంగా
అంది శకుంతల.
" పెళ్లి ఏమిటి? ఎవరి బిడ్డకి? " అయోమయంగా అడిగింది హరిత.
చేత్తో తల మీద కొట్టుకుని " ఏమిటో.. నీ పెళ్లి
అయిపోతే బాగుండును అని ఏవో పిచ్చి
ఆలోచనలు. ఏం లేదులే " అని తేల్చేసింది శకుంతల.
హరిత గూగుల్ లో మురుదేశ్వర్ గురించి వెతికింది.
వెంటనే ఖాళీగా ఉన్న తన డైరీ ఒకదానిని తీసుకుని ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా నోట్స్ గా రాసుకుంది.
"మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల
దూరంలో, మురుడేశ్వర్ ఆలయం
ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయ మైన ఈ కోవెల
కర్నాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి.
మురుడేశ్వర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. మరియు
మురుడేశ్వర్‌లో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఒకటి. ఈ పట్టణాన్ని పూర్వం 'మృడేశ్వర' అని
పిలిచేవారు. ఆలయ నిర్మాణం తర్వాత మురుడేశ్వర్ అని
పేరు మార్చారు.
పురాణాల ప్రకారం, రావణుడు కైలాస పర్వతం నుండి
ఆత్మలింగాన్ని తీసుకువచ్చాడు. గణేశుడు తన ఉపాయాన్ని ఉపయోగించి లంకకు వెళ్లే
మార్గంలో రావణుడిని మోసం చేశాడు.
అంతే కాదు.గోకర్ణం వద్ద లింగాన్ని నేలపై పడేశాడు.
దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు లింగాన్ని పెకిలించి నాశనం చేసేందుకు
ప్రయత్నించాడు.
లింగం యొక్క విరిగిన ముక్కలు దూరంగా
విసిరివేయబడ్డాయి. కందుక గిరిలో లింగం యొక్క కవరింగ్ గుడ్డ పడిపోయింది మరియు ఆ
స్థలంలో మురుడేశ్వర్ ఆలయం నిర్మించబడింది.
ఈ ఆలయం కందుక గిరి అనే చిన్న కొండపై ఉంది, మూడు వైపులా సముద్రం ఉంది.
ఈ ఆలయం ద్రావిడ శైలిలో చాళుక్య మరియు కదంబ శిల్పాలతో
నిర్మించబడింది. ఆలయం ప్రధానంగా గ్రానైట్‌తో నిర్మించబడింది.
ఇది 20-అంతస్తుల ఎత్తైన గోపురాన్ని ఆలయంలోకి వెళ్లే
మెట్ల వద్ద రెండు లైఫ్-సైజ్ కాంక్రీట్ ఏనుగులచే రక్షించబడింది. ఈ టవర్ 249 అడుగుల
పొడవు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురం గా పరిగణించబడుతుంది. గర్భగుడిలో, శివుడు భూమికి 2 అడుగుల దిగువన లింగ
రూపంలో ఉంటాడు.
గీతోపదేశం,
సూర్యరథం, రావణుడి నుండి ఆత్మలింగాన్ని
స్వీకరించిన గణేశుడి శిల్పం కందుక కొండపై నిర్మించిన ఇతర శిల్పాలు. 123 అడుగుల
ఎత్తైన శివుడి విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివ శిల్పం మరియు మురుడేశ్వర్
యొక్క మైలురాయిగా మారింది. కొండపైకి ఎక్కగానే గుర్రం మీద కూర్చున్న జట్టిగా
విగ్రహం కనిపిస్తుంది. మైసూర్‌కి చెందిన టిప్పు సుల్తాన్‌చే పునరుద్ధరించబడినట్లు
చెప్పబడే ఈ ఆలయం వెనుక ఒక పెద్ద కోట ఉంది. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది
గొప్ప ప్రదేశం.
మహా శివరాత్రి ఈ ఆలయంలో భారీ స్థాయిలో జరుపుకునే
ప్రధాన పండుగ, కర్ణాటక మరియు
సమీప రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలను ఆకర్షిస్తుంది."
అబ్బ....జీవితంలో మొదటిసారి అమ్మ ఎంత మంచి
ప్రదేశానికి తీసుకెల్తోంది?..
అని అనుకొని గూగుల్ లోని ఆ ప్రదేశపు బొమ్మలన్నీ చూస్తూ అలాగే నిద్రపోయింది.
ఆమె కలలో విరాట్ స్వామి సన్నిధిలో తన మెడలో తాళి
కట్టినట్టు, ఆ తర్వాత ఒకరి చేతిని ఒకరు దండగా అల్లుకుని ఆ
ప్రదేశాలన్నీ తిరుగుతూ, చివరగా బీచ్ లో బోట్స్ షికార్
చేస్తున్నట్టు కలలు ఒకదాని వెనుక ఒకటి అలా
వస్తూనే ఉన్నాయి.
*******
మర్నాడు ఉదయం బయలుదేరి ఆ మరునాటి ఉదయం మురుగేశ్వర్
చేరుకున్నారు శకుంతల, హరిత.
స్టేషన్లో రైలు దిగిన వెంటనే " అక్కా...ఎంత కాలం అయింది నిన్ను చూసి? " అని ఆప్యాయంగా చమర్చిన
కళ్ళతో చేతులు చాచిన బబితను కౌగిలించుకుంది శకుంతల.
" బావున్నావా చెల్లీ..సరిత ఎలా ఉంది? "
" బావుంది అక్కా. ఏమ్మా... హరిత బాగున్నావా? " అని ఆప్యాయంగా
పలకరించింది హరితని.
" నా పేరు మీకు తెలుసా? " ఆశ్చర్యంగా అడిగింది హరిత.
" నీ గురించి నాకు అంతా తెలుసు.వెళ్దామా?"
అంతలో అక్కడికి ఒక నడివయసు యువకుడు వచ్చాడు.
"అక్కా.తను మా తమ్ముడు.హరీష్. ఆర్ఎన్ఎస్ రెసిడెన్సీలో సూపర్వైజర్ గా చేస్తున్నాడు. ఆయన పోయాక
పుట్టింటికి చేరిన నాకు అన్ని విధాల వీడే అండ " బబిత పరిచయం చేసింది అతన్ని .
" అలాగా నమస్తే బాబు." నమస్కారం పెట్టింది
శకుంతల.
" అదేంటి అక్కా.మీరు మా అక్కలాంటివారే.
లాంటివారు ఏంటి...మా అక్కే. మీకు ఏ ఏర్పాటు కావలసిన నన్ను మొహమాటం లేకుండా అడగండి.
పదండి బయలుదేరుదాం. " అని లగేజ్ తో ముందుకు నడిచాడు అతను.
ఇంటికి చేరుకున్న వెంటనే మంచినీళ్లు తాగాక శకుంతల
ఎవరి కోసమో చూస్తున్నట్లు కలియ చూసింది. ఆ చూపుకు అర్థం తెలుసుకున్న
బబిత " అమ్మా...సరిత.. " అని పిలిచింది.
" వస్తున్నానమ్మా" అంటూ అక్కడికి వచ్చిన
సరితని చూసి శకుంతల ఒక్కసారిగా దగ్గరికి వెళ్లి తల నిమురుతూ.
" అమ్మ సరిత ఎంత పెద్ద దానివి అయ్యావు " ఆ
అమ్మాయి నూతన ముద్దు పెట్టుకుంది.
ఆ అమ్మాయిని చూస్తూనే హరిత కొయ్యబారి పోయింది. ఆ
అమ్మాయి ముమ్మూర్తులా తనలాగే ఉంది.
" అమ్మా?
ఇందాక రైల్వే స్టేషన్లో సరిత ఎలా ఉంది అని అడిగావు తనేనా?
" అడిగింది హరిత శకుంతలని
ఆ అమ్మాయిని అలాగే చూస్తూ.
" అవునమ్మా. తను నీ రక్తం పంచుకుని పుట్టిన
చెల్లెలు. నాకు పిల్లలు లేకపోతే నాకు 'అమ్మా ' అని పిలిపించుకునే అదృష్టాన్ని
కలిగించింది మీ అమ్మే. " అంది బబిత.
ఆ మాట వింటూనే హరిత, సరిత ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు
చూసుకున్నారు.
హరిత,
సరితలకు మధ్యకి వెళ్లిన
బబిత వారిద్దరి చేతులు కలుపుతూ... "మీ రక్త సంబంధాన్ని విడదీసిన పాపం
నాదేనమ్మా. నాదే " అని కన్నీళ్లు పెట్టుకుంది.
" అలా అంటావేంటి చెల్లి. పురుట్లో పసిగుడ్డుగానే
దానిని నీ చేతుల్లో పెట్టాను. దానిని ఈ వేళ ఇంత ప్రయోజకురాలిని చేసిన దానివి
నువ్వు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు అది ఎప్పటికీ నీ కూతురే.
ఒకవేళ పెద్దవాళ్ళం మనం లేకపోయినా ఆ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని ఈవేళ నిజం
బయట పెట్టాల్సి వచ్చింది. " అంది శకుంతల.
ఆ మాట వినగానే సరిత, హరితల చేతులు బిగుసుకున్నాయి.
" నిన్న ఉదయం అనగా బయలుదేరారు. ఏం తిన్నారు
ఏమిటో.. స్నానం చేసేయండి అక్కయ్య. టిఫిన్ చేద్దురుగాని " అని శకుంతలని
లోపలికి తీసుకు వెళ్ళిపోయింది బబిత.
శకుంతల స్నానం చేసి తిరిగి వచ్చేసరికి హరిత సరిత మంచి స్నేహితులైపోయారు.
" అమ్మ నువ్వు కూడా స్నానం చేసి వచ్చేస్తే టిఫిన్ పెట్టేస్తాను. సరిగాడు.. అక్కకి
స్థానానికి నీళ్లు ఏర్పాటు చేసి రా అమ్మ " అంది బబిత సరితతో.
" సరేనమ్మా... రా అక్కా " అంటూ హరితను
దగ్గరుండి తీసుకెళ్లింది సరిత.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment