శివం - 87 - అచ్చంగా తెలుగు

 శివం - 87 

రాజ కార్తీక్ 





(హార సిద్ధుని విచారణ కొన సాగుతుంది..తన తల్లి తప్పు ఒప్పుకో శిక్ష  తగ్గిస్తారు అని చెప్పిన హార సిద్దు ఒప్పుకోవట్లేదు ..)


అయ్యన్న రాజు .." నీకు మరణ శిక్ష తప్పదు.. గుండెలు బాదుకుంటున్న నీ తల్లిని చూసి కూడా నువ్వు నోరు తెరిచి తప్ప ఒప్పుకోకుండా ఇంకా మంచిగా ఉన్నావే, నీ అంత గజ మొండి వాడికి ఏ రకమైన శిక్ష విధించాలని నాకు బాగా తెలుసు.. నీది ఆత్మాభిమానం కాదు నిజాయితీ కాదు పనికిరాని మొండిపట్టు.. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని భ్రమ పడుతున్నారో ఏమో నీ బ్రమ ను భ్రమణం చేస్తా.. మొండివాడు రాజు కన్నా బలవంతుడు.. అదే రాజు మొండి వాడు అయితే.."

ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్న ఎన్ని రకాలుగా చెబుతున్నా హార సిద్దు మాత్రం తాను చేయని తప్పు ని ఏకంగా కూడా ఒప్పుకోవటం లేదు..
 
 కనుళ్లో ఆవేదన.. నాతో మొరపెట్టుకున్నాడు.."భగవంతుడా ఎంతో జీవితాన్ని ఊహించాను.. ఎంత గొప్ప స్థానానికి వెళ్దామని అనుకున్నాను. ఒంటరి వాడి నై కూడా ఎంతో కాలంగా పోరాడుతున్నాం కానీ నేను దురదృష్టవంతుడు అని తెలుసుకోగలిగాను.. ఎంత నమ్మినా నువ్వు నన్ను నా కర్మ వదిలేస్తావూ, కానీ నన్ను ఆదుకోవాలని అర్థం చేసుకున్నాను.. మనిషి భయపడాల్సిందే భగవంతునికి కాదు తన చేసుకునే కర్మలకి..ఎన్ని పాపాలు చేశాను నా పూర్వజన్మ ల్లో.. శత్రువు కూడా కోరుకొని దుస్థితి ఏ తప్పు చేయని నాకు.." అంటూ కనులకు ఇ వతల మానసికంగా కుంగిపోతూ కన్నీటిపర్యంతమయ్యారు..
పాపం హర సిద్ధుడు పుట్టిన దగ్గర నుంచి ఏ నాడు ఇటువంటి అపవాదు ఎదుర్కోలేదు.. అన్ని సార్లు తనని దురదృష్టం వెంటాడింది.. ఇంత అవమానం పడిన తర్వాత.. తన బతుకు మీద తనకే ఆశ లేకుండా పోయింది.. తను కన్న కలలన్నీ కరిగిపోయే రోజు ఇంత తొందరగా వస్తుందని తాను ఏనాడు అనుకోలేదు... బహుశా తనకు ఇంత వరకు పెళ్ళి కాకుండా . ఉంది ఇలా తాను అర్ధాంతరంగా చచ్చిపోతే ఆ స్త్రీ మూర్తి కి ఏమి కాకూడదని ఇలా భగవంతుడు చేశాడేమో అని తన  భుజాలని పైకి లేపి మొహాన్ని.. తుడుచుకున్నాడు...


అందరి చూపులు హర సిద్దు వైపు..
హార సిద్దు చూపులు పై నుంచి వచ్చే కుంబన్న వైపు.
హర సిద్ధుని తల్లి. చూపు రాజైన అయ్యన్న వైపు..
హర సిద్ధు మీద కోపంగా ఉన్నా సభలోని అందరూ చూపు హర సిద్ధుని పతనం వైపు..

ఏ రకంగానూ హర సిద్ధుడు తప్పు ఒప్పుకోవడం. క్షమాపణ వేడుకోవటం.. జరగబోదని ఋజువు చేసుకొని..
"ఇలాంటి మదమెక్కిన వితండవాదిని.. కొరడాతో కొట్టుకుంటూ తీసుకువెళ్లి ఉరి తీయండి" అని కోపంతో అజ్ఞాపించాడు అయ్యన్న..

మంత్రి "మహారాజా మన రాజ్యాంగాన్ని మర్చిపోయారా.. అతగాడికి చివరి కోరిక కోరుకునే హక్కు ఉంది.. తనకు ఉరిశిక్ష ఖాయమని.. తాను ఏనాడు చనిపోతాడు తెలుసుకొని అప్పటిదాకా పాపభీతి దైవభక్తతో బతికి మరుజన్మకైనా ఉత్తమంగా  కల్పించాలని దైవ ప్రార్ధన చేసుకోవాలనిమీ పూర్వీకుల శాసనాలు మర్చిపోవద్దు " 
"అది ఆ కాలము.. వీడు సమయం ఇచ్చినచో ఎలా తప్పించుకోవాలి అని పన్నాగాలు రచిస్తాడు"

కానీ మంత్రి గారి చెప్పిన విలువల ఆధారంగా హార సిద్దు కి చివరి కోరిక చేయదగిన కోరిక తీర్చా పడుతుంది.. అంతేకాకుండా అన్న మరణశిక్ష తాను ఏనాడు కోరుకుంటే ఆనాడే జరుగుతుంది ఈ గడువు మొత్తం కాలపరిమితి మూడు రోజులు మాత్రమే.. మొండి పట్టు తో హర సిద్దు ఏమి కోరిక కొర పోయినా మూడు రోజుల తర్వాత ఉరి తీయబడుతుంది...

హరసిద్దు తల్లి గుండెలు బరువుగా రోదిస్తుంది...

 హార సిద్దు బంధువులు కూడా వీడి మొండి పట్టు .. వీడి ప్రాణం మీదకి వచ్చింది అంతా వీడి కర్మ .. నష్ట జాతకుడు...అని నిట్టూర్పు విడిచి..బాధ లో ఉన్నారు.

హార సిద్దు వ్యతిరేకులు మాత్రం .. తగిన శాస్తి జరిగింది తనను అవమానించిన వాడికి అని చెప్పి.. సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు  లో..

హార సిద్దు.."కుంభ అన్న. ఎక్కడున్నావ్ నువ్వు నన్ను వచ్చి కాపాడు అని గట్టిగా .. కేక వేశాడు" ఆ కాకి కైలాసంలో ఉన్న కొన్ని పర్వతాలు కదిలిపోయాయి..
తన జీవితం మొత్తం హర సిద్దు కి కళ్ళముందు గిర్రున తిరిగింది..
తన తాత బామ్మ , తలి తండ్రీ..తనని పెంచిన వారు..తన అస్తి  .తన తాత బామ్మ ల మరణం .. తన అస్తి మొత్తం పోవటం..తన తండ్రి మరణం..తనను పెంచిన వారు చనిపోవటం..తన ను పేద వాడు అనే కారణం గా అందరూ తిరస్కరించడం....ఆకరిగా తన ధర్మ తత్పరత..శిల్ప కళ.తన సాహస ఇతివృత్తం.. కుంభ న్న, గుడి లో పోరాటం ..కుంభ రాజ్యం లో పదవి...

తనకి లీల గా గుర్తు వచ్చింది..తన నాయనమ్మ కోరిక .." శివుడు లింగరూపంలో పూజించిన శివయ్య చాలా బాగుంటాడు రా.. ఏనాడైనా నా కళ్ళకి చక్కగా అందంగా కనబడే ఒక మంచి నిలువెత్తు శివుని విగ్రహాన్ని చెక్క రా.. అని తన నాయనమ్మ తనకు చెప్పింది నిజానికి అదే పనిలో ఉన్నాడు..

రాజు అయ్యన్న చెప్పు నీ కోరిక ..

"నా చివరి కోరిక నా శిల్ప వేదికలో.. కొంత  చెక్కిన శివుని విగ్రహాన్ని అట్టి పెట్టాను.. ఆ విగ్రహాన్ని పూర్తిగా పరమేశ్వరుడు గా చెక్కి తీర్చిదిద్దాలని.."అంటూ తన ఆఖరి కోరిక నీ వెలిబుచ్చాడు..

మరి నీ మరణం ..
తన నాయనమ్మ చెప్పింది మరొకటి స్ఫురణకు వచ్చింది.. శివరాత్రి రోజు జాగరణ చేసి ప్రాణం విడిస్తే ముక్తి పొందుతారని అనేది.. దాన్ని గుర్తు తెచ్చుకున్న సిద్ధుడు.. మూడు రోజుల్లో శివరాత్రి ఉంది కదా.. శివరాత్రి జాగర0 చేసే సూర్యోదయం లోపలే నాకు మరణశిక్ష విధించే వలసిందిగా కోరుకుంటున్నానని కఠిన మైన మనసుతో చెప్పాడు..

"చావనైనా చస్తాను కా నీ తప్పు మాత్రం ఒప్పుకోవు" అని గర్జించాడు అయ్యన్న

"చావనైనా చస్తాను కానీ చేనేత పులి ఒప్పుకోను నా ఆత్మ అభిమానాన్ని చంపుకొను. " 

సభ లో కొందరు.."మింగ మెతుకు లేదు వీడి పొగరు కి తక్కువ లేదు" అని గుసగుసలాడుతున్నారు.

అయిష్టంగా ఆ శిల్ప శాల అతనిది కాబట్టి. అక్కడ ఏర్పాటు చేయకుండా అక్కడ దగ్గరలో ఉన్న పెద్ద మండపంలో.. ఆ శివుని విగ్రహాన్ని తరలించి ఆ మంటపం చుట్టుపక్కల కాపలా ఉండి అతను చెప్పిన రోజున ఉరిశిక్షకు ఏర్పాటు చేయాలని రాజాజ్ఞ చేస్తున్నాను.. ఈ నేరములకు ఇదే శిక్ష.. శిక్షకు ఇదే సరైన తీర్పు

హర సిద్దు "మహారాజా నేరం నిరూపణ కాకుండా కేవలం మీరు రాజు గారు అనే ఒకే ఒక్క అధికారంతో తో, పక్కనున్న పైశాచిక మనస్తత్వం ఉన్న వారి మాటలు విని రెచ్చిపోయి.. అనవసరంగా నన్ను శిక్షిస్తున్నారు.."

అతి కోపంతో పళ్లు కొరికిన అయ్య న్న వీడిని కొట్టుకుంటూ ఆ మండపం దాకా తీసుకు వెళ్లి మూడు రోజుల లోపల ఉరితీయండి అని మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు..

సభ ముగిసింది.

హార సిద్దు . సైనికులు చుట్టుముట్టారు..

అక్కడున్న కొంతమంది నోరుమెదపని హర్సిద్ది చేత సహాయం పొందిన  మిత్రులు మాత్రం.."ఆ భగవంతుడు న్యాయ పక్షపాతి ఎన్నటికీ కాదు.. మన మనుషులమే కాదు మన కోసం హార సిద్దు ఎంతో చేసాడు అడిగిన ప్రతిసారీ తన అన్ని అయ్యి నిలబడ్డాడు కానీ మనం కనీసం నిండు సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయాము హర సిద్ధికి అనుకూలంగా. అంటూ హర సిద్ధుని తల్లి దగ్గరికి చేరుకున్నారు.

హర సిద్దు పూర్తిగా అర్థం చేసుకున్నాడు "ఇదే నా కర్మ ఇదే నా తలరాత నా పూర్వికులు చేసిన పుణ్యం కారణంగా ఆ శివుడు మా రూపంలో వచ్చి నాతో గడిపాడు ఏమో బహుశా నేను చచ్చి అయన దగ్గరికి వెళ్తాను ఏమో.. చచ్చే లోపల నలుగురు మోయాలని, అలాంటి బతుకు బతకాలని తన తాత చెప్పాడు.. కానీ కేవలం తను యదార్థ వాది అని ఒకే ఒక కారణంగా తన దుర్దృష్టం కారణంగా.. తనను చంపటానికి నలుగురు. కాదు 8.. కాదు 16 మంది భటులు తనని మరణశయ్యపై కి తీసుకెళ్తున్నారు.." 

హార సిద్దు కి తన జీవితం మీద పూర్తిగా అశ పోయింది ..ఎంత పిలిచినా నేను రావట్లేదు అని పిలవటం మానేశాడు..

హార సిద్దు "బహుశా తాను చచ్చి కైలాసానికి వెళ్తే అక్కడ ఇస్తాడేమో అవకాశం.. వచ్చే పౌర్ణమి లోగా నా జీవితం మారిపోతుందని ఎంతో ఆనంద పడ్డ ఆశపడ్డ సంబరపడ్డా.. కానీ ఈ అమావాస్య లోపే తన జీవితం ముగిసి పోతుందని" అంటూ లోలోపల కుమిలిపోతున్నాడు.."

తన చుట్టూ చేరిన భటుల మొహాలు చూసాడు ..అందరూ తన చేత గుణ పాఠం నేర్చుకున్న వారే..ఇప్పుడు కసిగా తన మీద దాడి చేయ బోతున్నారు .కొరడాతో..

పదరా ఇక్కడి నుండి అని ఒకరు చేతులు కట్టేసి ..కోరాడ తో ఒక్క దెబ్బ వేసాడు....తట్టుకొని నిలబడ్డాడు..
ఏదో న్యాయం చేసే వాడిలాగా ఆహార సిద్ధుని శిల్ప శాల బద్దలుకొట్టి అక్కడున్న సగం చెక్కిన శివలింగాలను సగం చెక్కిన శివుడిని. మంటపం దగ్గరికి తీసుకు రావాల్సిందిగా పని పురమాయించాడు ఏదో రాజ ఆజ్ఞ ఖచ్చితంగా.. పాటించే వాడిలాగా..

తన సహాయం చేసిన ఒక్కరు కూడా తనకు అక్కరికి రాలేదని కళ్ళవెంట నీళ్లతో కలియ చూశాడు.. కొంతమంది మాత్రం తన తల్లి దగ్గర ఉండబట్టి తను లేకపోయినా తన తల్లిని సరిగ్గా చూసుకుంటామని అదొక ప్రమాణం ఏమో అన్నట్టు వాళ్ళవైపు చూసి కళ్ళతో ఒక నిట్టూర్పు విడిచాడు..

కుడలి లో కి రాజ భటులు హార సిద్దు ను తీసుకు వచ్చారు..

హార సిద్దు తల్లి స్పృహ తప్పి పోయింది..కానీ అక్కడి వారు ..ఆమె ను తీసుకు వెళ్ళారు..

వీదిల్లో చాటింపు వేశారు హర సిద్దు రాజముద్రిక దొంగిలించాడని తప్పు ఒప్పుకో లేదని ..జరిగినదంతా..

హార సిద్దు వొంటి మీద దెబ్బ పడటం మొదలు అయ్యింది..
గ్రహణం రోజున సూర్యుడు రాలేదు అని నింద వేసే మనస్తత్వం ఉన్న వారు.. హారసిద్దు చుట్టూ ఉన్నారు..

అవమానకరంగా హర్ష సిద్ధుని కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు..
ఎంతటి  గట్టి వాడు అయిన కొరడా దెబ్బలు కి తాళలేక కళ్ళవెంట నీళ్ళు తో అమ్మ అమ్మ అని అరవట మొదలు పెట్టాడు..

హర సిద్ధుడు మీద పడి ప్రతి దెబ్బకి ప్రకృతి కన్నెర్ర చేస్తున్నట్టు ఆకాశంలో మెరుపులు తమ ప్రభావాన్ని చూప సాగాయి..

తాను మంచి చెప్పి గుణపాఠం నేర్పిన పాపానికి తమ జీవితాల్లోని అవలక్షణాలు వదులుకోకుండా పగ బట్ట వి రు ఇలా చేస్తున్నారని హర సిద్దు క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసు..

హార సిద్దు కి నోరు పిండి పోయిందని చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.. దెబ్బ మీద దెబ్బ పడుతుంటే  ఎవరు కూడా కనీసం మంచినీరు కూడా ఇవ్వట్లేదు..

ఎవరో ఒక చెంబు నిండా మంచినీరు ఇచ్చారు.. అవి ఆపకుండా తాగాడు తీరా చూస్తే ఆ నీరు ఇచ్చింది తనని మోసం చేసిన ఆచార్యుడు.. ఆచార్యునికి  తన కంటే తక్కువ వాడు అని తనను దాటి పోతాడని తప్ప ఏ ప్పుడు తనని చనిపోవాలని కోరుకో లేదు కాకపోతే తన  ఇబ్బందిపడుతూ తన పాదాల దగ్గరికి వచ్చి మళ్లీ రావాలని మాత్రం అతగాడి కోరుకున్నాడు.. మంచినీరు తాగి హర సిద్ధడు అతని కపట మనస్తత్వానికి.. ఒక నమస్కారం చేశాడు..

ఇప్పుడు పడింది మరొక దెబ్బ .. ఎదురుగా తన నిజ జీవితంలో గెలి చేసిన వాడు , జీవితంలో కొంత తప్ప పెద్ద ధనం సంపాదించే లేవు నీకు నా కూతురిని ఇవ్వాలా అని తనని తక్కువ చేసి మాట్లాడి న వాడు అతని కళ్ళముందు కనపడ్డాడు.. హర్షిత్ ధోని ప్రాణం ఇక్కడే పోయింది ఎవరు ముందు తాను ఉన్నతంగా బతకాలని కోరుకున్నాడు వారి ముందే తాను జీవిత చరమాంకం చేరుకున్నాడు.. అతగాడు మాత్రం ధనము సంపాదించి రథాలు కో  నుక్కున్నాడు కానీ హార సిద్దు మాత్రం.. అవమానభారంతో తలదించుకున్నాడు.. అతగాడి నవ్వులో తన కూతుర్ని తాను కాపాడుకున్నాడు అని ఎంతో ధీమా వ్యక్తం అవుతుంది..


అలా ముందుకు సాగుతూ ఉండగా.. తాను ఎవరికైతే తన జీవితం ఉన్నతంగా ఉంటుంది చూడండి అని చెప్పాడో వారందరూ ఒకరిమీద ఒకరు తారస పడటం మొదలు పెట్టారు..

ఇప్పుడు మరొక ఎత్తు ఎవరినైతే తాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో దెబ్బలు తింటూ సరిగ్గా ఆవిడ ముందుకొచ్చి ఆగారు..

హార సిద్దు ని మనసు లో అవమాన భారం హిమాలయాలను దాటిపోయింది.

ఆమె మాత్రo అర్థమైందా నీ బతుకు అని ఒక చూపు చూసింది

ఆకాశమంత ఎత్తుగా ఉండే.  హార సిద్దు ఆత్మాభిమానం.. పాతాళం లోకి పడి పోయింది.

ఇప్పుడు వారి కొట్టిన దెబ్బకి కిందపడ్డ , అక్కడే ఉన్న చిన్న నీటి గుంటలో.. తన మొహాన్ని తానే చూసుకుంటున్నాడు.. తన పెదవులు కోస్తున్న రక్తాన్ని తన అరచేతితో తుడుచుకున్నాడు..

నన్ను తలచు కుందాము అనుకోని కూడా .. ఉపయోగం లేదు అని.. తాను కలలు కన్న జీవితాన్ని నీటి గుంటలో చూసుకున్నాడు.. కానీ అందులో కాలు వేసి ఆ భటుడు లే పద తొందరగా అని మరొకసారి క్రూరంగా కొరడాతో కొట్టాడు..

సైనికుల లో ఒకరు మాత్రం.."ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నావు.." అని అంటున్నాడు
పక్కన గుంపు లో ఉన్న హర సిద్ధుని .. ఎరిగిన వ్యక్తి.

"మా హార బాబు.. కాలం బాగోక చిక్కాడు కట్టేసి కొట్టడం ఏముంది.. ఒకసారి కట్లు విప్పి చూడండి హర్సిద్ది దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు అయన్ని కొట్టే వాళ్ళు ఎవరు ఇంకా మర్చిపోలేదు అని ఏకరువు పెట్టాడు..

ఆ సైనికుడు .."అధిక ప్రసంగం మాఫీ పక్కకి పో "అని ఆజ్ఞ వేశాడు..

హర సిద్ధుని ఓపిక క్షీణిస్తూ వస్తుంది..

ఈసారి కొట్టిన దెబ్బకి  "అమ్మ..మ్మ మ్మ" అంటూ బాధలో హారతి కర్పూరంలా కరిగిపోయాడు..

ఒక్క నిమిషం వరకు తనకున్న చిన్నపాటి ఈ జీవితంలో తాను అనుభవించిన సంతోష క్షణాలు తలుచుకున్నాడు.. శిక్ష కన్నా కూడా అవమాన భారమే హార సిద్దు ను ముప్పావు చంపేస్తుంది..

అక్కడ ఒక ముష్టివాడు కూర్చుని ఉండగా తన జేబులో ఉన్న కాసులు అన్నీ తీసి తనకిక వాటితో పనిలేదు అని  ఉన్న  మొత్తం ఆ ముష్టి వాడికి.. ఇచ్చేశాడు.. ధనమున్న లేకున్నా తాను ఒక రాచరికo తెలిసిన వ్యక్తి అని నిరూపించుకుంటూ..

ఇలా ఒకరిద్దరు ఏమిటి జీవితంలో ఎవరు ముందు  ఉన్నతంగా ఉండాలని అనుకున్నాడు.. అందరి ముందు భరించరాని అవమానం జరిగింది..

మానసికంగా పూర్తిగా శారీరకంగా మరొక మూడు రోజులు అంటి పట్టుకునే విధంగా మన హర సిద్ధుడు అయిపోయాడు..

అక్కడున్న సైనికులు దాదాపుగా అందరూ హర సిద్ధుని మీద పగ తీర్చుకున్నారు..

ఆయన చెప్పిన మండపం దగ్గరికి వచ్చింది..
అప్పటికే అక్కడ అ నా రూపాన్ని చెక్కే విధంగా తయారు చేస్తున్నా శిల సిద్ధంగా ఉంది..

హర సిద్ధుని ఖైదు కి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి.


హార సిద్ధుని మంటపన్ల్లోకి తోసి.. తప్పించుకునే ప్రయత్నం చేసావో వెంటనే ఉరి తీస్తాను గుర్తుపెట్టుకో ఈ పొలిమేర దాటిన ఎక్కడికి పోలేవు అలా ఉంది కట్టుదిట్టమైన భద్రత అని హెచ్చరించారు.. కళలకు సంబంధించిన చివరి కోరికలు కోరుకునే వారికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం అందుకే నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాము లేకపోతే అక్కడే చెరసాలలో వేసేవాళ్ళ గుర్తుపెట్టుకో.. అని ఇందాక అత్యుత్సాహం వద్దు అన్న సైనికుడు చెప్పాడు

మంటపాన్ని పూర్తిగా మూసేశారు..

హర సిద్ధుడు నన్ను చక్క పోతున్నా.. శిలా ప్రతిమ దగ్గరికి వచ్చి తన ఒంటి ని సరి చేసుకుంటూ ఆ ప్రతిమని ఒకసారి అలా పట్టుకున్నాడు

వెనక నుండి నా పిలుపు హర సిద్దా అని

వెనక్కి తిరిగి చూసిన హార సిద్దు కి ..కుంభన్న..

ఇది వరకు కుంభన్న గా వచ్చిన నేను మళ్లీ అదే రూపం లో .

హార సిద్దుడు ఖిన్నుడుఅయ్యడు..
(సశేషం)

***

No comments:

Post a Comment

Pages