ఉద్యోగాలు గ్రహాలు - అచ్చంగా తెలుగు

ఉద్యోగాలు గ్రహాలు

పి.ఎస్.వి.రవి కుమార్ 



కుజుడు

కుజ గ్రహం ఆవేశ తత్వం తో ఉన్నటువంటి గ్రహం. కుజుడు రాణిస్తే ఉద్యోగం లో ఉన్నత స్థాయి లో ఉంటారు.

 

కుజ గ్రహం కి మేష రాశీ, వృశ్చిక రాశి స్వక్షేత్రాలు కాగా, మకర రాశి ఉచ్చ క్షేత్రం, కర్కాటక రాశీ నీచ క్షేత్రం అవుతుంది.

 

కుజ గ్రహానికి రవి, చంద్ర, గురు గ్రహాలు మిత్రులు, బుధ గ్రహం శత్రువు, శని శుక్రులు సములు.

 

కుజ గ్రహం వలన పదునయినా అయుధములు, పనిముట్లు సంబందిత వృత్తులు చేపడతారు.

 

కుజ గ్రహం వలన పోలీస్, మిలిటరీ, సర్జన్లు, సివిల్ ఇంజనీర్లు వంటి వృత్తులు చేపడతారు.

 

కుజుడు భూమి పుత్రుడు అందువలన కుజుడూ యోగిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు లేదా, భూములు కొనుగోలు చేస్తారు.

 

కుజుడు కనుక ఉచ్చ క్షేత్రం లో ఉండి లేదా కుజుడీకి నీచ భంగ రాజయోగం ఏర్పడి అవి దశమ స్తానం కానీ, షష్ట స్థానం కానీ అయ్యి ఉంటే ఐపీఎస్ ర్యాంక్ హోదా కలిగిన ఆఫీసర్లూ గా కానీ, లేదా పోలీస్, మిలిటరీ లో గెజెటడ్ స్థాయి వృత్తులలో కానీ ఉంటారు.

 

కుజుడు దశమ లేదా షష్ట స్థానాలలో ఉండి అవి స్వక్షేత్రాలు లేదా మిత్ర క్షేత్రాలు అయితే వీరు పోలీస్ వృత్తులలో కానీ, సాఫ్ట్వేర్ రంగం లో నెట్వర్కింగ్ లేదా క్రిప్టోగ్రఫీ రంగం లో కానీ వృత్తి చేపట్టే అవకాశం కలదు. 

 

కుజుడు కనుక స్వక్షేత్రాలలో ఉండి అది అష్ట, వ్యయస్థానాలలో ఉండి, దశమ, షష్ట స్థానలతో కనుక సంబందం ఏర్పడితే సర్జన్లు గా కానీ, ల్యాబ్ టెక్నీషియన్ వృత్తులలో కానీ ఉంటారు.

 

కుజుడు  చతుర్దం లో ఉండి అది స్వక్షేత్రం, ఉచ్చ క్షేత్రం అయ్యి సప్తమ లేదా ద్వితీయ లేద్డా తృతీయ స్థానానికి సంబందం ఏర్పడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం లో రాణీంచి ధన సంపాదన చేస్తారు.

 

కుజుడు కనుక పంచం లో ఉండి ఉచ్చ క్షేత్రం అయ్యి లేదా నీచభంగ రాజయోగం ఏర్పడి దశమ, ద్వితీయ స్థానాలకు సంబందం ఏర్పడీతే క్రీడాకారులు అవుతారు.

 

కుజుడు కనుక లాభస్థానం లో ఉండి లేదా లాభ స్థానం లేదా ద్వితీయ స్థానాలకు సంబంధం ఏర్పడితే ధన లాభాలు అనగా షేర్ మార్కెట్ ద్వారా ధన సంపాదన కలుగుతుంది.

 

జ్యోతిష్యం కోసం నన్ను కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9113048787

 

 ***

No comments:

Post a Comment

Pages