శివం - 91 - అచ్చంగా తెలుగు
శివం - 91
రాజ కార్తీక్
 



(హర సిద్దు.. ఆలయంలోకి వచ్చాడు అందరికీ శివలింగం లా కనపడుతున్న నేను.. హరసిద్ధకి సాక్షాత్తు నేనే కనపడుతున్నాను.. రాజు గారి మీద దాడి చేయడానికి వచ్చారు అనుకున్నారు అందరూ. అక్కడే తన తల్లి కూడా ఉన్నది.. అందరికీ బహు ఉత్కంఠగా ఉంది )

దూరంగా నా వైపు అడుగులు ఆపకుండా ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు హరసిద్ధుడు..

నా వైపు చూస్తున్న చూపుతో.. 
కొద్దిపాటి మంది మార్బలం ఉండటంతో.. రాజు గారి కూడా హరసిద్ధుడు ఏమన్నా దాడి చేస్తాడు అని భయపడ్డాడు..

హర సిద్దు "ఏమయ్యా ఏం మనిషివయ్యా! కాదు దేవుడివయ్యా నువ్వు, నీకోసం నేను అక్కడ అలాగే కూర్చుంటే, పని మధ్యలో వదిలేసి వస్తే ఎలా? నాకున్న సమయమే కొద్దిపాటిది.. సూర్యోదయం అయిపోయిన వెంటనే శివరాత్రి గడియలు ముగియగా  లోపే నాకు మరణ శిక్ష అమలు చేస్తారు కదా.. అన్నీ తెలిసి ఇంకా కొంత పని బాకీ పెట్టుకుని వస్తే ఎట్లా అయ్యా? ఎక్కడ పట్టుకునేది నిన్ను నేను.. నేనా మనిషిని నువ్వా దేవుడివి ఎక్కడికన్నా పోతావు, ఏమన్నా చేస్తావు. ఎలాగయ్యా ఇది?" అంటూ స్నేహితుడితో వాదన పెట్టుకున్నట్టు నాతో మాట్లాడుతున్నాడు..

అక్కడ వారెవరికి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు హారసిద్దు ఎవరితో మాట్లాడుతున్నాడు మరణ భయంతో పిచ్చి పట్టిందా మతి భ్రమించినదా అని అందరూ అనుకుంటున్నారు..

అలా మాట్లాడుకుంటూ ముందుకు వస్తుండగా హరసిద్ధకి తన తల్లి కనబడింది..

'తల్లిని మించిన దైవము లేదు శంకరడిని మించిన దైవము లేదు' అని తన నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి

"అమ్మ ఎలా ఉన్నావ్ అమ్మ.. నిన్ను చూడకుండా పోతానేమో అని కొద్దిగా దిగులు పడ్డాను.. అమ్మా, కాలం కలిసి రాక బాధపడ్డా గాని నేను ఎటువంటి తప్పు చేయలేదు అమ్మ.. ఎందుకో దేవుడు నీకు నాకు సరిగ్గా శృతి కుదిరించలేదు అమ్మ.. అందరికీ బిడ్డలు పూజల చేత వరాల చేత పుడతారు.. కానీ నేను మాత్రం నీ పూర్వజన పాపం చేత మీ శాపపు చేత పుట్టాను.. నేను నీకు ఏమీ చేయలేకపోయాను.. నేనున్నా లేకపోయినా వాడిని బాగా చూసుకుంటాడు భయపడొద్దు అమ్మ అంటూ తన తమ్ముడి గురించి చెప్పాడు..
ఇదేంటి తిరుగుబాటు చేయదలచిన.. హరసిద్ధుడు
ఇలా శాంతి పలుకులు పలుకుతున్నాడని కొంతమందికి ఏమి అర్థం కాలేదు..

హర సిద్దు "అమ్మ నేను చెప్పింది వినమ్మా! నా మరణం తర్వాత అయినా ఒక్కసారి కుంభరాజ్యంలోకి వెళ్లి నేను హరసిద్ధుని తల్లి అని చెప్పి అక్కడ ధర్మయ్య బాబాయి ఉంటాడు ఆస్థానంలో ఆయన దగ్గరికి వెళ్లి నాకు రావాల్సిన సొమ్మంతా నువ్వు తీసుకొని కనీసం నువ్వన్న హాయిగా సుఖంగా బతకమ్మ అనవసరపు కష్టాలు ఊరికే పడవద్దు అమ్మ.. ఈ జన్మకి నేను చేయగలిగింది ఇంతేనమ్మ.. మరుసటి జన్మంటూ ఉంటే మీకు మంచి కొడుకుగా నీ మాట విని అన్ని మంచిగా చేసి కొడుకుగా పుడతానమ్మా.. అమ్మ నాకు ఎ ప్పుడు నాయనమ్మ వేరు నువ్వు వేరు కాదమ్మా.. ఎందుకిలా నా జీ వి తం అయిపోయిందో నాకు కూడా తెలియదు అమ్మ.. నేను ఏ రోజు అన్యాయంగా సంపాదించలేదమ్మా ప్రతిదీ నా కష్టార్జనే ధర్మార్జనే.. అంటూ తన తల్లికి పాదాభివందనం చేశాడు.. తన తల్లి చుట్టుపక్కల ఉన్న తన బంధుకడానికి కూడా ఇక వీడ్కోలు అన్నట్టు నమస్కారం చేశాడు..

ఎవరిని గెలవలేని నన్ను గే లిచిన విజేత నా వైపు అడుగులు బలంగా వేస్తున్నాడు..

రాజుగారు మాత్రం సైనికులు రావడం కోసం ఎదురుచూస్తున్నాడు..

మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు హరసిద్ధుని మోహంలో. వింత తేజస్సు చూస్తున్నారు.

మంత్రి "మహారాజా అతగాడికి నిజంగా ఈశ్వరుడు ఏమైనా కనబడుతున్నాడా అతను చెప్పిన విధంగా"

అయ్యన్న రాజు "మంత్రివర్య ఈ పొగరుబోతు వాడిని ఈ వితండవాదిని మీరు వెనకేసుకు రావద్దు అని మరొక్కసారి హెచ్చరిక తో కూడిన మనవి చేస్తున్నాను" 

హర సిద్దు "కు0 భన్న రావయ్య! ఆ మొహం ఒకటి చెక్కుతాను ఇక పనైపోతుంది ఈ లోకాన్ని విడిచి ఇద్దరం వెళ్ళిపోవచ్చు రావయ్యా నా స్వామి కదు అని లాలిస్తున్నాడు..

నేను " ఎలా హర సిద్దు వీరు నన్ను పోనివ్వట్లేదు లేస్తున్న కూడా అభిషేకాలు చేస్తూ అంతే కూర్చోబెడుతున్నారు. ఇక నేను ఇకనుంచి లేవలేను .."అని అన్నాను

హర సిద్దు "స్వామి .. మళ్లీ వద్దు గాని తెల్లారేసరికి మళ్ళీ వద్దు గానిలే రావయ్య"


నేను "వీరు పోనివ్వట్లేదా హార సిద్ధ ఏం చేసేది ఇష్టపడి మరి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుందామని పూజలు అందుకుందామని తలంపుతో నేను వచ్చాను."


హర సిద్దు "రావయ్యా ఇది ఒక్కసారి కి రేపు నుంచి నేను ఉండను గా నిన్నేం అడగలేదు కదా.. వస్తావా నన్నే తీసుకెళ్ళమంటావా.."

నేను "అలాగైతే తీసుకువెళ్ళు వీళ్ళ భక్తి కన్న నీ భక్తి బలం అయితే తప్పక నీతో పాటు కదులుతాను" 

హర సిద్దు "నువ్విలా చెప్తే వినవులే కానీ ఇక తీసుకెళ్తాను ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది ఆ సుందరమైన మొఖం ఒక్కటే చెక్కుతాను ఆ తర్వాత నువ్వు గంగ దగ్గరికి వెళ్తావో పార్వతి దగ్గరికి వెళ్తావో విష్ణు దగ్గరకి వెళ్తావో గుడికి వెళ్తావా స్మశానానికి వెళ్తావా నీ ఇష్టం."

అంటూ ముందుకి వేగంగా కదులుతున్నాడు.. అక్కడున్న వారికి మాత్రం హరసిద్ధికి పిచ్చి పట్టిందా అని అనుకుంటున్నారు రాజుగారికి ఏ రకమైన ప్రమాదం ఉండబోదు అని భావిస్తున్నారు.. ఇదంతా కొన్ని నిమిషాల్లో జరిగిపోయింది..

హర సిద్దు "అయితే నేనే వచ్చి తీసుకెళ్తున్నాను, వస్తున్నాను కుంభన్న" 

రా అని సెగ చేస్తూ నేను అంతే నా ఆసీనంలో కూర్చున్నాను.. అందరికీ అది శివలింగం హర సిద్దుకు మాత్రం నేనే.


హరసిద్ధుడు వేగంగా ముందుకు కదలడంతో గర్బ మూర్తిని తాకితే మైల పడుతుందని ఉద్దేశం తో అక్కడ కొంతమంది రాకుండా అడ్డం పడ్డారు కానీ హరసిద్దు.. వారిని ఒక్క తోపు తోసాడు..

రాజు గారి వైపు కనీసం ఫోను కూడా పోలేదు..

మూలవిరాట్ అదే నా దగ్గరికి బలంగా వచ్చి నా చేతిని పెట్టుకొని అంతే పైకి లేపాడు 

ఆసనంలో కూర్చున్న వారిని చేయి ఇచ్చి ఎలా పైకి లేపుతారో.. అలా

ఏం జరగబోతుందో అందరూ చూస్తున్నారు..

అందరి కళ్ళకి అక్కడున్న శివలింగం కదులుతున్నట్టు కనిపిస్తుంది హరసిద్ధికు మాత్రం తన చేతికి నేను చేయించి పైకి లేస్తున్నట్టు కనిపిస్తుంది..

హర సిద్దు "రావయ్యా తొందరగా రా సమయం మించిపోతుంది అంటూ సామాన్య మనిషిని లాగినట్టు నన్ను పైకి లాగాడు."
నన్ను పట్టుకున్న హారసిద్ధుడికి పూర్తి బాహ్య స్మృతి పోయింది కేవలం నేను నాతో అతను చేయవలసిన పని తప్ప చుట్టుపక్కల మరి ఏమీ కనపడట్లేదు

మీరు కూడా అంతే ఉండండి నన్ను నమ్మి మీరు చేయవలసిన పని చేయండి ఇక మిగతాది ఏమీ కనపడకూడదు..

అంతే శివ లింగం కదిలింది..

జనాలందరూ ఊపిరి శరీరం బి గబట్టి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు అంటే.. ఇప్పటివరకు హారసిద్ధుడు మాట్లాడింది సాక్షాత్తు పరమేశ్వరుడు అంటే హారసిద్దు చెప్పినది కథ కాదా వాస్తవమేనా
.
ఒక మనిషి తన చేతి తో పట్టుకొని.. ఏ విధంగా మరొక మనిషిని తీసుకెళ్తున్నారు ఆ విధంగా హర సిద్దు నేను గోచరిస్తున్నాను అంతే నడవబోతున్నాను..

గర్భాలయంలో నుంచి. ఉన్నచోటి నుండి శివలింగం పాను వట్టం తొ సహా కదిలిపోయింది..

ఆ కదలిక అజ్ఞానుల గుండెల్లో ప్రకంపన రేపింది

నన్ను పట్టుకొని అదే శివలింగాన్ని పట్టుకొని హారసిద్ధుడు ముందుకి నడుస్తున్నాడు..

ఈ చర్యతో అందరూ మూకుమ్మడిగా నిశ్శబ్దం వహించారు నిజ దేవుని మహిమ చూసి హారసిద్ధునికి అందరూ మోకరిల్లారు..

రాజుగారి కూడా హరసిద్ధుని పరిశుద్ధత చూసి.. రెండు చేతులు జోడించారు.. మంత్రిగారైతే కళ్ల వెంట నీరు పెట్టుకున్న తన్మయిత్వంతో..

హరి సిద్ధునికి నేను తప్ప ఏమీ కనబడట్లేదు నేను తన గమ్యం తప్ప ఏమీ కనపడదు కూడా..

శివలింగ మధ్యభాగాన్ని పట్టుకొని హారసిద్ధునితోపాటు శివలింగం నడుస్తున్నట్టు కనపడుతుంది అందరికీ

హర సిద్దు "ఏం దేవుడవయ్యా నువ్వు ఎక్కడెక్కడ వెతకాలయ్యా నిన్ను.. ఆ తల్లి పార్వతమ్మకి నిన్ను వెతుకుతున్నందుకే జగమంత తిరిగి  జగన్మాతా అని అన్నారేమో అయ్యా అంటూ చలో క్తి విసిరాడు

హరసిద్దని తల్లి ఇదంతా చూసి ఆశ్చర్య చికితురాలయింది ఏనాడు ఉదయాన్నే లేచి పూజ కూడా చేసి ఉండని హారసిద్ధుడి కోసం సాక్షాత్తు హరుడా..

హర సిద్దు "త్వరగా కథలవయ్యా త్వరగా రావయ్యా"అంటూ విసుక్కుంటున్నాడు

నేను "హరి సిద్ధా ఈ త్రిశూలం అడ్డు వస్తుంది . కథ సర్దుకొని అయ్యా నేను దేవుణ్ణి అయ్యా కొంచెం గౌరవం ఇవ్వు.."అంటూ సరదాగా స్నేహితునికి వలె జవాబు ఇచ్చాను

నా చేతిలో ఉన్న త్రిశూలాన్ని నేను పట్టుకుంటా నాకు ఇవ్వు అని చెప్పి. నా చేతిలో నుంచి లాక్కొని.. కుడి చేతితో నా చేయి పట్టుకొని ఎడం చేత్తో త్రిశూలం తీసుకొని అంతే ముందుకి పెట్టాడు హరసిద్ధుడు..
అది సరిగ్గా తన తల్లి ముందు..

తన తల్లికి ఆనందభాష్పాలు జలజల రాలాయి..
తన కొడుకు లో ఉన్న. భక్తికి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడా ఇది విష్ణు మాయ అని ఆలోచనలో పడ్డది

గర్భాలయంలో శివలింగం పూర్తిగా ముందుకు రావటంతో ఇప్పుడు అక్కడ రాణి గారి హారం కనబడింది ఏ నేరము మోపి ఉరిశిక్ష విధించారు
హారము కనబడింది.. ఆరోజు గుడిలో చిన్నపాటి భూకంపం రావడంతో మహారాణి స్పృహ తప్పడంతో.. భూకంపదాటికి శివలింగం పక్కకు జరిగి ఈలోపు ఆ హారం దాంట్లో పడి.. మళ్లీ శివలింగం అచ్చుపట్టినట్టే.. స్థిరపడింది.. అందుకే శివలింగం కింద హారము ఉన్నట్టు ఎవరికి అనుమానం కూడా రాలేదు

మంత్రి "అతగాడు చెబుతూనే ఉన్నాడు నేనే తప్పు చేయలేదు అందరితో పాటు నేను ఉన్నా కదా ఎలా తీసుకువెళ్తానని చెప్పని అతనికి సమాధానం చెప్పలేక ప్రభు చాలా మూర్ఖంగా వ్యవహరించారు మీరు "అని కోపంగా

హారం కనపడటంతో అయ్యన్నరాజు తనకి ఎంత తప్పు చేశాడు.. తన తీర్పు ఎంత తప్పుదో.. హరి సిద్ధుని వాదనా పటిమ ఎంత గొప్పదో.
సాక్షాత్తు శివుడిని నడిపించిన ఆ భక్తుడి మనసు ఎంత గొప్పదో తను అర్థం చేసుకొని కళ్ల వెంట నీటి ధారతో పశ్చాతపం చెందాడు..

నేను "  ఎక్కడికి లాకెళ్లుతున్నవ్ నన్ను "

హ సి "   కుంబన్న ఆ విగ్రహం దగ్గరికి మొహం ఒక్కడి చెక్కాలి కదా, ఎంతమంది భక్తుల పూజలలో పడి మన విషయం  మరిచినట్లు ఉన్నావ్ "

అక్కడున్న భక్తులందరూ ఈ సంఘటనని నమ్మి హర సిద్ధుని యొక్క భక్తి తథాత్మయంతో. ఒల లాడిపోయారు

సైనికులు కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సంఘటన చూసి వారి చేతుల్లో ఉన్న బరిసెలు వాయిదాలు కూడా వదిలేశారు.

అయ్యన్న రాజు వారిని చూసి శాంతించండి ఆయుధాలు వదలండి అని సైగ చేశాడు


జ్వరం వల్ల వచ్చే సాక్ష్యం చెప్పలేకపోయినా తాత ఇప్పుడు హరసిద్ధునికి ఎదురుగా వస్తున్నాడు..

తాత హరసిద్ధుడు శివలింగాన్ని బట్టి నడిపించటం చూసి .. ఆనంద భాష్పాలు రాలుస్తూ భక్తితో

"స్వామి మా హరి సిద్దుకి ఉరి వేస్తారేమో అని భయంగా రాజుగారు ఇక్కడ ఉన్నారేమో అని కనుక్కొని నాకు తెలిసి నిజం చెబుదామని ఈ గుడికి వచ్చాను ఏమీ నిదర్శనం చూపించావు స్వామి అంటూ ఆనందంగా ఏడుస్తున్నాడు..

హరి సిద్దు తాత ను దాటుతుండగా..

తాత శివలింగాన్ని నమస్కారం చేస్తూ .."కుంభన్న నువ్వు వచ్చావా మా వాడిని కాపాడావా చాలు స్వామి ఎక్కడికి వెళ్తున్నావ్ "అని ప్రార్థన లాగా అడిగాడు..

హర సిద్దనికి వేరేమీ కనపడట్లేదు నేను తప్ప ముందు గమ్యం తప్ప

నేను "చూడు పెద్దాయన.. నేను ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటానంటే కాదు కాకూడదు అంటూ శివరాత్రి రోజున నన్నే పట్టుకొని తను ఏదో శిల్పం చెక్కుతున్నాడు దానికి నగీషా పూర్తి అవ్వటానికి నేనే తన ఎదురుగా కూర్చోవాలని వరం కోరుకుని లాక్కెళ్ళిపోతున్నాడు.. మీ హరసిద్ధుడు.. నాతో వితండవాదం చేసి.. గెలిచాడు అయ్యా, అందుకే హారసిద్ధుల్ని కైదుగా ఉన్న మండపంలో పూర్తికాని నా విగ్రహాన్ని పూర్తి చేయడానికి నా స్నేహితుడు హరసిద్ధితో వెళ్తున్నాను " చిలిపిగా 

ఈ స్వరం మాత్రం అందరికీ వినపడింది

సరిగ్గా నడవలేని తాత .. హరి సిద్దు నీ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.. రాజుగారు మంత్రిగారు మరియు అందరూ అక్కడికి చేరారు ఒక్క నిమిషంలో..
తాత హరి సిద్ది కథ హరసిద్ధితో హరుడు చేసిన కథ నం.. కుంభరాజ్యం.. అన్ని చెప్పి.. హరసిద్ధ హరసిద్ధ అంటూ తపించాడు

నిజం తెలుసుకున్న అందరూ.. హరసిద్ద ని ఎన్ని మాటలు అన్నాము..
ఆలయానికి తీసుకువెళ్లే స్నేహితుడు దొరుకుతాడేమో గానీ భగవంతుడిని చూపించే స్నేహితుడు దొరుకుతాడా? అని చెప్పాడు..

ప్రతి ఒక్కరికి హరసిద్ధి గురించి సమృద్ధిగా అర్థమైంది
.
నిజం కూడా చెప్పలేని సాక్ష్యం నిదర్శనం చెబుతుంది.
అందుకే ఈ నిదర్శనాన్ని కావాలని చూపించాను..

రాజు " మనము చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి, ఎవరిని అడగాలి" 

తాత " హరసిద్ధుడి వెంట నడవడం మనం చేయగలిగిన పని మహారాజా! పదండి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు శివుడన్న చోటే శివాలయం శివుడు నడియాడిని చోటే శివరాత్రి ఉత్సవం"

నేను "ఏమి హరసిద్ధ గరళం తాగినప్పుడు కూడా ఇలా ఎవరూ నన్ను తొందర పెట్టలేదు.. నువ్వు ఏమిటయ్యా ఈ హడావిడి చేస్తున్నావ్ "

హార సిద్దు "పోవయ్యా.. నాతో వచ్చేయ్.. నాకు  శిక్ష అమలు చేసిన వెంటనే నీతో నన్ను తీసుకెళ్లి పో,"

హరసిద్ధునితో పరాచకాలు అంతే సాగుతున్నాయి

హర సిద్ద రాజ్యం చుట్టూ ఉన్న రాజ్యముల రాజులందరూ.. యుద్ధానికి సిద్ధమైనట్లు బయలుదేరారు... కుంభరాజ్యము వృద్ధ మహారాజు ధర్మయ్య కూడా..

గుడి బయటకి వచ్చాము, ఏ మార్గంలో హరసిద్ధుని అవమానిస్తూ కొరడాతో కొట్టుకుంటూ తీసుకువెళ్లారో అదే మార్గమున పయనం మొదలు పెట్టాము..

No comments:

Post a Comment

Pages