సంసారంలో చిటపటలు
అద్దంకి లక్ష్మి, ముంబై
"అమ్మా,,,,!"
అంటూ వచ్చి తల్లిని వాటేసుకుని బోరు మంది శశి. సూటు కేసు పక్కన పడేసింది.
టీవీ సీరియల్ చూస్తున్న సుశీల కాస్త కంగారు పడింది .
"ఏమైందమ్మా? ఏమిటి సంగతి,," అని అడిగింది.
" అమ్మా ,,, నేను ఇంక శేఖర్ తో కాపురం చేయలేను.
నేకు విడాకులు తీసుకుంటాను. వచ్చేస్తా మన ఇంటికి "అంటూ ఒకటే ఏడుపు,,
" అదేంటే, శేఖర్ తో చదువుకుని, నాలుగేళ్లు బాగా తిరిగావు. అతనినే చేసుకుంటానని పట్టుబట్టి చేసుకున్నావ్. ఇప్పుడు నచ్చలేదు అంటావేంటి,,?" సుశీల ఆశ్చర్యపోతూ..
" ఏంటమ్మా శేఖరు ఏమి వినడు. అన్నీ తన ఇష్టం మంటాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు పెళ్లికి ముందు అంతా నీ ఇష్టం అంటూ బాగా ఉండేవాడు.ఇప్పుడో, నామీద ప్రేమ చూపిచ్చటం లేదు,
మాల్ కి వెళ్దాం రా అంటే రాడు. నువ్వు వెళ్ళు నేను ఆఫీసులో చాలా అలసిపోయాను అంటాడు. ఇంటికి కావలసిన వస్తువులు కొనడం లో గొడవ పెడతాడు. తనకిష్టమైన వే కొనాలి. కర్టెన్ కొందామని వెళితే అక్కడ గొడవ. ఈ బ్లూ వద్దు. నాకు ఇష్టమైన గ్రీన్ కొన మంటాడు .
ముందు అయితే హోటల్ కి వెళితే, నీకు ఏది ఇష్టమో చెప్పు అదే తిందామనే వాడు, ఇప్పుడు నాకు ఇష్టం అయిన ఐస్క్రీమ్ చెప్తే,, నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు.
కొత్త లో వంట ఇంటిలో కి వచ్చి నాకు సాయం చేసేవాడు .ఇప్పుడు నువ్వే చేసుకో అంటాడు.
ఇలా ఎన్నని చెప్పను ఏది వినడు. పెళ్లయిన తర్వాత బాగా మారిపోయాడు. నేను ఇంక శేఖర్ తో కాపురం చేయలేను అమ్మా,,,,"అంటూ బోరు మంది శశి.
సుశీల కూతురుని దగ్గర తీసుకుని చక్కగా సముదాయించింది.
" ఇదిగో శశీ! ఆడపిల్లలు పెళ్లి కాని ముందు హాయిగా తిని తిరుగుతారు. పుట్టింట్లో ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాడు.
పెళ్లయిన తర్వాత ఇప్పుడు నీకు ఇంటి బాధ్యతలు వస్తాయి . నీకు కావలసింది నువ్వు చేసుకుని అతని కావలసింది చేసి పెట్టాలి రేపు పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ అవసరాలు కూడా నువ్వు చక్కగా తీర్చాలి .ఇదీ కుటుంబ బాధ్యత. పెళ్లంటే స్త్రీగా అన్ని బాధ్యతలు నెరవేర్చాలి,, జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి .అన్నిటికీ తట్టుకుని నిలబడాలి
ఏడాదయ్యింది ,,అప్పుడే విడాకులు ఇస్తానని అంటున్నావు.
జీవితం ఒక బండి లాంటిది .రెండు చక్రాలు ఒక చక్రం తో సాగేది కాదు.
వేదమంత్రాలతో పెద్దల ఆశీర్వచనాలతో వివాహం మూడు ముళ్ళ
బంధం,, తల్లిదండ్రుల దగ్గర ముచ్చటగా పెరిగిన ఆడపిల్లలు పెద్ద ఉమ్మడి కుటుంబాలు నిస్వార్ధంగా బాధ్యతలను స్వీకరించేవారు
నాయనమ్మ అమ్మమ్మ జీవితాలు తెలుసు కదా
భర్త చెప్పిన మాటపై నిలబడే వారు
పక్క ఫ్లాట్లో ఆంటీ భర్త తాగి స్నేహితులతో పేకాట ఆడి అర్ధరాత్రి రెండింటికి వస్తాడు ఆమె పూజలూ పునస్కారాలు భర్తను వదిలేసిందా.
రెండవ అంతస్తులు ఆంటీకి పక్షవాతం ఆవిడకి సేవ చేసి మరి ఆఫీసుకి వెళ్తాడు
సునీత ఆంటీ భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది సంసారం ఆమె నడుపుతుంది
పెళ్లంటే విడదీయరాని బంధం,, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు పెద్దలు,,
చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ గొడవ పడకూడదు.
అతనికి ఇష్టమైనవి చేస్తూ నీకు ఇష్టమైనది కూడా చేసుకోవాలి.
కర్టెన్లు ఇద్దరుకి కావలసిన రంగులు కొనుక్కోవచ్చు. అతడికి వంకాయ కూర అయితే, నీకు బంగాళదుంప కూర,, ఇష్టమైతే రెండు చేసుకోవచ్చు కదా
ఆఫీసులో అలిసిపోతే మగాళ్ళకు రెస్ట్ తీసుకుందాం అని పిస్తుంది . ఎక్కడ తిరుగుతాడు.
అతడు కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా.
నువ్వు కూడా తక్కువేమీ కాదు చాలా తల తిక్కదానివి. అవన్నీ భరిస్తున్నాడు కదా పాపం,,,
పెళ్ళంటే ఏమన్నా మజాక్ అనుకున్నావా.
ఇష్టం లేదు వచ్చేస్తాను అనడానికి.
ఒకరి ఇష్టాయిష్టాలు రెండవవారు గౌరవించాలి భార్య భర్తల లో అప్పుడే సంసారాలు ఆనందంగా ఉంటాయి
అంటూ సుశీల ,శశికి నచ్చజెప్పిన ది.
సరేలే అమ్మ నువ్వు ఎప్పుడు శేఖర్ పార్టీ అంటూ పడకగదిలోకి వెళ్ళిపోయింది కోపంగా,
ఇంతలో శేఖరు వచ్చాడు హడావుడి పడుతూ,,శశి ఇక్కడికి వచ్చిందా నాకు ఫోన్ కూడా చేయలేదు ," అంటూ కంగారు పడ్డాడు,
"ఏం లేదు శేఖర్ నీ మీద అలిగి వచ్చింది లే ,,,అంటూ నవ్వింది సుశీల
"శశీ శేఖర్ వచ్చాడు రా , నీవు అలిగి వచ్చావు నీ మీద ఎంత ప్రేమతో వచ్చాడో చూడు, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు, సంసారంలో ఇటువంటి చిటపటలు ఉంటాయి, సరదాగా సాగిపోవాలి,"
"శేఖర్ ఎలాగా వచ్చావు కదా! భోజనం చేసి వెళ్ళండి"
"అవును శేఖర్ ఇక్కడ భోజనం చేసి వెళ్దాము సారీ నీతో చెప్పకుండా వచ్చాను" అందిశశి
సరే నీ ఇష్టం అన్నాడు శేఖర్
ఇద్దరూ భోజనం చేశారు తండ్రి ప్రభాకర్ వచ్చాక,
"అమ్మ వెళ్తాను అంటూ శేఖర్ తో వెళ్ళింది శశి.
ఆమె మనసులోని మబ్బులు వీడాయి
ఈ కాలం పిల్లల తీరు ఇంతే, మాట్లాడితే విడాకులు అంటారు, సంసారంలో అడ్జస్ట్మెంట్లు చేసుకో రు, విడాకులు తీసుకోగానే సరికాదు కదా ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి, ఇప్పుడు యువతరాని కేమీ తెలియటం లేదు, ,,,,అని నవ్వుకున్నారు ప్రభాకర్ సుశీల.
No comments:
Post a Comment