శ్రీథర మాధురి - 135
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు)
అర్థ-ధర్మ-కామ-మోక్ష...
మోక్షాన్ని పొందాలన్నా లేక దేన్నైనా అధిగమించాలన్న మనం దానితో జీవించాలి...
లౌకికమైన(అర్థ) జగతిలో ఒకరు, సదాచారము (ధర్మాన్ని), జీవించాలన్న సత్యమైన కోరిక(కామ)ను కలిగి ఉంటూ జీవిస్తేనే వాటిని అధిగమించి, శాశ్వతత్వం(మోక్షం) అన్న స్థితిని పొందగలుగుతారు.
****
నారాయణ భగవానుడే ఈ భూమిని, విశ్వాన్ని సందర్శిస్తూ అనేకమార్లు అనేక అవతారాలెత్తుతూ, అన్ని యుగాలలో వాటిని మరలమరలా దాల్చుతూ ఉంటారు, కనుక ఈ వలయానికి అంతం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో, వైకుంఠంలో ఒకరు శాశ్వతంగా నివసిస్తారని మీరు అనుకుంటున్నారా?
దురాశ పడకండి మీరు మోక్షాన్ని పొందిన కూడా అది ఒక నిర్ణీత సమయం పాటు మాత్రమే ఉండవచ్చు. కాబట్టి మీరు శాశ్వతంగా మోక్షాన్ని పొందడం లేక దైవంలో ఐక్యమవడం అనేది ఉండదు.
ఇది తిరిగి వచ్చి నాతో ఉండాల్సిందే తప్పించుకోలేరు నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని తిరిగి కలవడానికి వేచి ఉంటాను.
****
కొంతమందికి సంపద కావాలి
కొంతమందికి ఆరోగ్యం కావాలి
కొంతమందికి కోర్టులో తమ కేసు గెలవడం కావాలి
కొంతమందికి వివాహం కావాలి
కొంతమందికి పిల్లలు కావాలి
కొంతమందికి ప్రేమ కావాలి
కొంతమందికి తను అనుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడం కావాలి
కొంతమంది నిలుపుదల చేయాలనుకుంటారు
కొంతమందికి ప్రమోషన్ కావాలి
కొంతమందికి అదృష్టం కావాలి
కొంతమందికి ఆమె భర్త తనను బాగా అర్థం చేసుకోవడం కావాలి
కొంతమందికి స్వేచ్ఛ కావాలి
కొంతమంది తమను తాము బిజీగా ఉంచుకోవడం కావాలి
కొంతమందికి విజయం కావాలి
కొంతమందికి మోక్షం కావాలి
ఇవన్నీ పొందడానికి మీకు అర్హత ఉందా లేదా అని చూడడం మా పని కాదు
మీకు ఏది కావాలన్నా ఇవ్వమని దైవాన్ని ప్రార్థించటమే మా పని.
కాబట్టి అందరి బాగు కోసం సమిష్టిగా ఎల్లప్పుడూ ప్రార్థిద్దాము.
లోకా స్సమస్తా సుఖినోభవంతు!
****
No comments:
Post a Comment