దైవమొకడే మాతలపు నొకటే - అచ్చంగా తెలుగు

దైవమొకడే మాతలపు నొకటే

Share This
 దైవమొకడే మాతలపు నొకటే

రేకు: 0337-01 సం: 04-214

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి

9866691587పల్లవి

దైవమొకడే మాతలపు నొకటే

పావనమైతిమి పదరేమా

.1: 

హరి యెటు దలచిన నటయీని

పరుగుగోరికల పనులేలా

ధర నభయ మొసగు దైవముబంట్లము

మరలి యితరులకు మఱి వెరచేమా

.2: 

పురుషోత్తమానతి బుట్టినవారము

అరిదిసిరులకై యలపేలా

సరి లక్ష్మీపతి శరణాగతులము

అరయగ నితరుల నడిగేమా

.3: 

శ్రీవేంకటపతిచేత జీవులము

దావతి నితరము తగులేలా

వావిరిని కరివరదుని వారము

తావున బందాలదగిలేమా


పల్లవి:

మా దైవము ఒకడే.(శ్రీ వేంకటేశ్వరుడేమా ఆలోచన ఒకటే.(శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి అను ఆలోచన)

అందువల్ల పవిత్రులమయ్యాముఇక ఎందుకు త్వరపడుతాం?,కోపిస్తాంచలిస్తాం? ( ఇవేవి చేయమని భావం)

.1:

హరి ఏవిధముగా తలచిన అలా అవుతుంది.

అటువంటప్పుడు పరుగెత్తే కోరికల పనులు ఎందుకు? (ఆరాటాలు అనవసరమని భావం)

ఈ భూమిలో అభయము ఇచ్చు దేవుని(శ్రీ వేంకటేశ్వరునిసేవకులము.

ఇతర దైవాల వైపు మరలి   భయము  తెచ్చుకొంటామా?( మరలమని భావం)

.2:

పురుషోత్తముడైన విష్ణువు దయతో పుట్టినవారము.

దుర్లభమైన సిరుల కొరకు  శ్రమ ఎందుకు?

ఆ లక్ష్మీపతి శరణాగతులము.

ఇక సిరులకొరకు ఇతరులను  అడుగుతామా? (అడగమని భావం)

.3:

శ్రీవేంకటపతికి లోబడిన  జీవులము.

అత్యాసక్తి చెంది ప్రయాసలకు గురియయిశ్రమపడి  ఇతరదైవాలను ఆరాధించుట ఎందుకు?

అధికుడైన బంధం తొలగించిన ఆ కరివరదునికి ఏనుగును రక్షించిన విష్ణువుకు)చెందిన వారము.

 ఇంకా ఈ లోకంలో బంధాలలో తగుల్కొంటామా? (తగులుకొనమని భావం)

ధన్యవాదములు.
 
 ***

No comments:

Post a Comment

Pages