'సంపూర్ణ వ్యక్తి(త్వ) వికాసం..యోగా!' - అచ్చంగా తెలుగు

'సంపూర్ణ వ్యక్తి(త్వ) వికాసం..యోగా!'

Share This
 'సంపూర్ణ వ్యక్తి(త్వ) వికాసం..యోగా!'
-సుజాత.పి.వి.ఎల్.మానసిక శారీరక
ఒత్తిడి ఉద్వర్తనోపశమన సాంత్వనం..
తనువు, మనసు 
ఉప్పొంగే ఉత్తమ సాధనం..
సత్వ తమో రజో గుణ నియంత్రణా సాధకం..
ధారణ శ్వాస ధ్యాస ధ్యాన 
మనోలయ ఉపస్థాదనం..
దేహదారుఢ్యం
ముఖ వర్ఛస్సు ఇంపుగా ఇనుమడింపజేసే 
అద్భుత యోగం..
ఏకాగ్ర చిత్తం, 
స్థిమితం స్థిర నివాస కేంద్రం..
మనస్సు ఆత్మ అనుసంధానం
ప్రాణాయామంతో సాధ్యం..
రుగ్మతలను నివారించే నూతనోత్సాహ 
మహోన్నత శక్తి సాధనం..
శ్వాస పై ధ్యాస శాశ్వత జీవన యోగం..
మానసిక దృఢ సంకల్ప ధ్యాన మార్గం..
భారతీయ సంస్కృతి, సంప్రదాయం, 
ప్రాకృతిక ధర్మం..
ఆయురారోగ్యాల రాజయోగం..
పతంజలి మహర్షి మేథోజనిత
ఆరోగ్య వరప్రసాదం..
సమగ్ర సంపూర్ణ వ్యక్తి(త్వ) వికాసం 'యోగా!'
***


No comments:

Post a Comment

Pages