'బంగరు కొండను నేను' - అచ్చంగా తెలుగు

'బంగరు కొండను నేను'

Share This

 'బంగరు కొండను నేను'

-సుజాత.పి.వి.ఎల్.

సైనిక్ పురి, సికిందరాబాద్.


అచ్చులు జతచేసి

అక్షరబాణి కూర్చాను

వర్ణమాల పాటకట్టి

మధురంగా పాడాను

మెచ్చుకొని పంతులుగారు

పలక బహుమతిచ్చారు

పదిలంగా పట్టుకొచ్చి

అమ్మకి చూపెట్టాను

మురిసిపోయి అమ్మనాకు

అరిసె ఒకటి ఇచ్చింది

అది తింటూ గెంతులేస్తూ

తాత దగ్గరికెళ్ళాను

ఒంకెనున్న అంగి తీసి

ఆరు నాణేలిచ్చాడు

నాన్న చేతిలో పెట్టి

                        ఇవి ఎంతని అడిగాను                       

అరచేయి వేళ్ళుతెరచి

ఒకటి రెండ్లు నేర్పాడు

గుక్కపట్టకుండా నేను

పది అంకెలు చెప్పాను

ఏకసంధాగ్రాహివంటూ

ఎత్తుకొని ముద్దాడాడు

మురిపెంగా తలనిమిరి

బంగరుకొండవన్నాడు

ఆనక నే బువ్వతిని

ఆడుకొనుటకెళ్ళాను

అలసిపోయి ఇంటికొచ్చి

గుమ్మ పాలు తాగాను

అవ్వచెప్పిన కథవింటూ

కమ్మగ నిదరోయాను.

***


No comments:

Post a Comment

Pages