ఎన్నాళ్ళకో - అచ్చంగా తెలుగు

 ఎన్నాళ్ళకో 

 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


ఎన్నో గ్రహణాల తరువాత ఈకాంతి విచ్చింది.

ఎన్నో భ్రమణాల తరువాత ఈస్థిరత్వం వచ్చింది.

ఎన్నో బోధల తరువాత ఈభ్రమ తొలగింది.

ఎన్నో ఆవేదనల తరువాత ఈఆనందం కలిగింది.

ఎన్నో ఆటంకాల తరువాత ఈవిజయం వరించింది.

ఎన్నో కష్టాల తరువాత ఈఇష్టం తరించింది.

ఎన్నో అశాంతుల తరువాత ఈశాంతి చేరింది. 

ఎన్నో కోపాల తరువాత ఈతాపం తీరింది.

ఎన్నో శిక్షల తరువాత ఈరక్షణ కలిగింది.

ఎన్నో మైకాల తరువాత ఈమనసు మారింది.

ఎన్నో తపనల తరువాత ఈ తృష్ణ తీరింది.

ఎన్నో గమనాల తరువాత ఈనడక గమ్యం చేరింది. 

 ***

No comments:

Post a Comment

Pages