శివం - 90 - అచ్చంగా తెలుగు
శివం - 90

రాజ కార్తీక్ (నేను మాయమయ్యాను.. హరసిద్ధుడి దగ్గర నుండి... శిల్పమంతా అయిపోయింది కానీ ఇంకా నా మొహం ఒక్కటే చెక్క లేదు .. హరసిద్ధుడు ఏమి చేయబోతున్నాడు చూద్దాం)

రాత్రి కూడా నా సిగపై ఉన్న అర్థ చంద్రుడిని.. ప్రసన్నం చేసుకుంటూ వెలుగుని పంచుకుంటూ తీక్షణంగా నన్ను విగ్రహంగా తీర్చిదిద్దాడు.. ఇక కేవలం నా మొహం ఒక్కటే చెక్కబడాలి.. ఇప్పుడు నేను మాయమైపోయాను.. ఆచావడిలోనే హరసిద్ధుడు
" ఇక నాకు మిగిలింది ఈ ఒక్కరోజే.. శరీరమంతా చక్కటం వేరు కానీ ముఖంలోని తేజస్సు ముఖారవిందము స్పష్టంగా కొట్టిచ్చేటట్టు కనపడాలంటే కొన్ని గంటలు కచ్చితంగా పడుతుందని" తన పనితనాన్ని తాను అంచనా వేసుకున్నాడు
ఎందుకొస్తాడో ఎందుకు మాయం అయిపోతాడు ఆయన చర్యలో ఏ లీల దాగుందో ఎవరికి తెలియదు,
"నాకున్నది ఈ శివరాత్రి ఒక్క రోజు మాత్రమే
 తెల్లారితే నన్ను శివరాత్రి గడియలు అయిపోయే లోపు ఉరితీస్తారు.. అయ్యో దేవుడా ఎలా బతికున్నంత కాలం సుఖం లేదు. చావబోయేటప్పుడు కూడా సుఖం లేదు, నా జీవితం మొత్తం దేనికో ఒకదానికి కనీస అవసరానికి కూడా పాకులాడుతూ ప్రాధేయపడుతూ బ్రతకడమే.. ఏందో ఈ వెధవ జన్మ" అంటూ తనను తానే తిట్టుకున్నాడు..

నేను ఎక్కడైతే హరి సిద్ధుడ మీద నేరం మోపబడిందో అక్కడికే వచ్చాను అని హరసిద్దు అనుకుంటున్నాడు..

"కుంభన్నా" అంటూ ఆర్తి గా నాకోసం కేక వేశాడు..

హరసిద్దు.. మీద నేరo మో పబడిన గుడిలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి జనాలు తండోపతండాలుగా ఉన్నారు. దాదాపు ముప్పాతిక రాజ్యపు ప్రజలు ఆ గుడి దగ్గరే ఉన్నారు. కొత్త ఆలయం అందులోనూ ఉత్సవం వల్ల.. అక్కడ ఒక తిరునాళ్ల వాతావరణం ఉంది.. పాపం అక్కడే ఉంది హరసిద్ధి తల్లి..
హరి సిద్దు తల్లి ప్రతిరోజు ఆలయానికి వెళుతుంది కావున.. అక్కడి పురోహితులు.."ఏమమ్మా గత రెండు మూడు రోజులుగా గుడికి రావట్లేదు అంటూ పూజా సామాగ్రి తీసుకొని పూజ కావించి హరసిద్ధి సంకల్పం చదివి.. దీర్ఘాయుష్ ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఉన్నత స్థితి ప్రాప్తిరస్తు అని దీవించారు.."కొంగు చెంగున తీసుకొని ఏడ్చుకుంటూ ఆ తల్లి దీర్ఘాయుష్షు ప్రాప్తిరస్తు ఒక్కటి నిజమైతే బాగుండు స్వామి అంటూ వెక్కివెక్కి. ఏడుస్తూ ఉంది..
పాపం హార  సిద్ది తల్లి చిన్నప్పట్నుంచి జరిగినవన్నీ గుర్తుతెచ్చుకుంది.."హరసిద్దు తన తాత బామ్మ దగ్గర అల్లరి ముద్దుగా పెరగటం.. ఉన్నత విద్య అభ్యసించటం తన ప్రీతి, నిజాయితీ తన దుందుడుకుతనం, తన వాదన పటిమ, ఎప్పుడు ఎక్కడికి వచ్చినా చివరి నిమిషంలో ఓడిపోయే తన దురదృష్టపు జీవితం.. అది చెప్పిన ఎవరు నమ్మక గేలి చేసిన నవ్వుకుంటూ వెళ్లిపోయే తన మంచితనం, ఆవేశంలో అతను చేసిన తప్పులు, అన్నిటికీ మించి హరసిద్ధుడు తన తాత నాయనమ్మ మరణం తర్వాత.. తన మాట విని చేసిన పనులు.. అన్ని ఆవిరైపోతున్నాయి.. ఇక కొన్ని గంటల తర్వాత హారసిద్దు ఒక జ్ఞాపకం మాత్రమే, పాపం ఏ జన్మలో ఏ పాపం చేశాడు జీవితంలో ఏ శుభకార్యం చూడకుండా. ముచ్చట అనుభవించకుండా ఆయు తీర్చుకోపోతున్నాడు అని.. ఒక క్షణం పాటు బొంగరం లా తన తల్లి తలచింది.. అంతా తెలిసిన హరసిద్దని సోదరుడు.. తన అన్నని మానసికంగా తెగించి కాశీయాత్రకు పయనమయ్యాడు..

హరసిద్ధుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.."మనిషి కి పడే పెద్ద శిక్ష మరణశిక్ష.. ఇప్పుడు నేను ఏమి చేసినా నాకంత ఉంది కొన్ని గంటలు మాత్రమే, అంతకన్నా పెద్ద శిక్ష ఏమి పడుతుంది,ఇక నేను చేయవలసింది ఒక్కటే చనిపోయిన నాయనమ్మ కోరిక తీర్చడం కోసమే ఈ చివరి కోరిక షరతు ఒప్పుకున్నాడు..

ఒకవైపు నా మాటలు "ప్రసిద్ధ గుడిలో పూజలు అందుకోవాలని  ఉంది నేను అక్కడే ఉంటాను ,"

ఇక .. ఏదైతే అదే అయింది.. ఈ చావడి నుంచి బయలుదేరి ఆ గుడి నుంచి నన్ను తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాడు..
శిల్పాన్ని చూశాడు.. కళామతల్లికి నమస్కరించి నాకు జీవితంలో మిగిలిన చివరి రోజుని చట్టానికి చేతుల్లో తీసుకొని ధర్మం కోసం వాడుకుంటున్న క్షమించు తల్లి అని తన నడము కున్న.. గుడ్డను తీసి యుద్ధల లో లాగా తలపాగా పెట్టాడు..

చావా డిలోకి తలుపులు తీసి హారసిద్ధి వ్యతిరేక సైన్యం వచ్చి..

"ఏమయ్యా ధర్మ రక్షక ఏమయ్యా సత్యాన్వేషి.. నీవు మమ్మల్ని సంఘం ముందు ఎంతో అవమానపరిచావు మమ్మల్ని నీ ముష్టి ఘతాల తో మట్టికరి పించావు నీ మీద పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూశాం వచ్చింది చూసావా ఏమైందో నీ బతుకు అంటూ హరసిద్ధుడిని కాలితో కొట్టి కింద పడేశారు.
వారు వికటంగా నవ్వుతున్నారు

నా విగ్రహం వెనక వైపు నుంచి వచ్చి.. హరి సిద్దు ని కాలి తో కొట్టి.. వీడు ఒక కళాకారుడు వీడు ఒక కళ అని కాలితో విగ్రహాన్ని తన్నపోయాడు


. అంతే అతగాడి కాలు చేత్తో పట్టుకున్నారు సిద్ధుడు చుట్టుపక్కల ఉన్న పదిహేను మంది సైనికుల్ని తన ముష్టిఘాతాలతో తన కరములని ఖడ్గములవలే వలె వాడి... అందర్నీ మట్టి కరిపించాడు

హర సిద్దు "రేయ్ అప్పుడు కూడా మిమ్మల్ని కొట్టింది మీ తప్పులు మీరు సర్దిద్దుకోమని చెప్పడానికి మాత్రమే రా నీ మీద నాకు పగం ఉంటే ఈపాటికి మీ పిండాలు పెట్టి చాలాకాలం అయ్యేది గుర్తుపెట్టుకోండి"

హరసిద్ధుడు తప్పించుకోటానికి యత్నిస్తున్నాడు అని తెలిసి తలుపులు వేయమన్నారు.. తలుపులు వేసి ఉన్నా కూడా హరసిద్ధుడు చాకచక్యంగా గోడలు పైకెక్కి అక్కడి నుంచి చావడి బయటకి సురక్షితంగా కాలు మోపాడు..
హరసిద్ధుడి వ్యతిరేక సైనికులు అందరూ బళ్లాలతో కత్తులతో మీద దాడి చేయగా వారి దగ్గర నుంచి అవి తీసుకొని వారి కన్నా సమాంతరంగా వేగంగా , తిప్పుతూ వారికి సరైన గుణపాఠం చెప్పాడు.. ఎవరైతే ఇందాక హరసిద్ధుడిని కొట్టుకుంటూ తీసుకువచ్చి శునకా ఆనందం పొందారు వారందరికీ ఒకటి కి రెండుగా ఇచ్చి హరసిద్ధుడా మజాకా అని అనిపించాడు..

ఇప్పుడు గుర్రం మీద వచ్చాడు హరసిద్ధుడిని కొడుతున్నప్పుడు ఎందుకంత అత్యుత్సాహం మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పిన సైన్యాధికారి 

సైన్యాధికారి "తప్పించుకుందామని చూడటం మరొక నేరం వీరిని ఎందుకు ఇలా కొట్టావు అని అడిగారు

హర సిద్దు "సైనికధికార.. నేను ఒక పని కోసం బయటికి వెళ్ళాలి.. నాకు సమయం లేదు
 ఎవరిని దాడి చేయడం నా ఉద్దేశం కాదు వారు నా మీదకు దాడి చేశారు తిరిగి వారి మీదకు నేను దాడి చేశాను  ఆత్మ రక్షణ కావించుకున్నాను
మీరు భయపడవలదు నేను వెళ్లి కొద్దిసేపట్లో తిరిగి వస్తాను.. ఆలయం దగ్గరికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వస్తాను అంటూ వెళ్ళబోయాడు..

"ఆగు" అంటూ ఆ సైనిక అధికారి కూడా..మల్ల యుద్ధానికి ప్రయత్నించగా తప్పక కొన్ని ముష్టి ఘాతాలతో స్పృహ తప్పే విధంగా చేశాడు..
ఆ చావడి దగ్గర ఉన్న సైనికులు అందరూ హరసిద్ధుని దెబ్బలతో వల వల లాడుతూ కింద పడిపోయి ఉన్నారు "ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి కట్టేసి కొట్టడం ఏముంది హారసిద్ద ను వదిలిపెడితే పులి వేట ఎలా ఉంటుందో చూపించాడు"

ఆ సైనికధికారి గుర్రం తీసుకొని గుడి వైపుగా తన ప్రయాణం మొదలుపెట్టాడు..

గుళ్లోకి ఇప్పుడే మహారాజుగారు వచ్చారు..

హర సిద్దు తల్లి అతని శ్రేయోభిలాషులు..
మహారాజు గారితో మాట్లాడదామని చూస్తున్నారు.

హరసిద్దడు.. గుర్రాన్ని లంకించి పరుగు తీస్తున్నాడు.
తనని బాటలు ఏ దారిలో కొట్టుకుంటూ వచ్చాడో ఆ దారిలోనే లాగవంగా ముందుకు దూసుకెళ్లిపోతున్నారు..

ఇక కాసేపట్లో హరసిద్ధుడు ఉండబోడు అనే ఆలోచనతో హరసిద్ధి చేత సహాయం పొంది న వారు కూడా బాధలో ఉన్నారు.

హరసిద్ధి కల్లాకపటం తెలియని నవ్వు తిరిగి ఏమి ఆశించకుండా చేసిన సహాయం ఇచ్చిన ధైర్యం అన్ని వారికి గుర్తు కి వ స్తున్నాయి..

ఆలయం దగ్గర పట్టడంతో .
హర సిద్దును చూసి గుర్తించిన జనులు దూరం గా జరిగారు..

ఆలయంలోకి వెళుతున్న హారసిద్ధుని కొంతమంది బటులు అడ్డుకోగా వారిని కూడా చితక బాధడు హరసిద్ధుడు..

అక్కడ కొంత మంది ప్రత్యేక దళాల కోసం ప్రత్యుత్తరం పంపించారు.. రాజు గారి మీద దాడి చేసి రాజు గారిని చంపడం కోసం వచ్చాడని అందరూ రాజ ఉద్యోగులు సైనిక అధికారులు అక్కడ కొంతమంది జనం కూడా భావించారు..

హరసిద్ధుడు రాగానే .. దూరంగా ఉన్నా గర్భాలయంలో. అందరికీ లింగమవలే స్మురినిస్తున్న నేను.. హా రసిద్ధునికి మాత్రం సాక్షాత్తు నేనే కనపడుతున్నాను..

హరి సిద్దు ని తన తల్లి చూసి. అక్కడున్న బంధువులు చూసి కొంత ఆనందపడిన వీడు మళ్ళీ ఏం చేశాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీడికి ఏమవుతుంది అని హైరానా పడ్డారు..

గర్భాలయానికి ఎదురుగా దూరంగా ఉన్న హర.సిద్దు డు నన్ను చూస్తూ "ఏమయ్యా కుంభన్నా ఏంటయ్యా నువ్వు ఏమయ్యా ఏ పెద్దమనిషి"అని నాతో స్నేహితుని వలె గొడవకు దిగుతున్నాడు..

అక్కడున్న వారందరూ రాజు గారిని ఏమన్నా చేస్తాడేమో అని ఆలోచనతో ఉన్నారు.. రాజు అయ్యన్న కూడా ఎంతో కొంత భయపడుతున్నాడు..

అడుగులు ముందుకు వేస్తూ నా వైపు వస్తున్నాడు హరసిద్ధుడు.. ఆ అడుగులు ఆగవులే.

***


No comments:

Post a Comment

Pages