తంజావూరులోని బృహదీశ్వర స్వామి ఆలయ విశిష్టత - అచ్చంగా తెలుగు

తంజావూరులోని బృహదీశ్వర స్వామి ఆలయ విశిష్టత

Share This

 తంజావూరులోని బృహదీశ్వర స్వామి ఆలయ విశిష్టత

అంబడిపూడి శ్యామసుందర రావు చోళ రాజు లలో ప్రముఖుడైన రాజరాజచోళుడు 11వ శతాబ్దంలో నిర్మించిన తమిళ్ నాడు లోని తంజావూరు బృహదీశ్వరాలయం  భారతదేశంలో నిర్మాణపరంగా అత్యద్బుతం అనిపించే ఆలయాలలో ప్రముఖంగా నిలుస్తుంది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.ఈ ఆలయము అనేక ప్రత్యేకతలతో కూడుకున్నది ఇప్పటికి అర్ధము కానీ విశేషాలు ఈ ఆలయములో అనేకము ఉన్నాయి. బృహదీశ్వరాలయం అన్నా తమిళంలో పెరియకోయిల్ అన్నా పెద్దగుడి అని అర్థం. ఆ పేరుకి తగ్గట్లే నిజంగా చాలా పెద్దగానే ఉంటుంది ఈ ఆలయాన్నీ క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేశారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు నిదర్శనం. ఈ ఆలయం ఈ ఆలయం నిర్మాణ నైపుణ్యపరంగా, శిల్పకళా వైభవపరంగా చాల ప్రసిద్ది చెందిన ఆలయం. ఈ ఆలయము యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలు కనిపించే ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ సంఘ వైభవానికి, అప్పటి ప్రజల కళాత్మక జీవనవిధానానికీ ఓ మచ్చు తునక పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రానెట్ శిలతో ఈ ఆలయ శిఖారాగ్రాన్ని నిర్మించారు. అంత బరువున్న ఆ ఏకశిలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవ్వరికి అర్థం కాని ఓ విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏటవాలుగా ఒక రాతి వంతెనను కట్టి దాని పైనుండి  ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని చెపుతారు అంత ఎక్కువ బరువు గల రాయిని ఏ విధమైన సిమ్మెంట్, ఉక్కూ సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏరకమైన ఏటవాలూ లేకుండా నిర్మింపబడడం అనేది నిజంగా ఇప్పటికీ అంతుపట్టని ఓ విశేషమనే చెప్పుకోవాలి. మిట్టమధ్యాహ్నమైనా ఈ గోపురం యొక్క నీడ ఎక్కడా మనకి కనిపించకపోవడం మరో విశేషం. మనం మాట్లాడుకునే శబ్దాలు చుట్టూ రాతి కట్టడాలు ఉన్నప్పటికీ మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని అప్పటి శిల్పులు , వేద శాస్త్రజ్ఞులూ నిర్మించారు

ఈ ఆలయంలో గర్బగుడిలోని శివలింగం 13 అడుగుల ఏకశిలా నిర్మితం.ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా కనిపించే నంది విగ్రహం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో ఈ నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుకోవచ్చు.ఈ నిర్మాణ శిల్పి చైన్నై, మహాబలిపురం వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఆలయ విగ్రహాలు ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెపుతుంటారు

 వేయి సంవత్సరాల పూర్వము నిర్మింపబడ్డ ఆలయము అయినప్పటికీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతే కాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం.  ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏమిటి అంటే  మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంద్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది.సాధారణముగా అన్ని ఆలయాలలో ప్రాకారము వద్ద ఉండే గాలి గోపురము పెద్దదిగాను ప్రధాన ఆలయ గోపురము చిన్నది గాను ఉంటుంది కానీ ఈ ఆలయములో గాలి గోపురము చిన్నదిగాను ప్రధాన ఆలయ గోపురము పెద్దదిగాను ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. 

ఈ ఆలయము  మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది, 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పూర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.]ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉంది.

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి కనుక తమిళనాడు వెళ్ళేవారు తప్పకుండా ఈ ఆలయాలను  చూడటం మాత్రం మరవకండి.

 ***

No comments:

Post a Comment

Pages