సం(Some)హితోక్తులు - అచ్చంగా తెలుగు

 సం(Some)హితోక్తులు

శెట్టిపల్లి అరుణా ప్రభాకర్


అవసరం అడగకున్నా

పరుగెత్తుకుని వస్తుంది,

అవకాశం మాత్రం పిలిచినా రాదు.

*

అదృష్టం కాలింగ్ బెల్ కొట్టదు,

ప్రయత్నం వెనకాల దాక్కుని నిన్ను గమనిస్తూ ఉంటుంది.

*

ఆశయాల విత్తనాలు వాటంతట అవే మొలకెత్తవు.

*

అపజయాల దృష్టి లోపానికి ఆశల కళ్ల జోడు తగిలించెయ్!

          *

ఒక మెత్తని ఆప్యాయమైన స్పర్శ

కఠిన శిలయై నిరాశా నిస్పృహల్ని ఫెళ్లున బద్దలు కొట్టగలదు.

          *

శిఖరాలను కూల్చే భూకంపాలు ఉన్నాయి గానీ

గడ్డి పోచను పేకల్చే తుఫానులు లేవు.

          *

ధైర్యం మూలన పడేసిన నిచ్చెన లాంటిది,

కాస్త ఓపిక ఉంటే తెచ్చిపెట్టుకుని అటక మీంచి

విజయాన్ని దించుకోవచ్చు.

          *

నువ్వు పుట్టగానే కాలం ఒక కొవ్వొత్తిని వెలిగించి ఇస్తుంది.

          *

అబద్ధాన్ని వెలిగించడానికి అణుబాంబులు కావాలి,

నిజాన్ని వెలిగించడానికి ఒక అగ్గి పుల్ల చాలు.

 *

పోగొట్టుకున్న చోటే వెతుక్కొనక్కర్లేనివి కొన్ని ఉంటాయి

అందులో ముఖ్యమైనది ప్రేమ.

 *****

No comments:

Post a Comment

Pages