శివం - 94 - అచ్చంగా తెలుగు

శివం - 94

రాజ కార్తీక్ 
( కార్తికేయుని కథ మొదలైంది కార్తికేయుడు కోటప్పకొండ కి రావటం అక్కడ జరిగిన చిన్న అప సృతి సరి చేయటం, నృత్యంచేయటం) 


అక్కడ జనులు కొంతమంది ఆడుతున్నారు కోలాటం.. కొంతమందికి నన్ను చూడాలని ఆరాటం..

అందరూ బిగ్గరగా చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అని నా నామస్మరణ కొండల్లో ప్రతిధ్వనించే విధంగా గట్టిగా శరణు చేస్తున్నారు..

గర్భగుడిలో నుంచి.. వస్తున్న నేను.. కొండ నుంచి కిందకి నా భక్తుల జనసందోహాన్ని చూస్తూ పండగ వాతావరణం అని నేను కూడా ఆనందంగా అనుభవిస్తూ నా భక్తుల ఆనందాన్ని ఆనందంగా భావిస్తూ మెట్లు నుంచి కిందకి నడవడం మొదలుపెట్టాను

చెప్పాను కదా కోటి ప్రభలు వచ్చినంత ఆనందం ఒక కార్తికేయుడు వస్తేనే కలిగింది ఎందుకో అర్థమవుతుంది లే ఉండండి

నేను కిందకి దిగుతూ ఉండగా కొండపైకి ఎక్కుతున్న నిజమైన భక్తుల్లో.. చాలామందికి నేను నేను దర్శనం ఇచ్చాను.. మాయ చేత వారందరూ నా నామస్మరణ చేస్తూ వారి మనసులో మాత్రం ఇతగాడి ఎవరో శివుడు వేషానికి సరిగ్గా సరిపోయాడు అంటూ నా వైపు చూసి చిద్విలాసంగా నవ్వారు నేను కూడా నవ్వాను ఎందుకంటే వారు వస్తుంది నాకోసం వారి నామస్మరణ నాకోసం వారి గమ్యం నాకోసం భక్తులారా గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను నమ్మిన వారిని కనిపెట్టుకొని ఉంటా.. బంధాలు విడిచి పోతాయి బంధుత్వాలు కరిగిపోతాయి కాలం కరిగిపోతుంది.. కానీ మీరు చేసిన ధర్మము మరియు చూపిన భక్తి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది..

కొండ కింద ఉన్న ఉత్సవాల్లో పాల్గొంటున్న.. కార్తికేయుడు.. అక్కడ ఉన్న కళాకారుల ప్రభల విశేషాలు అడిగి తెలుసుకుని.. ఆ ఉత్సవాల్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనసులోని కళా ఆనందాన్ని అనుభవిస్తూ ఇక నా దర్శనం చేసుకుందామని బయలుదేరాడు..

కార్తికేయుడు మనసులో
."ఆహా ఎన్నో నాటకాలు రచించి దర్శకత్వం వహించాను.. ఇకమీద ఒక గొప్ప కావ్యాన్ని రచించి ఒక పెద్ద నాటకాన్ని ప్రదర్శించి కళామతల్లికి నటరాజుకి ఎనలేని సేవ చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలి.. నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అయ్యి ఈ ప్రపంచానికి కళా విజ్ఞానాన్ని అందించాలి.. కళ యందు ఒక మనిషి ఎందుకు అంత పిపాసి అవుతాడు కళ యొక్క గొప్పతనం ఏమిటి? కళ వల్ల దేవున్ని ఎలా మెప్పించవచ్చు..  కళ వల్ల మనిషి ఎలా తరించవచ్చు.. అటువంటి అత్యున్నత మానసిక శాస్త్రాన్ని ప్రపంచంలో నలు  దిక్కుల వ్యాపింప చేసి
ఈ జన్మని ధన్యం చేసుకోవాలి"

మెట్లు దిగుతూనే తధాస్తు అని నేను అన్నాను

భక్తులారా తపస్సు చేసిన వారిని ఎలా పరిగణిస్తానో.. కళా సేవ చేసే వారిని అలానే పరిగణిస్తాను..
ఎంతోమంది ఎన్నో వేల ఏళ్ల లగా తపస్సు చేసిన లభ్యం కానీ భగవంతుని సాక్షాత్కారం కళాకారులకి ఎందుకు అంత త్వరగా లభించింది అంటే.. భగవంతునికి కళ. యందు ఉన్న అనురక్తి.. నేను ప్రారంభించిన సృష్టి ఓంకారం సంగీత స్వరూపం.. డమరుకనాదం సంగీత స్వరూపం అవి అన్ని కళారూపాలే .. కళా చేతన భావాలే.. కార్తికేయడు.. ఎన్నో నాటకాలని రచించి వాటికి దర్శకత్వం వహించి ఎన్నో వేల మంది మనుషుల్ని. రంజింప చేశాడు.. మూర్ఖుడైన పామరుడైన అతని కళలో లీనమై బ్రహ్మానందాన్ని అనుభవించారు.. ఇప్పుడు ఆ వేలు లక్షలు అవ్వాలి  ఆ లక్షలు కోట్లు అవ్వాలి.. కార్తికేయుడు నామీద విష్ణువు మీద కల్పిత పాత్రల్లో రాసిన నాటకాలు మాకు కూడా ఎంతో బాగా నచ్చాయి తన మనస్సుకి స్ఫురించిన ఆలోచనలని భక్తితో చతురతతో రంగరించి తను చేసిన ఆ నాటకములు కైలాసం నుంచి వైకుంఠం నుంచి వీక్షించి మేము కూడా ఎంతో ఆనందం అనుభవించాం..
ఒకరేమిటి కార్తికేయుడు రచించిన ప్రతి నాటకంలో ఏయే దేవతా పాత్రను తీసుకుంటారో వారందరూ కూడా ఎంతో గాను ఆనందపడి మెచ్చుకున్నారు..
మీ మాత పార్వతి దేవి అయితే మా వివాహ ఘట్టాన్ని అతను రాసిన విధానం చూసి.. "మన వివాహం జరిగిన దానికన్నా ఇతను రాసిన విధానమే బాగుంది స్వామి" అని నాతో చలో క్తి విసిరింది.. 
ఇక నంది అయితే అతగాడు చేసిన ఒక నాటకాన్ని చూసి "ప్రభు ఇతడు అతడు రాసిన నాటకంలో ఒక సన్నివేశానికి మీరు నా మీద కూర్చొని రాకపోతే ఎలా ప్రభువని మీతోనే నేను గొడవ పెట్టుకున్నట్టు రాశాడే ఆహా ఏమి భావన చేశాడు ప్రభు"..
 విష్ణువు అయితే" మహాదేవ మీ కళ్యాణం కి నేను మిమ్మల్ని అలంకరించినట్టు.. రాశాడు ఎంత అమోఘం" అని మెచ్చుకున్నాడు.. 
లక్ష్మీదేవి ఏమన్నా తక్కువ తిందా.". ఎప్పుడు మీ పాదములు ఒత్తుతూఉంటాను కదా అని.. నేను మీ పాద దాసిని కాదు మీ హృదయ వాసిని" అని రాసింది చూసి ఎంతో గానో మురిసిపోయింది...

 మీతో కాబట్టి చెప్తున్నాను మన కైలాసం లో కూడా నేను అనలేదు.."గరళం తాగటం ఎందుకు గొంతులో పెట్టుకోవటం ఎందుకు నాయనా ఆ విషయాన్ని ఏదో ఒక అంతరిక్ష పదార్థం లోకి పంపించి రాకుండా చేయవచ్చు కదా అని నా పని తన మీద నాకే అప నమ్మకం వచ్చే విధంగా చేశాడు..
ఆంజనేయుడు సైతం తపస్సు విరమించుకొని మరి"మహాదేవ ఏమి ఇతగాడి రచనా విక్షణం... నేను రాముల వారి మీద అలిగి ఆయన దగ్గరికి నేను వెళ్లకపోతే రాములవారు నా దగ్గరికి వచ్చి నన్ను చిన్న పిల్లవాడిగా లాలించి ఆంజనేయ నా దగ్గరికి నువ్వు వస్తావా రావా అని నన్ను ఆయన లాలించిన విధంగా ఒక సన్నివేశం రాశాడు ప్రభు ఆహా కలగదుట రాముడు కళ్ళ ఎదుట ఆ కాలము మరొకసారి నాకు కనపడింది ప్రభు తపస్సు చేసుకునే నాకు కూడా వాని తలంపు వల్ల
 భగ్నం కలిగింది..".. 

కుమారు సుబ్రహ్మణ్యడు అయితే చెప్పే పనేలేదు తను చేసిన యుద్ధాల్లో తన శు లాన్ని ఎలా ఇలా ఆయుధంగా వాడాడో రాసిన విధానం చూసి "కొత్త మెలుకువలు నేర్చుకోవాలని "చలో క్తీ విసిరాడు..

 బ్రింగి సైతం గణాలకి" తనకి నా కోసం జరిగిన గొడవని అతగాడు రచించిన విధానాన్ని ఎంతో మెచ్చుకున్నాడు.. మరి మీ అందరి వినాయకుడు.. తన చిట్టెలుకని పెద్దదిగా చేసి పాల్గొన్న యుద్ధాన్ని అతగాడు చేసిన  విధానాన్ని .. ఎంతో మెచ్చుకొని తొండమెత్తి మరి ఆశీర్వదించాడు..

నాకు మటుకు ఇతగాడి నిందా స్తుతి కూడా విందా స్తుతిలా ఉంది..
అందుకే కదా ఇతగాడి కోసం సామాన్యంగా మెట్లు దిగుతూ వస్తుంది దానికి కూడా ఒక కారణం ఉందిలే..

No comments:

Post a Comment

Pages