శివం -125 - అచ్చంగా తెలుగు

 శివం -125

శివుడే చెబుతున్న కథలు

దర్శకుని కథ - 32






నూట పాతిక ఎపిసోడ్ సందర్భంగా నేను చెప్పదలుచుకుని ఒక్కటే 
అంతా శివం శివోహం శివమయం. 
ఇది కేవలం శివుడు చెబుతున్న కథలు..
రాజా కార్తీక్ కేవలం ఒక కలంకి ఉన్న సిరా మాత్రమే 

 నేను అనగా శివుడు 
విష్ణు మూర్తి ..వరద రాజ 
బ్రహ్మ దేవుడు..కమల సంబ

(కార్తికేయుడు.. మా యొక్క ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత త్రిమాతలను చూసి తన ఆత్మ స్థితి తెలుసుకొని .. తీవ్రమైన భావోద్వేగం పొంది జయ ధ్వని చేసి.. ఆ తరువాత నేను అతని భుజం మీద చేయి వేసిన పిమ్మట మమల్ని కూడా నిజరూపంలో దర్శించుకున్నాడు, ఆ తర్వాత ఆనంద ఉత్సాహంలో నాకు అలంకారం చేసి విష్ణువు కి అభిషేకం చేశాడు )

"భక్తులారా! నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి.. నేను కచ్చితంగా మీలోని భక్తిని చూస్తాను.... అందుకు నిదర్శనంగానే ఎన్నో కథలు మీకు ఇప్పటివరకు  వివరించి చెప్పాను.. అందులో మనసు ఆకట్టుకునే కథలు ఎన్నో కో కల్లలు 
మీరు ఏ రూపాన ఎవరిని పూజించి విన్నవించుకున్న అది జరిగేది నాకే.. శివార్పణమంటే శివుడికి అర్పణమే కదా.. నా ముందు నా తర్వాత అది ఎవరికీ తెలియదు నాకు తప్ప.. బ్రహ్మానందం సృజించిన నాకు బ్రహ్మాండాలను నిర్మించిన నాకు. అందరికంటే ఇష్టం భక్తుడు నా పైన చూపిస్తున్న శ్రద్ధ మాత్రమే.. మీరు నాలో యోగిని చూస్తే యోగిగా దేవుని చూస్తే దేవుడిగా గురువును చూస్తే గురువుగా స్నేహితుని చూసి స్నేహితుడిగా .. మీకు అనుకూలించి మీ కర్మలు దహించి వేస్తాను.. పాపములు పుణ్యములు అంతా మన చిత్తము ప్రకారం జరుగుతాయి .. స్థిర  చిత్తము కలిగి పాపములను త్యజించి పుణ్యమని పెంచుకొని. మానవ జీవితాన్ని సార్థకత వహించుకోండి.. సాటి జీవుల యందు భూతదయ కలిగి ఉండండి... మాతృభూమిని నా రూపంగా భావించండి 
. మాతృభూమి రక్షించుకునే సంగ్రామంలో మీరు అసువులు బాసిన మీరు నా చెంతకు చేరుతారు.. ఎంతవరకు ధర్మాన్ని కాపాడ గలరు అంతవరకు కాపాడండి.. మీరు నాకు భయపడవద్దు మీరు చేస్తున్న కర్మలకి భయపడండి.. కర్మ వెంటాడుట తథ్యం .. మీ కర్మను సైతం దహించవేసి మార్గాన్ని తక్షణమే ఆచరించండి.. గడిచినదేదో గడిచినది. ఈ నిమిషము నుండి దైవ పూజల లో నిమగ్నమవ్వండి. లేక నీలో నేను ఎక్కడ ఉన్నాను అన్వేషణ కొనసాగించటం మొదలు పెట్టండి.. కొబ్బరిలో నీరు పెట్టిన నాకు మీరు కోరుకున్న మీకు ఇవ్వటం నాకు తెలియదా.. చేతనైనంత మంచి పనులు చేయటమే మీరు మానవ జన్మలో అన్నిటికన్నా ఉత్తమమైన యజ్ఞముగా భావించండి..
మీకు నేను సంపాదించిన ప్రసాదించిన ప్రత్యేక నైపుణ్యాన్ని మంచి జరగడం కోసం ఉపయోగించండి.. మీ పుణ్యాన్ని కొన్ని వేలరేట్లు పెంచుకొని నాకు అర్పణం కావించండి .. పూర్వజన్మ కర్మ వల్ల నేను ప్రసాదించిన లోటుపాట్లతో ఎవరిని ఎగతాళి చేయవాకండి .. ఉన్నతమైన జీవితాన్ని ఆశించండి గొప్ప గొప్ప లక్ష్యల కోసం పనిచేయండి.. అంతఃకరణ శుద్ధిగా మీరు చేసిన ప్రయత్నం కచ్చితంగా ఫలిస్తుంది ఆ తర్వాత పరోపకారార్థమై ధర్మం కోసమై మీయొక్క శ్రేయస్సు కోసమే మీకు అందిన లాభ ఫలాలు ఉపయోగించండి "

అంటూ నేను హరసిద్ధుడికి చేసిన ఉపదేశాన్ని అక్కడి సభలో ఆంతరంగులకి చెబుతున్నాడు 

ఇవి చెప్పే మధ్యలోనే హారసిద్ధుడికి నేను కార్తికేయుడు తో చేస్తున్న లీలలు ఏవో కళ్ళముందు జరిగినట్టు
 గోచరిస్తున్నాయి ఇది నిజమా అబద్దమా తెలుసుకోలేకపోతున్నాడు .. కానీ అతను అంతరాత్మ మాత్రం ఇది నిజమనే తెలుస్తుంది .. ఎందుకంటే గతంలో అతను నా సహచర్యం పొంది ఉన్నాడు
 కదా..

హర సిద్దు మనసు లో 
" ఏమిటిది నా కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు ఈ కార్తికేయుడికి ఏంటి సుమీ త్రిమూర్తులు వచ్చారు.. ఈ గోచరిస్తున్న దృశ్యాలు నిజమా లేక నా బ్రహ్మ ఏమో నాకు ఏమీ అర్థం కావటం లేదు.. ఆరోగ్యకరమైన అసూయపడే సన్నివేశాలు అంటే ఇవే కదా కళాకారుల పట్ల ఆ శివయ్య పక్షపాతం చూపిస్తాడని తెలిసి కూడా .. ఒక రాజుగా చట్ట ప్రకారం కార్తికేయతో కఠిన వైఖరి అవలంబించా.. భగవంతుడికి నేనైనా కార్తికేయైనా ఒకటే.. నేను కూడా సాటి కళాకారుడి నీ ఏదో శిల్పాలు చెక్కే వాడిని మాత్రమే.. కానీ ఈ కార్తికేయుడు తన రచనలతో తనకున్న అమోఘ్త్ ప్రసాదిత మేధాశక్తితో భగవంతుడి పాత్రలతో ఉదాత్తమైన సన్నివేశాలు అల్లాడు.. అవి నన్నే ఎంతో ఆలతపరిచాయి సాక్షాత్ ఆ శివయ్య ఆరాధపరచవా ? అతగాడు సతీదేవి ఆత్మహత్య తర్వాత శివుని మానసిక స్థితి మీద రాసిన నాటకం విన్న తర్వాత నాకే కళ్ల వెంట నీళ్లు వచ్చినాయి.. ఆ సమయంలో ఆ శివడు ఎలా తట్టుకున్నాడో అని ఎంతో మధన పడ్డాను.. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రేమ కథ కదా "

నేను "అవును నిజమే నా మాట వినకుండా దక్షయజ్ఞముకు వెళ్లిన సతీ ఆత్మహత్య తర్వాత నేను పడ్డ మానసిక వేదన అంతా ఇంత కాదు.. సామాన్య మానవుని వలె నేను విలపించిన తీరు నన్నే కట్టిపడేసింది.. ఆ తర్వాత మీ సతిమాత నాకు కలలో కనపడి మహాదేవ మీలో ఇంత ప్రేమికుడు ఉన్నాడని నేను అనుకోలేదు మీ కోసం నేను మళ్లీ పుడతాను తపస్సు చేసుకుని మిమ్మల్ని చేరతాను దయచేసి మీరు మళ్లీ పూర్తిస్థాయి మహాదేవుడిగా మారిపోయి ఈ లోక సంరక్షణ కావించండి" అని వేడుకున్నట్ల రాశాడు. ప్రత్యక్షంగా సన్నివేశంలో ఉన్న నాకే ఇది జరిగి ఉంటే బాగుండు అని భ్రమ కల్పించాడు 
ఏమీ అద్భుతమైన ఆలోచన.. ఈ సంఘటన జరిగింది కోటప్పకొండ లో అని రాశాడు కాబట్టి కార్తికేయని నేను కోటప్పకొండ లోనే కలిశాను.. లీల కావించటం మొదలుపెట్టాను..

ఇక కార్తికేయుడు సంగతి చూద్దాం 

రాముల వారి ముందు కూర్చున్న ఆంజనేయ స్వామి లాగా .. తీవ్రమైన ధ్యాన స్థితిలో మమ్మల్ని చూస్తూ నిమగ్నం అయి పోయాడు..
.
విష్ణువు " బావ నీ గురించి సోదరి గురించి బాగానే రాశాడు .. నన్ను అయితే ఎప్పుడూ మా లక్ష్మక్క చేత కాళ్లు పట్టించుకుంటావు అట్లా అయితే ఎట్లా అయ్యా అని నిగదీశాడు సుమీ "

నేను " మా వాడికి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం తో బాగా పని ఉందిలే జరిగి తీరుతుంది లే అందుకే  వెనకేసుకొచ్చాడు "

కమల సంబ " తలరాత లో లక్ష్మీ కటాక్షం ఉన్నా లేకపోయినా ఇకమీద పూర్తిగా లక్ష్మీ సిద్ధిస్తుందిలే ఏటువంటి భయం అవసరం లేదు "

లక్ష్మీ దేవి " తప్పక మహాదేవ రోజు మీ దర్శనం చేసుకుని అతనికి మా మీద ఇలా సన్నివేశాలు స్తోత్రం వలే రాసిన అతనికి నేను కచ్చితంగా తక్షణమే కటాక్షం చూపిస్తాను నా  లక్ష్మి అంశల ను అతనికి ప్రసాదిస్తాను"

పార్వతి మాత" నేను కూడా శక్తిని ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తాను "

సరస్వతి " మీరు ఏమిచ్చినా నేను ప్రసాదించిన విద్య వల్ల మాత్రమే అది వస్తుంది .. విద్యని తెలివిని అన్నిటికి మించి అదృష్టాన్ని కూడా ఇతనికి నేను ప్రసాదిస్తాను " 

నేను " నువ్వు గొప్పవాడివయ్యా దర్శక రాజ.. పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళకి ఎన్నో కఠోర పరీక్షలు పెట్టి వరాలన్నీ ఇచ్చారు.. నువ్వు మాత్రం బ్రహ్మ దేవుడి ఇచ్చిన శక్తితో . మా అందరి మనసు కొల్లగొట్టావు... "

పార్వతి మాత" మహాదేవ మీరు ఇందాక అనుకున్నారు కదా .. మీరు సతిగా నన్ను కోల్పోయిన తర్వాత పడ్డ మానసిక ఆవేదనపుడు మీకు స్వప్నలో కనపడి నేను ఇట్లా విన్నవించుకున్నానని ఆ తర్వాత అతగాడు ఏమి రాశాడు "

నేను " మనిద్దరి ప్రేమ కథ. నేను పెళ్లికి సిద్ధమై మీ ఇంటికి వస్తున్నప్పుడు జరిగిన వినోద ఆహ్లాద సన్నివేశాలు.. అవన్నీ మళ్ళ మనం కైలాసం వెళ్లి చెప్పుకుందాము "

విష్ణు దేవుడు " చెల్లి బావగారు తమరు కాళీ రూపంలో గుండెల మీద కాలు వేసిన సంగతి కూడా కార్తికేయు డు చెప్పాడు మా ఆవిడా కి ఎంత ప్రేమ అంత కోపం కూడా అయ్యా అంటే కార్తికేయడం నీలాంటి వాళ్లకు ఆవిడే సరి గురువా అని చలోకి విసిరాడు "

బ్రహ్మదేవుడు " పితృ దేవా విష్ణువు ! నాకు మాత్రం బాల రాముడి కథ బాల ఆంజనేయుడు కథ అమితమైన ఆనందాన్ని కలిగించినవి.. నాకున్న అన్ని తలల ద్వారా అన్ని చెవుల ద్వారా ఆ కథని ఆస్వాదించాను .. సృష్టి చేసి చేసి చేస్తున్న నాకు ఈ కథ ఆటవిడిపోయింది ఆనందదాయకం అయింది"

నేను "సరే బాగు బాగు తదుపరి ఏమి చేద్దాం"

అందరూ "తమరి ప్రణాళికని అనుసరిద్దాం"

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages