శివం - 108 - అచ్చంగా తెలుగు

శివం - 108 

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్  


దర్శకుని కధ 16

(కార్తికేయనీ తో వెళ్తూ ఉండగా మార్గమధ్యలో తను రచించిన బాల హనుమ కథ చెబుతూ అందులో అర్ధరాత్రి నేను అంతపురంలోకి ఆంజనేయుడు ముందు ప్రత్యక్షం అవ్వగానే ఆంజనేయుడు నాతో సరదాగా మాట్లాడి నా కోసం వివిధ రకాలైన పండ్ల చెట్టులో నుంచి పండ్లు తీసుకువచ్చాడు ) 


నేను అనగా శివుడు..


నేను " ఆంజనేయుడు ఏం చేశాడు చెప్పవయ్యా"

కార్తికేయుడు " చెబుతున్నా కదా రాజా ఉండు గురువా .. ఒకటే హడావిడి.. ఇంతవరకు నువ్వు చెప్పిన గమ్యస్థానం రాలేదు కానీ నన్ను మాత్రం నిద్ర కూడా పోనీకుండా కథ చెప్పు కథ చెప్పు అని దబాయిస్తున్నావ్ గురువా.. ఎవరైనా నిద్రపోవటానికి కథలు చెప్తారు .. నాకు మాత్రం నిద్ర రాకుండా చేయడానికి కథలు చెప్పిస్తున్న వు.."

నేను "ఏమయ్యా కాసేపట్లో మా ఇల్లు వస్తుంది చక్కగా వేనిటి స్నానం చేసి.. మా ఆవిడ పెట్టే భోజనం షుఫ్టుగా తిని ప్రశాంతం నిద్రపోవయ్యా.."

కా " అలాగే చేద్దాం సరే ఆ తర్వాత కదా ఏమైంది అంటే"


 కథలో నేను పండ్లు తీసుకొని ఆంజనేయుని వచ్చి నా ఒడిలో కూర్చోమని అడిగాను.. ఆ తర్వాత

హనుమ " అలాగే వస్తాను శివయ్య.. ఎప్పుడు మా అమ్మ నాన్న వో ళ్ళో కూర్చొని తింటాను.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పిత వైన నీ ఒళ్ళో కూర్చోవాలంటే నాది ఒక షరతు ఉంది "

శివుడు " హనుమ నీ అల్లరికి అడ్డు అదుపు లేకుండా పోయింది.. నువ్వు శ్రేష్టమైన వానర జాతి చిరంజీవి అయి కూడా చిన్న కోతి పిల్లలాగా తెగ మారం చేస్తున్నావు "

హ " మారామంటూ ఏమీ లేదు శివయ్య నేను చెప్పింది నువ్వు చేయవలసింది" అంటూ బుంగమూతి వేసుకొని అటు తిరిగి అడిగాడు బాల హనుమ

శివుడు " సరే చెప్పు హనుమ నీకేం కావాలో "

హనుమ "ఐ బలే బలే మా నాన్నగారి కన్నా కూడా నువ్వు తొందరగా నా దారిలోకి వచ్చావు.."

శివుడు " చెప్పు హనుమ ఏమి కావాలి"

హ " మరి నువ్వైతే వచ్చావు కదా నాకు అమ్మని కూడా చూడాలని ఉంది పార్వతీ మాత ని కూడా ఇక్కడికి పిలిచావంటే మీ ఇద్దరి ఒడిలో కూర్చొని ఆ పండ్లు తింటాను "

శివుడు " దానికి నేను పిలవటవెందుకు నువ్వే పిలువు మీ అమ్మ వచ్చేస్తుంది వెంటనే.. నువ్వంటే మీ అమ్మకి బలే ఇష్టం బాల హనుమాన్ నువ్వు చేసే అల్లరి చూస్తూ సరదాగా నవ్వుకుంటుంది.. చిన్నప్పుడు కార్తికేయుడు వేరొక చోట పెరిగాడు కదా కార్తికేయని అల్లరి చూడటం కుదరలేదు కదా ఇప్పుడు ఆ అల్లరి నీలో చూసుకొని ఆనందపడుతుంది గణపతి ఎట్లానో కార్తికేయుడు ఎట్లానో మాకు నీవు కూడా అలాగే ఎందుకంటే నువ్వు నా అంశ కదా!" 

హ "అలా అయితే సంతోషం అయితే నీ అమ్మని పిలుస్తా జగన్మాత మా శివయ్య దగ్గరికి వచ్చామంటే నేను తెచ్చిన పండ్లని ముగ్గురు కలిసి తిందాం తొందరగా రావా" అని నమస్కారం చేశాడు.

ఉన్నపలంగా అక్కడ పార్వతీ మాత ప్రత్యక్షమైంది.. బాల హనుమంతుడు ఆమె దగ్గరికి పరుగు పరుగున లంఘించి  కుంటూ వెళ్లి ఆమె కొంగు పట్టుకొని అమ్మొచ్చింది అమ్మొచ్చింది అమ్మొచ్చింది అంటూ సరదాగా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు ప్రదక్షిణాలు చేసినట్టు..

పార్వతీ మాత "నాకు నీ మీద కోపంగా ఉంది హనుమా" లాలనగా

ఈ కథ వింటున్న త్రిమాతలు ఆ కోపం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు..

హ "నా మీద కోపమా నేనొక చిన్న బాలుడను నువ్వు కోపగించుటకు నేను ఏమి చేశాను జగన్మాత.. ఎక్కడైనా అమ్మ తన బిడ్డను కోపగించుకుంటుందా అంటూ అలిగి అటు బుంగమూతి పెట్టుకున్నాడు."


ఈ కథ వింటున్న హనుమకి కళ్ల వెంట నీళ్లతో ఆనందభాష్పాలు వస్తున్నాయి నిజంగా ఇదేది జరగకపోయినా జరిగినట్టు కార్తికేయుడు కల్పన విని.. కీర్తన విన్న దాని కన్నా కూడా ఎక్కువగా ఆనందపడుతున్నాము మేమందరము.. ఇక కథలోకి వెళ్తే...

పార్వతీ మాత "మరి సూర్యుడి దగ్గరికి అయితే వెళ్లావు ఎన్నో సాహసాలు చేశావు.. ఒకసారి కైలాసం వచ్చి నా దగ్గర ఉందామని అనిపించలేదా .."


హనుమ" ఓహో ఆ కోపమా! అదేమీ లేదమ్మా సూర్యుడైతే కళ్ళకి కనపడుతున్నాడు కదా పండు అనుకోని వెళ్ళాను కానీ కైలాసం కళ్ళకి కనపడట్లేదు కదా మా అమ్మ పూజా మందిరంలో మీరు శివయ్య .. ఎప్పుడూ ఉంటారు కదా అదే కైలాసం మీరున్నచోటే కైలాసం ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా అందుకని ఇదే కైలాసం అనే ఉద్దేశంలో ఉన్నానమ్మా నేను , అయినా మా పూజా మందిరంలో ఎప్పుడు మీరు ఉంటారుగా అప్పుడు మీకు నేను దూరంగా ఎలా ఉంటాను మీరు నా దగ్గరే ఉంటారు కదా" అని ముద్దు ముద్దుగా చెప్పాడు.

పార్వతీ మాత "అల్లరి వాడివే కాదు గడసరివాడివే రాయబారి లాగా చక్కటి సమాధానం చెప్పావు " హనుమా అంటూ హనుమంతుడిని ఎత్తుకొని పార్వతీ మాత చిన్నపిల్లాడిని ముద్దాడినట్టు ముద్దాడింది.. బాల హనుమంతుడు కూడా తన బుగ్గలు చూపిస్తూ ఇక్కడ పెట్టమ్మా ఇక్కడ పెట్టమ్మా ముద్దు అంటూ పార్వతీ మాత వాత్సల్యాన్ని చొరగొన్నాడు..


ఈ కథ వింటున్న పార్వతీ మాత ఆనందభాష్పాలతో తన కళ్ళుని తుడుచుకుంటుంది..

పార్వతీ మాత "హనుమ నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరకు రా అని సంకల్పించింది."

లక్ష్మి మాత "హనుమ నాకు కూడా నిన్ను చూడాలని ఉంది తొందరగా రా!"


సరస్వతి మాత "హనుమ!"

సంకల్పం చేత తెలుసుకున్న హనుమయ్య హిమాలయాల్లో ఉండగా ఉన్నపలంగా ముగ్గురు మాటలు పిలిచేసరికి ఒక్క ఉదుటన గాలిలో బయలుదేరాడు..
హనుమంతుడి రాకను చూసినా సూర్యుడు ఆకాశం పక్షులు కిన్నెరలు దేవతలు అందరూ ఆనంద పడసాగారు.. తనని ఆశీర్వదిస్తున్న సూర్యుని చూస్తూ నమస్కారం చేసుకుంటుండగా మేఘ లడ్డు రావడంతో తన తోకతో ఒక్కసారి మేఘాలని విచ్ఛిన్నం చేశాడు సూర్యదేవుడికి నమస్కారం చేసుకున్నాడు..


ఒక్క ఉదుటన గాలితోపాటు గిరాగిరా తిరుగుతూ ముగ్గురు మాతల ముందు మోకరిల్లి నమస్కారం చేశాడు హనుమ..

పార్వతీ మాత హనుమంతుడిని దగ్గరికి పిలిచి హనుమంతుడి తల మీద చేతులు వేస్తూ నిన్ను చూడాలనిపించింది హనుమా అంటూ ఎదిగిన కొడుకుని చూసిన తల్లి వలె .. హనుమంతుని మోమని చూస్తూ చేతులతో స్పర్శిస్తూ నాయనా అంటూ కళ్ళతో తన అభిమానాన్ని చూపించింది

అలాగే లక్ష్మీదేవి కూడా తన చేతులని హనుమంతుడి తల మీద వేయగానే అమ్మ సీతమ్మ బాగున్నావా నువ్వు అంటూ హనుమంతుడు ఒక్కసారిగా త్రేతాయుగం నాటి క్షణాలకు వెళ్లిపోయి సీతమ్మ దర్శనం చేసుకున్నాడు.. అలాగే సరస్వతి దేవి కూడా

హ "ఈ కార్తికేయని రచన వల్ల నాకు మిమ్మల్ని ప్రత్యక్షంగా మరోసారి దర్శించుకునే అవకాశం కలిగినది జగన్మతల్లారా.. మీ అందరికీ నా జయము"

ఇక కథలోకి వెళ్తే

హనుమ" అమ్మ్మా..." అంటూ సాగదీశాడు

పార్వతీ మాత " ఏమిటి హనుమా"

హనుమ "అమ్మ నీకోసం నేను కైలాసం వస్తే ఇక్కడ మా అమ్మ దిగులు పడుతుంది కదా నీకు అది తట్ట లేదా? "

పార్వతీ మాత మాత్రం ఈ అగ్గిపిడుగు ఎంత పెద్ద ప్రశ్న వేశాడు..అనుకుంది.


నేను "ఏమిటి ఆ ప్రశ్న కార్తికేయ" ఉత్సాహంతో.

కార్తికేయ "చెబుతున్న గురువా ! వినుకో!"

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages