నమ్మకాన్ని పూజిద్దాం
-చందలూరి నారాయణరావు
9704437247
ఇదేమిటి మనపై
కాలం పగపట్టినట్లు
మాటలు బిగిసిపోతున్నాయి.
నిన్ను ప్రశ్నగా మార్చి
నేను సమాధానం కాకుండా చేసి
ఏం చేయాలనో ?
నిశ్శబ్దాన్ని గుంటగా మార్చి
ఏదో పూడ్చాలన్న
మాయజాలం వినిపిస్తుంది.
ఇష్టానికి అనుమాన అవమానాలా?
సంతోషాలను ఓర్చలేక
పక్కనే పిచ్చి భయలా?
గొప్ప నిర్మాణంలో పునాది శత్రువా?
ఒకే వేరు గల ఊహలో
వింత పూతలు, పూలు , కాయలు
గాయం పచ్చగా
కాలం బాధగా మారి
మనసు వెనక్కి నడుస్తున్నా
నమ్మకాన్ని పూజిద్దాం.
ఒకరికి ఒకరం వరంగా
గెలుపు కోరుకుందాం.
ఎప్పటికీ నిజాన్నే నేను.
ఎప్పుడూ నిజానివే నీవే.
మార్పు మరణంలోనే సాధ్యం.
***
No comments:
Post a Comment