ఇదొకమాయ!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

చేసే వరకు
ఏది న్యాయమో,ఏది అన్యాయమో
తెలియటం లేదు.
ఎదురయ్యే వరకు
ఏది శాపమో,ఏది వరమో
తెలియటంలేదు.
అనుభవించేవరకు
ఏది సుఖమో,ఏది దు;ఖమో
తెలియటం లేదు. 
విడిచిపెట్టే వరకు
ఏది లాభమో,ఏది నష్టమో 
తెలియటం లేదు.
కళ్ళు తెరిచేవరకు 
ఏది కలో,ఏది నిజమో
తెలియటం లేదు.
జన్మలెన్ని గడచినా
ఏది హితమో,ఏదహితమో తెలియటంలేదు
ఇదంతా అజ్ఞానం మహిమ అని తెలిసినా,
విషయాలపై మొహం తొలగటం లేదు,
విజయాలపై దాహం తీరటంలేదు. 
ఆలోచనలో మార్పు రావటంలేదు,
ఆలోకనలో మాయ వదలటం లేదు.
***
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment