శ్రీథర మాధురి - 114 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 114

Share This

శ్రీథర మాధురి - 114

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)


ఎవరో ఇలా అన్నారు, 'ఎవరైనా నాకు ఒక ఆలయాన్ని గురించి చెప్పినప్పుడు, నేను అక్కడికి వెళ్ళలేక పోయినప్పుడు చాలా బాధ పడతాను.'

 
అవును, అది అతని సెంటిమెంట్.

మరొకరు ఎవరైనా' నేను జురాసిక్ పార్క్ - ద ఫాలెన్ కింగ్‌డమ్ చూశాను', అని చెప్పినప్పుడు అది విని, తాను ఆ సినిమా చూడలేక పోయానని బాధపడవచ్చు.
 
మరొకరు ఇలా అనవచ్చు, ' నేను కామాఖ్య లో జూన్ 22 నుంచి 25 వరకు అంబుబాచి మేళా కు వెళ్ళొచ్చాను.' ఇలా చెప్పగానే వింటున్న వారు తమకు ఎటువంటి అవకాశం కలగలేదు అని సెంటిమెంట్ గా ఫీల్ అవచ్చు.
 
దీనంతటికీ అంతం ఎక్కడుంది? సెంటిమెంట్స్ అనేవి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఎవరికి ఎటువంటి సెంటిమెంట్ ఉందో మనకు ఎలా తెలుస్తుంది?
 
కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే సెంటిమెంటల్గా ఉండటాన్ని వదిలి వేయండి. ఎవరైనా 'మేము అమెరికాలో ఉంటాము' అని చెప్పినప్పుడు వారి మాటల్లో పడిపోయే బదులు, మీరు పవిత్రమైన భారత భూమిలో ఉంటారని మీ మనసుకు తట్టాలి. ఇతరులకు లేని ఎన్నో అంశాలతో దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించారు. జీవితంలో అందరికీ అన్నీ దక్కవు అనుకోండి.
 
కాబట్టి సానుకూలంగా ఆలోచించండి. ప్రతికూలతను దైవం యొక్క అనుగ్రహంతో పారద్రోలండి.

***
శాస్త్రాలలో ఏమి చేయవచ్చో ముందుగానే నిర్ణయించి చెప్పబడింది, అలాగే నిషేధించవలసిన అంశాలు కూడా తెలుపబడ్డాయి. కర్తృత్వ స్వభావం ఉన్న వారి కోసమే, ఈ చేయవలసిన, చేయకూడని అంశాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయని నా భావన. కర్తృత్వం వల్లనే ఈ ప్రపంచంలో ఎంతోమంది వేదనకు గురి అవుతూ ఉంటారు. అటువంటివారు నిశ్చయంగా శాస్త్రాలలో చెప్పిన అంశాలను పాటించి తీరాలి లేకపోతే, అది పాపాలను కొనితెస్తుంది.
 
నా మటుకు నేను కర్తృత్వ స్వభావం వల్ల కలత చెందను కాబట్టి, నేను శాస్త్రాలను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. నేను హృదయానికి సంబంధించిన వ్యక్తిని, నేను ప్రతిదీ దైవానికి ఆపాదిస్తాను. దైవం యొక్క మార్గాలు గుహ్యమైనవి, తెలుసుకోజాలనివి.‌ నేను ప్రేమించినా లేక గద్దించినా అక్కడ చేసేది నేను కాదు. నేను ఒక వ్యక్తిని కాదు, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, స్వేచ్ఛా సంకల్పం, లేక ప్రతిష్ట లేవు.‌ అందుకే నేను ఒక ఎండుటాకులాగా గాలిలో తేలుతూ ఉంటాను. దైవం యొక్క సంకల్పం ఆ క్షణంలో నేను ఎక్కడికి అయితే వెళ్ళాల్సి ఉందో, నన్ను అక్కడికి తీసుకు వెళుతుంది.
 
అటువంటప్పుడు నేను శాస్త్రాలను పాటించినా, పాటించకపోయినా కూడా పెద్దగా తేడా ఏముండదు. 

***

No comments:

Post a Comment

Pages