శ్రీథరమాధురి - 117 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 117

Share This

శ్రీథరమాధురి - 117 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు) 


దేవకృతి అహోబిలేశ్వరుడి యొక్క అంకిత భక్తురాలు. ఆమె అహోబిలం అడవుల్లో నివసించేది. స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు, ఆమె అడవి మార్గం గుండా దారి చూపుతూ సేవ చేసేది. ఆ రోజుల్లోనే అటవీ ప్రాంతం ఇప్పుడు మనం చూసే అడవి కంటే చాలా పెద్దది.


ఆమె వచ్చిన అతిధులతో పాటు అహోబిలం అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, అహోబిలం అడవులలో జరిగే అనేక అద్భుతాల గురించి వారికి చెబుతూ ఉండేది.

 

ఒక రోజున వృద్ధ దంపతులొకరు అడవిలో చిక్కుకుపోయి ఉండడాన్ని దేవకృతి చూసింది.

  

వారిలో పురుషుడు - ' మేము అహోబిలేశ్వరుడి సన్నిధికి చేరుకోలేక పోతున్నాము. మేము ఈ అడవిలోకి వచ్చి దాదాపు పది రోజులైంది. మాకు ఆలయానికి దారి చూపుతావా?'

 

దేవకృతి ఇలాఅంది - ' నా జీవితాశయం ఏమిటంటే, ఇక్కడకు వచ్చే వారికి అహోబిలం అడవుల గుండా దారి చూపి, వారికి అహోబిలేశ్వరుడి దర్శనం లభించేలా చేయడం. దయుంచి నాతో రండి.'

 

దేవకృతి - ' మీరిద్దరూ ఎక్కడ నుంచి వస్తున్నారు? ఈ అడవిలో ఎంత దూరం నడిచారు? నేను మీకు కొంత నీటిని, తినడానికి ఫలాలను సమర్పించవచ్చా?'

 

వారిలోని స్త్రీ - ' తప్పకుండా! మేము చాలా అలసిపోయి ఉన్నాము. మేము చాలా దూరం నడిచాము. మా గ్రామం చాలా దూరంలో ఉంది. మేము నీటిని, పళ్ళను స్వీకరిస్తాము.'

 

దేవ కృతి వారిని కూర్చోబెట్టి అడవిలోకి వెళ్ళింది. ఆమె కొన్ని ఫలాలను కోసి, భవనాశిని నుంచి కొంత నీటిని సేకరించింది. వాటిని ఆ వృద్ధ దంపతులకు ఇచ్చింది.

 

వారు ఆ పళ్ళను తిని, నీటిని తాగారు.

 

వృద్ధులు ఇలా అన్నాడు - 'మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాము. మాకు అహోబిలం గురించి ఏమైనా చెప్పు.'

 

దేవ కృతి ఆకులతో ఒకపక్కను చేసింది, తన చీరను విప్పి ఆ పక్క పై పరిచింది. ఆమె ఆకులతో ఒక విసనకర్రను తయారు చేసింది. నా దంపతులకు పాద సేవను చేసింది. వారికి విసనకర్రతో విసురుతూ, అహోబిలం అడవుల్లో జరిగే అద్భుతాల గురించి చెబుతూ, ఆమె కూడా నిద్రపోయింది.

 

మరుసటి రోజు ఉదయం ఆమె నిద్ర లేచినప్పుడు, ఆమె ఎగువ అహోబిలంలోని అహోబిలేశ్వరుని యొక్క గుహలో తానుండటం చూసింది.


అహోబిలేశ్వరుడు, అమ్మవారైన చెంచులక్ష్మి, ఆ వృద్ధ దంపతుల రూపంలో వచ్చి తనను అనుగ్రహించారని ఆమె అర్ధం చేసుకుంది.


దైవం ఇలా అన్నారు, 'దేవకృతి! నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను. నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను. నువ్వు ఏది అడిగినా తీరుస్తాను.'


చెంచులక్ష్మి అమ్మవారి కూడా ఆమె ముందు ప్రత్యక్షమై ఇలా అంది, ' అహోబిలేశ్వరుడు కరుణామూర్తి. వైకుంఠంలో శాశ్వత నివాసంతో సహా నీవు ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తారు.'


దేవ కృతి ఇలా అంది, 'నాకు ఒక్క కోరిక మాత్రమే ఉంది. నాకు ఈ అహోబిలం అడవుల్లోనే నివసించాలని ఉంది. ఈ అహోబిలం అడవుల్లో దర్శనానికి వచ్చే వారందరికీ నేను దారి చూపగలగాలి. ఓ దైవమా! దయుంచి ఈ వరాన్ని అనుగ్రహించండి.'


దైవం ఆమెను ఒక యక్షిణిగా మార్చి, ఇలా అన్నారు, ' దేవకృతీ!  యక్షరాజు రాజరాజన్, ఇతర యక్షులు, యక్షిణులతో సహా, నీవు ఈ అడవిలో నివసిస్తూ, కలియుగాంతం వరకు నాకు సేవ చేస్తూ ఉంటావు. ఆ తరువాత నీవు నా ధామమైన వైకుంఠానికి చేరుకుంటావు.


ఈనాటికీ దేవ కృతి అహోబిలం అడవులలో నివసిస్తూ, అహోబిలం లో ఉన్న నవ నారసింహ స్వాములను దర్శించాలనుకునే వారికి దారి చూపుతూ ఉంటుంది.

 

యాత్రికులని బట్టి, పరిస్థితులను బట్టి ఆమె అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది.

 

జైబోలో అహోబిలేశ్వర భగవాన్ కీ జై!

 

జై బోలో అమ్మవారు చెంచులక్ష్మి కీ జై!


***

No comments:

Post a Comment

Pages